ఇటీవల జ్వరబాధితులను ఎవరిని కదిలించినా.. ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి? అన్న ప్రశ్న ప్రదానంగా వినిపిస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గితే ప్రాణానికే ప్రమాదం అంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్లేట్లెట్స్ గురించిన సమాచారం మనం తెలుసుకుంటూ.. ప్లేట్లెట్స్ సహజంగా పెరిగే ఆహారపదార్థలపై అవగాహన పెంచుకుందాం.
- రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్లెట్స్. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. ఏదైన జబ్బు వచ్చినప్పుడు ఇవి ప్రాణాలకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. జ్వరం వచ్చినప్పుడు వీటి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి.
- దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య లక్షన్నర నుంచి నాలుగు న్నర లక్షల వరకు ఉంటుంది.
- డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వీటి సంఖ్య వేలల్లో పడిపోతుంది. వారివారి శరీరతత్త్వాన్ని బట్టి కొందరిలో ప్రమాదకర పరిస్థితులను కారణం అవుతుంది. అప్పుడు దాతల నుంచి సేకరించిన ప్లేట్స్లెట్స్ను ఎక్కిస్తారు. అయితే చాలావరకు సహజసిద్ధమైన ఆహారంతోనే ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు.
- రక్తంలో ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
- శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివ ద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడవ వల్ల నేచురల్ గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. ప్లేట్ లెట్స్ తగ్గాయని తెలుసుకోగానే, వెంటనే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
- బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. బొప్పాయి ఆకుల జ్యూస్ తీసుకోవడం మంచిది. పచ్చిగా నైనా, కాచి వడగట్టి కషాయం మాదిరిగానైనా తీసుకోవచ్చు. రోజుకు రెండు సార్లు అరకప్పు బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల ప్లేట్ లెట్స్ బాగా పెరుగుతాయి.
- దానిమ్మలో అధికంగా ఉండే ఐరన్ ప్లేట్ లెట్స్‌ను పెంచడానికి ఉపయోగపడుతుంది. దానిమ్మలోని విటమిన్స్ డెంగ్యూ ఫీవర్ తో పోరాడే శక్తిని ఇస్తాయి.
- శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
- బీట్ రూట్ ప్లేట్ లెట్స్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ వారంలో మూడురోజులు తాగితే రక్తలో ప్లేట్లెట్స్ పెరుగుతాయి.
- శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.
- డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఎండు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
- ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.
- ఎండుఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్ లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Authorization