సాధారణంగా మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు నింపుకుని వెళ్ళడం అలవాటు. అందుకు చాలా మంది ఇంట్లో వేస్ట్‌గా పడి ఉన్న పెప్సీ, కోకో కోలా వంటి ఖాళీ బాటిల్స్‌ను ఎక్కువగా వాడుతుంటాం. వీటితో పెద్దగా ఖర్చు ఉండదనుకుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంతో చాలా ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ళలో నిల్వ చేసేవి ఏవైనా సరే ఆరోగ్యానికి హానికరమే అని పరిశోధకులు నొక్కి వక్కాణిస్తున్నారు. తెలిసో.. తెలియకో చేసే ఈ అలవాట్లు వల్ల ఎటువంటి సమస్యలు చుట్టుముడతాయో మీరు చూడండి..
సూర్యరశ్మి తగిలినప్పుడు
శీతల పానీయాలు, మినిరల్ వాటర్ నిల్వ చేయడానికి తయారుచేసిన సీసాలు పాలిథైలిన్ టెరెఫ్తాలేలట్ (పిఇటి)నుండి తయారవుతాయి. ఈ బాటిల్స్ పై సూర్యకిరణాలు పడినప్పుడు, ప్రయాణించే సమయంలో కారులో ఈ బాటిల్స్ పెట్టుకుని ఎండలో ప్రాయాణం చేస్తే వాతావరణంలోని వేడికి బాటిల్స్‌లోని రసాయనాలు బయటకు వస్తాయి. ఇవి బాటిల్లోని నీటిని కలుషితం చేస్తాయి.
పదే పదే ఉపయోగిస్తే
ఇలాంటి బాటిల్స్ ఒక్క సారి ఉపయోగించడానికి మాత్రమే పనికి వస్తాయి. అటువంటి వాటిల్లో పదే పదే నీరు లేదా వేర ఇతర పదార్థాలను నింపి తరుచుగా ఈ బాటిల్స్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటి వల్ల క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
భయంకర సమస్యలకు...
కొన్ని పరిశోధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిళ్లలోని కొన్ని రసాయనిక పదార్థాలు మహిళల్లో అండోత్పత్తి సమస్య, పీసీఓఎస్ ఎండోమెట్రియాసిస్, రొమ్ము క్యాన్సర్ వంటి భయంకరమైన సమస్యలు కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
రంగుల్లో ఉంటే...
కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ విభిన్న రంగుల్లో వేరు వేరుగా ఉంటాయి. ఇటువంటి బాటిల్స్ తయారికి రసాయనిక పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. అటువంటి వాటిని వాడటం వల్ల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
గడువు తీరిన సీసాలతో...
ట్రెడ్ మిల్ అను పరిశోధనతో పాటు ప్రయోగశాల పరీక్షల ప్రకారం గడువు ముగిసిన ప్లాస్టిక్ సీలాను వాడటం వల్ల ప్రమాదకరమైన స్మూక్ష్మ జీవులు ఆవిర్భవానికి దారితీస్తుంది. ఇవి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.
ప్లాస్టిక్ బదులుగా
ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ లేదా అల్యూమినియం బాటిల్స్ ఉపయోగించడం చాలా సురక్షితం. అయితే ఇవి కూడా కొన్ని నిర్ణీత కాలం తర్వాత వాడటానికి తగినవి కావు .
గాజు బాటిల్స్ మంచివి
గాజు బాటిల్స్‌లో తాగు నీటిని నిల్వ చేయడం సురక్షితమే కానీ, వీటిని మెయింటైన్ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలుండవు.
Authorization