ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఈ టెన్షన్ తప్పించుకోవడానికి అనేక దారులను వెతుకుతున్నారు. అయితే టెన్షన్ నుంచి బయట పడాలంటే తీసుకునే ఆహారంలో అక్రోట్లు చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నట్స్ అసలే తిననివారితో పోలిస్తే.. నట్స్ తినే వారిలో టెన్షన్ ముప్పు ఎనిమిది శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు తెల్చారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఎంజెలిస్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో స్పష్టమైంది. అక్రోట్లు తీసుకునేవారిలో ఇతరులతో పోల్చితే 26శాతం వరకు ముప్పు తక్కువగా ఉంటుందని వారు వెల్లడించారు. ఏకాగ్రత, పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఇందుకు కారణం వాల్‌నట్స్‌లో ప్రత్యేకమైన కొవ్వు ఆమ్లాలు.. ముఖ్యంగా ఒమేగా 3 అల్ఫా లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటమే. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. ఇవి టెన్షన్ తగ్గడానికి ఉపయోగపడుతున్నట్టు తాజాగా స్పష్టమైంది.