శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, అందానికి కేరాఫ్‌గా విటమిన్ 'ఇ' ను చెప్పవచ్చు. ఈ విటమిన్ మహిళల్లో గర్భాధారణ విషయంలో, మగవారిలో సంతానలేమిని నివారించడానికి అవసరం అవుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను కిల్ చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. - మన శరీరంలో జీవక్రియలు సరిగా జరగడానికి దోహదపడుతుంది. - వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి - జన్యువుల తయారీలో - వయసుతో పాటు చర్మంలో వచ్చే అనేక మార్పులను నివారిస్తుంది. - కంటిచూపు స్పష్టతకు తోడ్పడుతుంది. కంటిలో ఏర్పడే శుక్లాలను నివారిస్తుంది. - వయసు పెరిగే కొద్ది వచ్చే మతిమరపు వ్యాధిని నివారిస్తుంది. - అధిక బరువుతో ఉన్న వారిలో కొవ్వును కరిగించే శక్తి ఈ విటమిన్ ఇ'లో అధికంగా ఉంది. - ఇందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి. - శరీరంలోని క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. - రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది. - భావోద్వేగాలకు గురికావడం, అలసట ఇలాంటి లక్షణాలను విటమిన్ ఇ నివారిస్తుంది. వేటిలో ఎక్కువగా.. బాదం పప్పు, పాలకూర, అవకాడో, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాల్లో శరీరానికి కావల్సిన విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.