నడుంనొప్పి లేదా వెన్నునొప్పి అనేది అన్ని వయస్సుల వారు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన శారీరిక సమస్య.కొన్ని కష్టమైన పని ఒత్తిడులు కూడా వెన్నునొప్పికి గల ప్రధానమైన కారణాలు. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, కండరాల ఉద్రిక్తత, వ్యాయామం చేయకపోవడం, శరీర భంగిమలు సరిగ్గా లేకపోవడం, అధిక శరీర బరువు మరియు శ్రమతో కూడిన పనులు వంటి అనేక కారణాల వలన కూడా ఈ వెన్నునొప్పి రావొచ్చు.
వెన్నెముక ప్రాంతంలో దృఢత్వాన్ని కలిగి ఉండటం, వీపు కింది భాగంలో, పిరుదుల భాగంలో నొప్పి, మంచం మీద పడుకోవడం కష్టంగా ఉండటం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, ఒకచోట స్థిరంగా కొద్దిసేపు కూడా కూర్చొలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే లోయర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నారని తెలుసుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యను పట్టించుకోని పక్షంలో ఇది భవిష్యత్తులో ఇతర తీవ్రమైన అనారోగ్య , దీర్ఘకాలిక సమస్యలకు కారణం కావొచ్చు. తక్షణ ఉపశమనం కోసం వెన్నునొప్పికి అనేకరకాల సహజ నివారణా పద్దతులు కూడా ఉన్నాయి.
వెల్లుల్లి : దీనిలోని నొప్పి నివారణ గుణాలు వెన్నునొప్పి చికిత్సలో ఉపయోగపడుతాయి. ఇందులోని అల్లిసిన్ అనే సహజ సమ్మేళనం పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ పొద్దున్నే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం మూలంగా వెన్నునొప్పి తగ్గుతుంది.
అల్లం : ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల కూడా వెన్ను నొప్పి తగ్గుతుంది.
హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్ : ది జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగస్టిక్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో తక్కువ స్థాయిలోని వెన్నునొప్పికి చికిత్స చేయడంలో 'హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్' అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పబడింది. వెన్ను బెణికినప్పుడు, నొప్పి కలిగినప్పుడు ఐస్ ప్యాక్ వంటి కోల్డ్ కంప్రెస్ లు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇది వెన్నునొప్పికి ఒక న్యూబింగ్ ఎఫెక్ట్ అందిస్తుంది. హీటింగ్ ప్యాడ్ లు లేదా వేడినీరు వంటి హీట్ కంప్రెస్ లు గట్టిపడినమైన లేదా బిగుసుకున్న కండరాలకు ఉపశమనాన్ని అందిస్తాయి. ఒక ఐస్ ప్యాక్ అప్లై చేస్తే 20 నిముషాల కంటే ఎక్కువ అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. నొప్పిని బట్టి రోజులో సాధ్యమైనంత వరకు వేడి లేదా కోల్డ్ కంప్రెస్ అప్లై చేయవచ్చు.
కోకోనట్ ఆయిల్ : ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్, మరియు యాంటీ పైరెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె అన్నిరకాల వెన్నునొప్పులకు చికిత్స చేయగలదు. కాబట్టి, తక్షణ ఉపశమనం కోసం కొబ్బరి నూనెను అప్లై చేయడానికి ప్రయత్నించండి. ప్రభావిత ప్రాంతంలో కొన్ని చుక్కల ముడి కొబ్బరి నూనెను అప్లై చేసి 10 నిముషాలపాటు మసాజ్ అనుసరించండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో మూడుసార్లు చేయండి.
చామంతి టీ : శతాబ్దాలుగా చామంతి-టీ ను నొప్పుల చికిత్సలో ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ చామంతి టీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహజంగానే వెన్నునొప్పిని తగ్గిస్తుంది మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. క్రమంగా రోజులో మూడుమార్లు చామంతి టీ తీసుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది.
పసుపు కలిపిన పాలు : పసుపు ఒక సహజసిద్దమైన గ హ నివారణా చిట్కాగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. వంటగదిలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే అత్యద్భుతమైన వైద్యలక్షణాలను కూడుకుని ఉన్న పదార్థం. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. అదేవిధంగా పాలలోని క్యాల్షియం మరియు విటమిన్ డి అధిక నిల్వల కారణంగా ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు పసుపు కలిపిన పాలను తాగడం ద్వారా వెన్నునొప్పి నుంచి నివారణ పొందవచ్చు.
వెన్నునొప్పి విపరీతంగా ఉన్నప్పుడు, ఇంటి చికిత్సలకు లొంగనప్పుడు, చేతులు, కాళ్లు తిమ్మిర్లెక్కడం లేదా మొద్దుబారడం వంటి లక్షణాలకు లోనైనప్పుడు, రాత్రి సమయంలో నొప్పి పెరుగుతున్నప్పుడు, నెలరోజుల కన్నా ఎక్కువ రోజులు వెన్నునొప్పితో బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Authorization