కొన్ని చిన్నచిన్న సమస్యలుగా కనిపించిన అంశాలు నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద సమస్యగా మారుతాయి. వాటిలో కొన్ని పేర్లు మరచిపోవడం, వెళ్ళవలసిన సమయం మర్చిపోవడం, దారి మర్చిపోవడం, వస్తువులు గుర్తుపెట్టు కోలేకపోవడం వంటి సమస్యలుంటాయి. - పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేకపోవడం. - బద్దకంగా మారిపోయి, ఆధారపడే ధోరణికి అలవాటు పడటం వలన వంట చేయడం, బండి నడపడం, ఇంటిపనులు చేయడం కష్టమౌతుంది. - ప్రస్తుత సమయం, తేదీ, రోజులను మర్చిపోవడమేకాక, బాగా పరిచితమైన వ్యక్తులను, స్థలాలనూ గుర్తుపట్టకపోవచ్చు. తన ఇంటి చిరునామా మర్చిపోవచ్చు. - మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించలేకపోవచ్చు, పదాలు సరిగ్గా చెప్పలేకపోవచ్చు లేదా మాట్లాడిన, రాసిన పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. - కారణం లేకుండానే మితిమీరిన కోపం, ఆత్రుత లేదా అనుమానాస్పదంగా మారవచ్చు. అందరిలో కలిసే మనస్తత్వం ఉన్నప్పటికీ, ముడుచుకు పోయి, దూరంగా, నిశ్శబ్దంగా ఉండటం. - ఐదు నిముషాల ముందు జరిగిన విషయాలు కూడా మరిచిపోతారు. రానురాను ఒకటి రెండు రోజుల ముందు విషయాలూ మరిచిపోతారు. పాత విషయాలు మాత్రం చివరి వరకూ గుర్తుంటాయి. - ఇలాంటి సమస్యలు పెద్దవారిలో ఉంటే అల్జిమర్స్గా గుర్తించి తగిన చికిత్స ఇవ్వాలి. చిన్నవారిలో ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.