బరువు తగ్గాలని ఇటీవల చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్లిమ్‌గా ఉండాలనుకునే వారు తాము ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. శరీర బరువు ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉండే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చక్కటి ప్రణాళిక వేసుకుని ఓ పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. దాని కోసం తమ రోజూ వారి ఆహారంలో కొన్ని పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలలో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే కొవ్వు పదార్థాలు శరీర బరువు పెరిగేలా చేస్తాయి. అయితే ఎంత బరువు పెరగాలి అన్నదాన్ని బట్టి తీసుకోవాలి. కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ జోలికి పోకుండా... మామూలు పాలనే తగినంత మోతాదులో తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లేకుండా ఆరోగ్యంగా శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో ఓట్స్ పాత్ర కీలకం. దీనిలో ఉండే పిండి పదార్థాలు బలాన్నిస్తాయి. ముఖ్యంగా దీంట్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. - గుడ్డులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒకటి తీసుకుంటే మంచిది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. - ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎటువంటి హానీ చేయవు. వంటల్లో ఆలివ్ ఆయిల్ తక్కువ మోతాదులో వాడటం మంచిది. - కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే దుంపలు, తణధాన్యాలను తీసుకోవాలి. అయితే ఇవి మోతాదు మించితే ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడు బరువును చెక్ చేసుకుంటూ, అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. - చికెన్, మటన్ కంటే చేపలు తింటే ఆరోగ్యకరం. అయితే నాజ్ వెజ్‌ను రోజూ తీసుకుంటే అనారోగ్యంతో పాటు త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి వారానికి ఒకసారి ఆహారంలో తప్పక చేపలు ఉండేలా చూసుకోవాలి. - డ్రైఫూట్స్ ఆరోగ్యానికి మంచివి అని ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. బాదం, జీడిపప్పు, అవిశె గింజలు శరీర బరువు పెంచుతాయి. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.