పెద్దప్రేగు, సమర్థవంతమైన జీర్ణక్రియలను నిర్వహించడానికి, మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి శరీరానికి అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు శరీరంలోని మలినాలను శరీరం నుండి బయటకు విసర్జించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పెద్దప్రేగు సరిగా పనిచేయనట్లైతే మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన జబ్బులు వస్తాయి. కొన్నిసార్లు ఇది పెద్దప్రేగు క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పెద్దపేగు సక్రమంగా పనిచేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవాలి. పెద్ద పేగులో వచ్చే మలబద్దకం వంటి చాలా సాధారణ సవుస్యలను మంచి ఆహారంతోనే నివారించవచ్చు. అంతేకాదు క్యాన్సర్ లాంటి వాటినీ సమర్ధవంతంగా నివారించవచ్చు. పెద్దపేగులో జీర్ణమైన ఆహారం తేలిగ్గా ముందుకు కదిలేందుకు ఉపయోగపడేది ఈ పీచు పదార్థాలే. పొట్టుతో ఉండే గోధుమ, ఓట్స్, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి వంటి త ణధాన్యాల్లో, రాజ్మా, శనగలు, పెసలు, సోయూబీన్ వంటి పప్పుధాన్యాల్లో , తొక్కతో పాటే తినదగ్గ తాజా పళ్లు, తాజా కూరగాయుల్లో ఈ పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దప్రేగు ఆరోగ్యం కోసం తప్పక తీసుకోవల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయి.
తేలికగా వండే..
ప్రస్తుత ఆధునిక కాలంలో ఓట్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలోని ఎక్కువ స్థాయిలో ఉండే పీచుపదార్దాలు, పోషకాల కారణంగా అనేకమంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. ఓట్స్ లో ఫినోలిక్స్, కెరోటినాయిడ్స్, ఫైటిక్ ఆమ్లం, విటమిన్ 'ఇ' బయోయాక్టివ్ పోషకాలు ఉంటాయి. ఇవి ప్రేగు కదలికలను పెంచుతుంది. వోట్స్ లోని పిండిపదార్ధాలు, జీర్ణ ప్రక్రియను నిర్వహించడానికి, వాటి పనితీరును పెంచడానికి సహాయపడే ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఈ ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లు, కోలిక్ బ్యాక్టీరియాను నిర్వహించడంలో బాగా ఉపయోగపడుతాయి.
సిట్రస్ జాతి పండ్లు..
పెద్దప్రేగును శుభ్రపరచడంలో నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్జాతి పండ్లు అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు పేగువాపును తగ్గించడంలోనూ, కోలన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు కాన్సర్) నిరోధించడంలో ఉపయోగపడుతాయి. సిట్రస్ పండ్ల రసంలో చురుకైన సహజ జీవక్రియల శక్తి ఉన్న కారణంగా, ప్రేగులలో ప్రత్యక్ష శోషణను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఈ సిట్రస్ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ మూలంగా, పెద్ద ప్రేగు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.
పెరుగుతో
పెద్దప్రేగు జీర్ణక్రియల గురించి జరిపిన అనేక పరిశోధనలలో ఆసక్తి కరమైన అంశాలు తెలిశాయి. ప్రతి ఇంట్లో సాధారణంగా వాడే పెరుగు పెద్ద ప్రేగు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని స్పష్టమైంది. పెద్దప్రేగు ఆరోగ్యాన్ని, జీర్ణక్రియలను సమర్ధవంతంగా నిర్వహించడానికి సహయపడే పెరుగును రోజూ ఆహారంలో తీసుకోవడం మంచిదని పరిశోధకులు స్పష్టం చేశారు. పెద్దప్రేగులోని మైక్రోఫ్లోరా మీద ప్రభావాన్ని చూపగలిగే ఆవశ్యక బాక్టీరియా పెరుగులో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పోషక శోషణలోనే కాకుండా, సమర్థవంతమైన ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.
పీచు ఎక్కువగా ఉండే..
వైట్ రైస్ తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో ప్రోటీన్స్ , మైక్రోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అల్సర్స్, పేగు సంబంధమైన సమస్యలను నివారించడానికి బ్రౌన్‌రైస్ తీసుకోవడం మంచిది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న రోగులకు బ్రౌన్‌రైస్ మంచి ఔషధంగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆకుపచ్చని ఆకుకూరలతో..
ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఆకుపచ్చని కూరగాయలు ముందువరుసలో ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగులో జీర్ణ క్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహయపడతాయి. వీటిలో ఎక్కువగా ఉండే ఫైబర్ ప్రేగుల ద్వారా మలినాలు మ దువుగా ప్రయాణించేందుకు దోహదపడుతాయి.
క్యాన్సర్ నివారణలో..
వెల్లుల్లి అనేక రకాల జబ్బులకు మంచి ఔషధంగా పనిచేస్తుందని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పెద్దప్రేగులలో క్యాన్సర్ కణాలు విస్తరించకుండా నివారిస్తాయి. అంతేకాదు కోలన్ క్యాన్సర్‌ను కొన్ని రకాల ఆహర పదార్ధాల సహాయంతో నియంత్రించవచ్చునని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి. దానిమ్మ రసం అందులో ఒకటి. ఇందులోని అధిక గాఢత కలిగిన ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్లు పెద్దప్రేగును అంటువ్యాధులు, కాన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. సిట్రస్ పండ్ల రసాలతో పాటుగా, దానిమ్మ రసాన్ని తీసుకుంటే పేదప్రేగులో సమస్యలు చాలావరకు రావు.
Authorization