అధిక బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. అయితే కష్టపడకుండా మాత్రల ద్వారా బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. సర్జరీల ద్వారా, మందుల ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గించే మాత్రలు వేసుకోవడం వల్ల జీర్ణాశయ సమస్యలు కలుగుతాయి.
- బరువు తగ్గించే మందులు హృదయ స్పందన రేటును అసాధారణంగా పెంచుతాయి. అంతేకాదు తలనొప్పి, మలబద్దకం, పొడినోరు వంటి సమస్యలు వస్తాయి.
- వ్యాయామాలు, బరువు ఎత్తటం, ఆహార నియమాలను పాటించటం ద్వారా అదనపు బరువు ను తగ్గించుకోవచ్చు. కానీ, చాలా మంది బరువు తగ్గించే మాత్రలను వాడి సులువైన మార్గం ద్వారా బరువు తగ్గించుకుంటున్నారు.
- బరువు తగ్గించే మందులు మన శరీరానికి హాని కలిగిస్తాయని గమనించండి. ఈ మందులు మన శరీరంపై అనేక విధాలుగా దుష్ప్రభావాలను చూపుతాయి.
- బరువు తగ్గించే మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, విరేచనాలు కలిగి స్తాయి. ఈ మాత్రలలో ఉండే సమ్మేళనాల కారణంగా శరీరం విటమిన్లను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్ల లోపం కూడా కలుగుతుంది.
- బరువు తగ్గించే మాత్రల లో 'సిబుట్రమైన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం సహను భూ త నాడీ వ్యవస్థ (సింపాథెటిక్ నెర్వస్ సిస్టం) ను ప్రేరేపించి, ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా, హృదయ స్పందన రేటును అసాధారణంగా పెంచి, సరైన సమయానికి చికిత్స అందించని ఎడల గుండెపోటుకు కారణం కూడా అవుతోంది.
- ఆకలిని అణచివేయటమే కాకుండా రక్త పీడనంలో పెరుగుదల హాట్ ఫ్లషేస్, నిద్ర లేమి , డిప్రెషన్వంటివి బరువు తగ్గించే మాత్రల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాకుండా, కొంత మందిలో ఈ మాత్రలు వేసుకోవడంతో పెరిగిన రక్తపీడనం వలన రక్తనాళాలలో రక్తం గద్దకట్టడం వంటి సమస్యలను కూడా గమనించారు.
- బరువు తగ్గించే మాత్రల వలన గుండెపోటు వంటి సమస్యలు మాత్రమేకాకుండా, శరీరం యొక్క సామర్థ్యాన్ని తగ్గించి అసౌకర్యాలకు గురి చేస్తుంది. దీనితో పాటుగా పేగు కదలికలను కూడా అధికం చేస్తాయి.
- బరువు తగ్గించే మాత్రల వాడకం వలన నోరు , గొంతు పొడిగా మారటం, మలబద్దకం వంటి అనేక సమస్యలు వస్తాయి.
- ఆరోగ్యకర బరువు నిర్వహణ అనేది మీరు అనుసరించే జీవనశైలి, మీరున్న వయసు, కలిగి ఉండే మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గించే మాత్రల వలన మానసికంగా, శారీరకంగా బాధపడాల్సి వస్తుంది కావున బరువు తగ్గించే మందులు వాడేముందు డాక్టర్ సూచనలు, సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Authorization