నాడీ పట్టుకుని ఆరోగ్యస్థితిని చూసే రోజులు ఎప్పుడో పోయాయి. తలనొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళ్ళితే సిబిపి నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు రాసే రోజులు వచ్చాయి. రిపోర్ట్స్ చూసిన తర్వాత అంతా నార్మలే అంటూ పారసిటమాల్ రాసే డాక్టర్ల సంఖ్య చాలానే ఉంది. ఇలాంటి డాక్టర్ల కారణంగా డయగస్టిక్ సెంటర్లు వీధికి ఒకటి ప్రారంభమవుతున్నాయి. చాలామంది మెడికల్ రిపోర్ట్స్‌ను అజాగ్రత్త చేస్తుంటారు. ఈ కారణంగా ప్రతిసారి వైద్యపరీక్షలు చేయించడం అవసరం అవుతుంది. కొన్నిరకాల జబ్బులకు అంతకు ముందు వైద్యపరీక్షల రిపోర్ట్స్ అవసరం అవుతాయి. విదేశాల్లో తప్పనిసరిగా ప్రతివ్యక్తికి ఆన్లైన్ మెడికల్ ఫైల్ తప్పనిసరిగా ఉంటుంది. మనదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి మనమే ఫైల్ చేసుకోవాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అంతకు ముందు వైద్య చికిత్సకు సంబంధించిన రిపోర్ట్స్ డాక్టర్‌కు చూయించాలి. - బ్లడ్ గ్రూప్ రిపోర్ట్ తప్పనిసరిగా జాగ్రత్తగా ఉంచాలి. - చిన్నతనంలో వేయించిన వ్యాక్సిన్ వివరాలు - గతంలో వచ్చిన జబ్బులు, చికిత్స వివరాలు - ఎక్స్‌రేలు, ప్రిస్క్రిషన్లు, క్లినికల్ రిపోర్ట్స్ జాగ్రత్తగా ఉంచాలి. - ఇటీవల చాలా డయగస్టిక్ సెంటర్లు ఆనెలైన్లో రిపోర్ట్స్‌ను పంపిస్తున్నాయి. మెయిల్ ఇడీ ఇస్తే మెయిల్‌కు పంపిస్తున్నారు. గూగుల్ డ్రైవ్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని మెడికల్ రిపోర్ట్స్ అన్నీ సెవ్ చేసుకోవచ్చు.