కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రాణాంతకమైనది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసు కోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ నుంచి జాగ్రత్తలు - క్వాలిటీ మాస్క్లు వాడాలి - చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. - విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తప్పనిసరి బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. కరోనావైరస్ లక్షణాలు - కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. - శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. జాగ్రత్తలు : ఇది రాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. - శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు. - తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. - ఉడికించని, సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు. - కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులను 'లైట్, మీడియం, సీరియస్ అనే మూడు కేటగిరీలుగా విభజించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులకు సూచించింది. రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్కు గురికాకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఆరోగ్య సిబ్బంది గౌన్, మాస్క్, గ్లౌజ్ ఉపయోగించడంతోపాటు ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన రోగుల కదలికలను నియంత్రించాలి.