మండె ఎండల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే చినుకుల కోసం మనమంతా ఎంతో అతుత్రగా ఎదురుచూస్తున్నాం. ఆహ్లాదాన్నిచ్చే చినుకులను ఆనందంగా ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు సీజనల్గా వచ్చే అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవచ్చు. షవానకాలంలో జలుబు, వైరల్ జ్వరం, మెదడు వాపు, అలెర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో వైరస్, బాక్టీరియాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. - వానా కాలంలో తాగు నీటి ద్వారానే చాలా సమస్యలు వస్తాయి. నీటిని కాచి చల్లార్చిన తర్వాత ఫిల్టర్ చేసి తాగితే మంచిది. - సూక్ష్యక్రిముల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవటానికి టీ లేదా అల్లం టీ, నిమ్మకాయ టీ,వేడి కూరగాయల సూప్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. షశరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చే పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటి మీద ఉండే అనేక క్రిములను తొలగించడానికి వాటిని ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచి, శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. షవానా కాలంలో బాగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. - తాజాగా వండిన ఆహారం లేదా తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. - ఈ కాలంలో ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా వెల్లుల్లి, మిరియాలు,అల్లం,పసుపు మరియు కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. - వానా కాలంలో సాధ్యమైనంతవరకు వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ఫుడ్లకు దూరంగా ఉండాలి.