చాలామందిలో చిన్నప్పుడు ఫిట్స్ వచ్చి కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆగిపోతాయి. కొందరిలో మాత్రమే మళ్లీ ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందుకు కారణం డాక్టర్ సూచించిన మందులను సరైన మోతాదు వాడకపోవడమే అంటున్నారు వైద్యనిపుణులు. ఫిట్స్ వచ్చిన వారిలో దాదాపు30శాతం వారిలో ఈ విధంగా తిరిగి ఫిట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. మెదడులో కలిగే లోపాల వల్ల ఫిట్స్ వస్తాయి. అయితే కారణాలు తెలుసుకోవడానికి వీఈఈజీ, ఎంఆర్ఐ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి.ఒకసారి ఫిట్స్ వస్తే జీవితాంతం వాటిలో బాధపడాలి అనుకుంటారు. ఇది నిజం కాదు. 80శాతం మందికి ఫిట్స్ నయమయ్యే అవకాశముంది. నిపుణులైన న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన మందులను వాడాలి. చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు వారిలో మనోధైర్యం నింపాలి. అర్థం కాని అనారోగ్యం తమకు ఎదో ఉందన్న భావనరాకుండా చూసుకోవాలి.