వృద్ధుల్లో మతిమరుపు, తడబాటు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే. అయితే కొన్నిసార్లు ఇందుకు బి12 విటమిన్ లోపమూ కారణం కావచ్చు అని పరిశోధకులు వివరిస్తున్నారు. ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ తీసుకునే ఆహారంలోని బి12 విటమిన్ను గ్రహించే శక్తి శరీరానికి తగ్గుతుంది. ఇది బి12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శాకాహారంలో బి12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బి12 మాత్రలు వేసుకోవాలి. తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.