గుండెపోటు అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. చాలాసార్లు సైలెంట్‌గా వచ్చి ప్రాణాలు హరిస్తుంది. సైలెంట్‌గా వచ్చినా ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే వాటిని మనం గుర్తించి తగిన జాగ్త్రతలు తీసుకుంటే సైలెంట్ హార్ట్ అటాక్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అసౌకర్యంగా: హార్ట్ అటాక్ కు గురవటానికి ముందు ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. కొంతమందిలో ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి లక్షణాలు మహిళల్లో , మధుమేహంతో బాధపడేవారిలో కనిపిస్తాయి. అలసట: సైలెంట్ హార్ట్ అటాక్ గురయ్యే వారిలో గుండె కండరాలపై ఒత్తిడికి గురవటం వలన గుండెకు అందే రక్తప్రవాహం తగ్గి, అలసటకు గురవుతారు. ఒకవేళ తీవ్రమైన అలసటకు గురైనపుడు గుండెపని తీరును ఎలక్ట్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. మెడ పట్టేసినట్టుగా: కొన్నిసార్లు గొంతు, మెడ పట్టేసినట్టుగా అనిపిస్తుంది. దవడ లేదా గొంతు భాగం బిగుసుకు పోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఇది సైలెంట్ హార్ట్ అటాక్ సైరన్‌గా చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలను గమనించినపుడు వెంటనే వైద్యుడిని కలవండి. వాంతులు: సైలెంట్ హార్ట్ అటాక్ కలిగే ముందు వాంతులు అవుతాయి. జీర్ణాశయ సమస్యలతో కూడా వాంతలు అవుతాయి. అయితే వాంతులతో పాటు మెడ లేదా దవడ ప్రాంతంలో అసౌకర్యాలను గమనిస్తే వెంటనే వైద్యుడుని కలవండి. గుండెల్లో మంట: సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా అసిడిటీ సమస్య వస్తుంది. అసిడిటీతో బాధపడేవారిలో గుండెల్లో మంట సమస్య వేధిస్తుంది. అయితే గుండెకు అందే రక్త ప్రవాహం తగ్గటం వలన ఛాతిలో కలిగే నొప్పి గుండెమంట లాగే అనిపిస్తుంది. గుండె మంటతో పాటు పై లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.