విటమిన్ల్లో మనకు తక్కువ మోతాదులో అవసమయ్యేవాటిలో విటమిన్ కె ఒకటి. ఇది రక్తం గడ్డకట్టడానికి ఉపయోగ పడుతుంది. ఎముకలు, ఇతర కణజాలంలో కొన్ని రకాల జీవక్రియలకు ఇది ఎంతో అవసరం. దీనిలో విటమిన్ కె1 , విటమిన్ కె2 అని రెండు రకాలుంటాయి. విటమిన్ కె1 - అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలో, సోయాబీన్ల్లో ఉంటుంది. చిన్నపేగులలో ఉండే ఒకవిధమైన బాక్టీరియా విటమిన్ కె1 ను విటమిన్ కె2 గా మార్చుతుంది. విటమిన్ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును. విటమిన్ కె చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. వివిధ వయసువారిలో ఈ విటమిన్ అవసరం వేరువేరుగా ఉంటుంది. చంటి బిడ్డలకు - రోజుకి 10-20 మైక్రో గ్రాముల్లో 25 ఏండ్లు వారికి- 120 మైక్రోగ్రాముల్లో పెద్దవారికి సుమారు 90 మైక్రోగ్రాముల విటమిన్ కె ప్రతిరోజూ అవసరం అవుతుంది. వేటిలో ఎక్కువగా.. విటమిన్ కె1 ఆకు పచ్చని కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూరలో అధికంగా లభిస్తుంది. క్యాబేజీ, కాలే, కాలీఫ్లవర్, బ్రోకలీల్లోనూ ఉంటుంది. ద్రాక్ష, అవకాడో వంటి కొన్ని రకాల పండ్లల్లోనూ ఉంటుంది. పేగుల్లో ఉండే కోలాన్ బాక్టీరియా విటమిన్ కె ను శరీర అవసరాలకు తగిన విధంగా మార్చుతుంది. నవజాతశిశువుల్లో కోలాన్ బాక్టీరియా ఉండదు. అందుకే పుట్టిన వెంటనే విటమిన్ కె ఇంజక్షన్ ఇస్తారు . విటమిన్కె2 మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది.