విద్యుత్ అవసరాలు నానాటికీ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్‌ను ఆదా చేయడం అత్యంత అవశ్యకమయ్యింది. అందుకు విద్యుత్తును సక్రమంగా వినియోగిస్తూ, విద్యుత్ వథావినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.
అవసరం లేనప్పుడు లైట్లను, ఇతర విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం. సూర్యరశ్మిని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవడం, పగటి పూట విద్యుత్ వాడకాన్ని నిరోధించడం. గోడలకు, సీలింగ్‌లకు లైట్ కలర్స్ వేయడం.
ప్రకతి సహజమైన వెలుగు, గాలి ధారాళంగా లోనికి రావడానికి వెంటిలేషన్ పరిధిని పెంచడం.
వెలుగు పూర్తిగా ప్రసరించడానికి ల్యాంప్‌లను, ఫిక్చర్స్‌ను శుభ్రంగా ఉంచడం. డెకొరేటివ్ లైట్లను, కన్సీలింగ్ లైట్లను సాధ్యమైనంత వరకు నిలిపి ఉంచడం.
సరియైన సైజులో వైరింగ్ చేయడం ద్వారా విద్యుత్ వథాకాకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడటం.
ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లను గానీ, సిఎఫ్ఎల్ లైట్లను గానీ, వినియోగించడం మంచిది. ఎందుకంటే, ఇవి తక్కువ విద్యుత్‌తో నడవడమే కాకుండా, ఇవి ఎక్కువ వెలుగును, దీర్ఘకాలిక మన్నికను ఇస్తాయి.
ఇంట్లో పార్టిషన్లు చేసి ఉంటే ఆ గోడల ఎత్తును సాధ్యమైనంత మేరకు తగ్గించి ఒకే బల్బు రెండు క్యాబిన్లకు వినియోగమయ్యేలా చూసుకోవడం.
కూలర్లను, ఎయిర్ కండీషనర్లను జాగ్రత్తగా వినియోగించడం. ఇవన్నీ విధిగా అనుసరించాల్సిన మార్గాలు.
సీలింగ్ ఫ్యాన్లకున్న ఎలక్టాన్రిక్ రెగ్యులేటర్ల స్థానంలో కన్వెన్షనల్ రెగ్యులేటర్లను అమర్చాలి. సీలింగ్ ఫ్యాన్ల ఎత్తులో ఎక్జాస్ట్ ఫ్యాన్లను అమర్చాలి.
రాపిడికి గురికాకుండా, ఎలక్ట్రిక్ ఫ్యాన్లకు తరుచూ గ్రీస్ పెడుతూ ఉండాలి.
రిఫ్రిజిరేటర్కు, గోడకు మధ్య ఖాళీ స్థలాన్ని ఉంచడం ద్వారా బాగా గాలి ప్రసరించేలా చూడాలి.
రిఫ్రిజిరేటర్ ఎక్కువ చల్లదనానికి గురికాకుండా చూడాలి. రిఫ్రిజిరేటర్లో వేడిగా గానీ, గోరు వెచ్చగా గానీ ఉన్న ఆహార పదార్థాలేవీ పెట్టకూడదు.
వాషింగ్ మెషిన్ ఉన్నట్లయితే ఎక్కువ మొత్తం నీళ్లతోనే శుభ్రం చేయాలి. 'టైమర్ ఫెసిలిటీ'ని వాషింగ్ మెషిన్లో ఉంచడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. అవసరమైన మోతాదులో డిటర్జెంట్ వాడాలి.
బాగా మురికిగా ఉన్న దుస్తులుంటే వేడి నీళ్లు వినియోగించడం మంచిది. ఉతికిన దుస్తులను ఎలక్టిక్ర్ డ్రైయర్‌తో కాకుండా ప్రకతి సహజంగానే డ్రై చేయాలి.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా మనకు డబ్బులు ఆదా అవడమే కాక విద్యుత్‌ను కూడా పొదుపుచేసినవాళ్లమవుతం.
Authorization