అమ్మో... డెంగ్యూనా అని ప్రతి ఒకరనీ భయపడుతున్న తీవ్రమైన వ్యాధి డెంగ్యూ. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల దేశాలలో, ఉపఉష్ణమండల దేశాలలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎటు చూసినా జ్వరబాధితులే ఎక్కువగా ఉండటంతో వారిలో డెంగ్యూతో బాధపడుతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. చిన్న, పెద్దలను గడగడలాడిస్తున్న జ్వరాల్లో ఇది ఒకటిగా మారింది.. ఈ వ్యాధి యొక్క కారణాలు, లక్షణాలు, నివారణ పద్దతులను తెలుసుకుంటే జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చు
- డెంగ్యూ అనేది ఏడిస్ అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగలే కుడుతుంది. ఇది తీవ్రమైన చలి జ్వరంకో వస్తుంది. సెంటర్ అఫ్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 మిలియన్ డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి.
- తీవ్రమైన డెంగ్యూను 'డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం' అని పిలుస్తారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలతో పాటు, రెండవ సారి లేదా తదుపరి డెంగ్యూ సంక్రమణ వలన డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం అభివ ద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
వైరస్..
డెంగ్యూ రావటానికి కారణమయ్యే వైరస్లు నాలుగు రకాలు. వీటిలో ఏదైనా ఒక వైరస్ కారణంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లయితే, మీ జీవితాంతం ఆ వైరస్ ని ఎదుర్కొను రోగనిరోధక శక్తి మీ శరీరంలో అభివ ద్ధి చెందుతుంది. కనుక, ఒక సారి సోకిన వైరస్ రెండోసారి సోకదు. కానీ, ఇతర మూడు వైరస్ల వలన మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దోమలతో వ్యాప్తి..
'ఏడిస్ ఏజిప్టి' అనే దోమ డెంగ్యూ కలిగించే వైరస్‌లను ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఒక ఆడ దోమ. డెంగ్యూ వైరస్ సోకిన 'ఏడిస్ ఏజిప్టి' దోమ కాటుల ద్వారా మనుషులలో ఈ వైరస్ వ్యాపిస్తుంది.
ఫీవర్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన మొదటి 2 నుండి 4 రోజుల వరకు ఇది మన రక్తంలో ప్రవహిస్తూ క్రమంగా లక్షణాలను చూపుతుంది. హఠాత్తుగా తీవ్ర జ్వరంతో మొదలవుతుంది. కాళ్లు కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు, వాంతులు, వికారం, రక్తంతో కూడి మల విసర్జన.
అకస్మాత్తుగా, అధిక జ్వరం ( 104 పైగా)
తీవ్రమైన తలనొప్పి, కండ్ల్ల వెనుక నొప్పి (కండ్లు తెరవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది)
తీవ్రమైన కీళ్లు, కండరాల నొప్పి
అలసట , వికారం , వాంతులు
చర్మపు దద్దుర్లు (ఇవి జ్వరం ప్రారంభమయిన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తాయి)
స్వల్ప రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్లలో రక్తస్రావం లాంటివి)
రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది.
చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు చాలా తేలిక పాటుగా ఉంటాయి. కనుక అది కేవలం మామూలు జ్వరం అని లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అని పొరపాటుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ' డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం' అనే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఇది భారీ రక్తస్రావం, మరణానికి దారితీయవచ్చు. దీనిని 'డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS)' గా పిలుస్తారు.
ఈ లక్షణాలు కనిపించిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
వ్యాధి నిర్ధారణ..
డెంగ్యూ వ్యాధిని కనుగొనేందుకు వైద్యులు రక్త పరీక్షలు చేస్తారు. డెంగ్యూ వ్యాధిని నిర్ధారించాలంటే ఎలీసా పరీక్ష చేయించాలి.
డెంగ్యూ తీవ్రతను బట్టి మూడు రకాలు. అన్ డిఫరెన్షియేటెడ్ ఫివర్ మొదటి రకం. అంటే ఇతర జ్వరాల మాదిరిగానే ఉంటుంది. రెండోది డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్. ఇందులో అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంది. మూడోది డెంగ్యూ హేమరేజిక్ షాక్. ఇందులో అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
చికిత్స విధానం:
డెంగ్యూ జ్వరంకు ప్రత్యేకమైన చికిత్స ఇంకా కనుగొన లేదు. రోగులు డాక్టర్ సూచనల మేరకు జ్వరానికి మందులు వేసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలు సలహాలను తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవాలి. తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది విశ్రాంతి, ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా సాధారణ స్థితికి వస్తారు. బీపీ పడిపోకుండా ముందు నుంచి ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తారు. షాక్‌కు గురైన వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఫ్రెష్ ప్రొజెన్ ప్లాస్మా అవసరాన్ని బట్టి ఇస్తారు.
నివారణ పద్ధతులు
ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధికి కారణమైన ఎడిస్ ఈజిప్ట్ దోమ నిల్వ ఉండే నీటిలో గుడ్లు పెట్టి వెళ్తుంతుంది. ఈ గుడ్లలోంచి వచ్చే దోమలు మనుషులపై దాడి చేస్తాయి. దీంతో జ్వరంతో మనిషి రక్తంలో తెల్లరక్తకణాలు తగ్గి శరీరంలో వివిధ అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ కారణలతో రోగి మరణించే ప్రమాదం కూడా ఉంది. ఎడిస్ దోమ కుట్టిన ప్రతీ మనిషికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలో మరి ఎక్కువగా, త్వరగా వస్తుంది.
- డెంగ్యూని నిరోధించడానికి ఇంకా టీకాలను కనుగొన లేదు. దీనికి ఒక ఉత్తమమైన నివాకణ పద్దతి దోమలను నివారించడం.
- ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- ప్రతి రోజు ఇంటిలోని చెత్తను డిస్పోజ్ చేయాలి. ఎక్కడా చెత్త చేరకుండా చూసుకోవాలి.
చిన్న చిన్న తొట్లలో లేదా పాత్రలలో నీరు చేరకుండా చూసుకోవాలి.
- ఇంట్లో కూడా మస్కిటో రెపెలెంట్స్ ఉపయోగించండి.
- బయటకి వెళ్ళేటప్పుడు, పొడవైన చేతులున్న షర్ట్స్, పొడవైన ప్యాంటులను ధరించాలి.
- ఇలా చేయటం వలన దోమల ఉత్పత్తి తగ్గుతుంది.
- డాక్టర్ స్వామి అల్వాల్,
ఎం.బి.బిఎస్(ఉస్మానియా), ఎండీ(నేచరోపతి)
సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీజీహెచ్ఎస్(రిటైర్డ్)
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization