- మొన్న ... సార్స్ వైరస్
- నిన్న ...జైకా వైరస్
- నేడు ... నోవెల్ కరోనా వైరస్
చైనాతో సహ పలు ప్రపంచదేశాలను, తాజాగా అమెరికాను కరోనా వైరస్ భయపెడుతోంది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే
తొమ్మిది మంది మృతిచెందగా, దేశవ్యాప్తంగా మరో 440 కేసులు నమోదుకావడం మరింత కలవరపెడుతోంది.
తాజాగా ఉహాన్‌లో పుట్టుకొచ్చిన నోవెల్ కరోనా వైరస్, ప్రమాదకరమైన సార్స్ వైరస్‌ను పోలి ఉండటంతో కలకలం రేగుతోంది. సార్స్ లాంటి ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. శ్వాసనాళాల ద్వారా కరోనా వైరస్ వ్యాపించి, అక్కడ వైరస్‌గా పరివర్తనం చెంది, వ్యాధిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ డిప్యూటీ మినిస్టర్ లిన్ బిన్ పేర్కొన్నారు.
ఆసియా దేశాలతో పాటు అమెరికాలో కరోనా వైరస్ గుర్తింపు
చైనాతోపాటు మరిన్ని ఆసియా దేశాల్లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పటికే థారు లాండ్, జపాన్, దక్షిణ కొరియాలకు పాకింది. బీజింగ్, షాంఘై, దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోనూ 20మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు.
లండన్ శాస్త్రవేత్తల పరిశోధన - కరోనా వైరస్ గుర్తింపు
చైనాలోని ఉహాన్‌లో గల ఓ సముద్రపు ఆహార మార్కెట్ కేంద్రంగా కొత్త వైరస్ వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా ఉహాన్‌లో ఇద్దరు మృతి చెందడంతో వెంటనే వీరి శాంపిల్స్‌ను లండన్‌ను పంపించి పరిశోధనలు చేపట్టారు. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఈ వైరస్‌ను 'కరోనావైరస్'గా గుర్తించారు.
శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే 'కరోనా వైరస్' పుట్టుక
శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మనుషులపై ప్రభావం చూపించే ఈ వైరస్లు ఆరు రకాలు :
1) సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్- సీఓవీ)
2) మిడిల్ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (మెర్స్-సీఓవీ)
3)హ్యూమన్ కరోనా వైరస్ హెచ్‌కేయూ 1
4) హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ 43
5) హ్యూమన్ కరోనా వైరస్ ఎన్ఎల్ 63
6) హ్యూమన్ కరోనా వైరస్ 229 ఈ
2019 - నోవెల్ కరోనా వైరస్ 2019 - ఎన్సీఓవీ) వ్యాప్తి
- చలికాలంలో ఎక్కువగా వ్యాపించే స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, ఈ కరోనా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి.
- స్వైన్‌ఫ్లూ వైరస్ ఎలాగయితే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందో ఈ వ్యాధి కూడా అలాగే సోకుతుంది. కర చాలనం, షేక్ హ్యాండ్ ద్వార సోకుతుంది.
- వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ ఆ వైరస్ గాలిలోకి చేరి దాని ద్వారా సమీపంలో ఉన్నవారికి సోకుతుంది.
2019 - నోవెల్ కరోనా వైరస్ (2019 - ఎన్సీఓవీ)
లక్షణాలు
- దగ్గు
- జలుబు
- జ్వరం
- తలనొప్పి
- ఒంటి నొప్పులు
- ఛాతీలో నొప్పి
- న్యుమోనియా
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు
- గాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు
- మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం
- ప్రాణాలకు ముప్పు
- ఈ వైరస్ బారిన పడకుండా ముందజాగ్రత్తగా ఎలాంటి యాంటీ రిట్రో వైరస్ మందులు, టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పాములే వైరస్‌కు మూల కారణం
కరోనా వైరస్‌కు పాములే కారణమని భావిస్తున్నారు. బహుశా చైనా కోబ్రో, క్రయిత్లే సరికొత్త వైరస్ ప్రబళినట్టు వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ శీతాకాలంలో చైనాలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి ఇవే అసలు మూలం కావచ్చని పేర్కొంటున్నారు. తైవాన్ క్రయిత్ లేదా చైనీస్ క్రయిత్గా పిలవబడే ఈ పాములు అత్యంత విషపూరిత మైనవి. మధ్య, దక్షిణ చైనాలతోపాటు ఆగేయ ఆసియా లో ఇవి అధికంగా ఉంటాయి.
- డాక్టర్ ఆకుల సంజరు రెడ్డి,
ఫార్మకాలజిస్ట్, మెంబర్,
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్
Authorization