శరీరనిర్మాణానికి ప్రోటీన్స్ చాలా అవసరం. అయితే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్యసమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. - క్రమబద్దమైన డైట్ ను ఫాలో అవుతూ స్నాక్స్, స్వీట్స్ వంటి జంక్ ఫుడ్ తీసుకోపోయినా బరువు పెరుగుతున్నారా? అయితే మీ డైట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి అంటున్నారు పరిశోధకులు. మోతాదుకు మించి ప్రోటీన్ డైట్ వలన బరువు పెరగడంతో పాటు అనేక అనారోగ్యసమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. - ఎక్కువ రోజులు హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని అమెరికన్ జర్నల్ అఫ్ కిడ్నీ లో వచ్చిన జర్నల్లో హెచ్చరించారు. ముఖ్యంగా, హై ప్రోటీన్, లో కార్బ్ డైట్ లో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు బాడీ లో కేటోన్స్ పెరిగి కిడ్నీ సమస్యలు వస్తాయి. - ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే మరో సమస్య దుర్గంధ భరితమైన వాసన. శరీరంలో పెరిగే కేటోన్స్ కారణంగా వచ్చే ఈ దుర్వాసన ఎన్నిరకాల ఓరల్ హెల్త్ టిప్స్ తీసుకున్నా తగ్గదు. ఆహారంలో ప్రోటీన్ తగ్గించడమే ఏకైక నివారణ మార్గం. - మరో ప్రధాన సమస్య హై ప్రోటీన్ డైట్ తీసుకునేవారిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా దాహం వేస్తుంది. ప్రోటీన్లను అమినో ఆసిడ్స్ గా మార్చే ప్రయత్నంలో కాలేయం ఎక్కువ సమయం పనిచేయడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవద్దు.