అనేక రకాల జబ్బులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. వయసు, లింగ బేధం, ప్రాంతాల తారతమ్యాలు లేకుండా అందరినీ ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే అపోహలకు తావివ్వకుండా సరైన రోగలక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే నయం అవుతుంది. అరుదుగా మగవారిలో వచ్చే గైనేకోమస్తియా వ్యాధి గురించి ఈ వారం తెలుసుకుందాం... బాలురు, పురుషుల రొమ్ములో వాపు కలిగే స్థితిని గైనేకోమస్తియా అని అంటారు. వ్యక్తిలోని రెండు రకాలైన హార్మోన్లలో అసమతుల్యత సంభవించినపుడు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది. ఆడవారిలో ఏ విధంగా అయితే రొమ్ము వయసు పెరిగిన కొద్ది రూపుదిద్దు కోబడుతుందో అలా పురుషులలో జరగనప్పటికీ చాతి ఎముక ఏర్పడి అభివద్ధి, స్వల్ప మొత్తంలో ఎముక కణజాలంతో జన్మిస్తారు.
బాలికల శరీరం సహజంగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఆధారంగా రూపుదిద్దు కోబడుతుంది. బాలురు ఎదుగుతున్న దశలో వారి లైంగిక శక్తిని ఈ హార్మోన్ ప్రభావితం చేస్తుంది. అయితే, బాలికల్లో లైంగిక శక్తిని ప్రభావితం చేసే ఈస్ట్రోజన్ హార్మోన్ సైతం పురుషుల్లో స్వల్ప మొత్తంలో స్రవిస్తుంది. బాలురు పురుషుడిగా ఎదుగుతున్న దశలో లేదా వయసు పైబడిన వారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గినపుడు ఈ రెండు హార్మోన్ల యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. బాలురుల్లో దాదాపు 50శాతం మంది, 50 ఏండ్ల వయసు పైబడిన పురుషుల్లో మూడింట రెండు వంతుల మంది గైనేకోమస్తియా ప్రభావం కొద్దోగొప్పో ఎదుర్కుంటున్న వారే.
గైనేకోమస్తియా స్థితి ఎలా సంభవిస్తుంది?
పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంభవించే గైనేకో మస్తియాకు అనేక రకాలైన కారణాలు ఉంటాయి. పురుషుల రొమ్ము సమస్యకు సంబంధించి ఈ అనారోగ్య స్థితికి అనేక సందర్భాల్లో సరైన కారణం గుర్తించబడటం లేదు.
బాలుడి నుంచి పురుషుడి దశకు మారుతున్న దశలో కలిగే అనేక మార్పులతో పాటుగా పలు మరికొన్ని అంశాలు కూడా గైనేకోమస్తియాకు కారణంగా మారుతాయి.
- టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేసే టెస్టికెల్స్కు గాయం జరగడం లేదా ఏదైనా వ్యాధులు సంభవించడం.
- థైరాయిడ్ సమస్యలు మరో కారణం. వ్యక్తి అభివద్ధి, లైంగిక ఎదుగుదలను ప్రభావితం చేసే ఈ గ్రంథి టెస్టోస్టిరాన్ విషయంలోనూ కీలక పాత్రపోషిస్తుంది.
- కొన్ని రకాలైన క్యాన్సర్లు, ఊపిరితిత్తుల్లో ఏర్పడే కణతులు, పిట్యూటరీ గ్రంథి లేదా అడ్రినలిన్ గ్రంథుల స్రావాలు.
- అధిక బరువు సమస్య వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
- పలు రకాల వ్యాధుల కోసం తీసుకునే ఔషధాలు. గుండె సంబంధమైన సమస్యలు, క్యాన్సర్లు, డిప్రెషన్ లేదా అల్సర్లకు సంబంధించిన సమస్యలు.
- మూత్రపిండం పనితీరు దెబ్బతినడం (ఈ సమస్య వల్ల రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేయలేవు)
- కాలేయ సంబంధమైన వ్యాధులు
లక్షణాలు: గైనేకోమస్తియాకు చెందిన మొట్టమొదటి లక్షణంగా రొమ్ము భాగంలో ఏర్పడే వాపు లేదా పెద్ద కణితి. కొన్ని సందర్భాల్లో ఈ బొడిప విస్తరిస్తుంది. ఇలాంటి సందర్భంలో మీకు రొమ్ము క్యాన్సర్ సంభవించి ఉంటుందనే అనుమానం కలుగుతుంది. అయితే, రొమ్ము క్యాన్సర్ తక్కువ మంది పురుషుల్లోనే సంభవిస్తుంది. గైనేకోమస్తియా అనేది క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ఖచ్చితమైన లక్షణం కాకపోవచ్చు. అయితే, ఈ విషయం నిర్ధారించుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది.
చికిత్స : అనేక మంది సరైన చికిత్స పొందకపోవడం వల్లే గైనేకోమస్తియా వ్యాధి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఘటనలు ఉన్నాయి. హైపోగొనడిజం, పోషకాహార లోపం లేదా సిరోసిస్ వంటి కారణాల వల్ల గైనేకోమస్తియా సమస్య ఎదురైతే, దానికి సరైన చికిత్స పొందడం మంచిది. గైనేకోమస్తియా వ్యాధి ముదరని పక్షంలో రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే పరిష్కారం అయిపోతుంది. అయితే, గైనేకోమస్తియా ఇబ్బంది తలెత్తిన వారిలో తీవ్రమైన నొప్పి, బలహీనత లేదా చికాకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపించి అదే సమయంలో గైనేకోమస్తియా ఎలాంటి వద్ధి చెందకపోతే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
రొమ్ములో పెరుగుదల స్పష్టంగా కనిపించడం, ప్రాథమిక చికిత్స తర్వాత కూడా మార్పు లేకపోతే శస్త్రచికిత్స అవసరం అవుతుంది.
శస్త్రచికిత్స ప్రత్యామ్నాయాలు
లైపోసక్షన్ ఈ చికిత్స రొమ్ములోని కొవ్వును తొలగిస్తుంది. అయితే, రొమ్ము గ్రంథి కణితిని తొలగించదు
మాస్టెక్టమి- ఈ రకమైన చికిత్స రొమ్ము గ్రంథి కణితిని తొలగిస్తుంది. ఈ శస్త్రచికిత్స సహజంగా తక్కువగా గాట్లతో పూర్తవుతుంది. లెస్ ఇన్వాసివ్ విధానంలోని చికిత్స వల్ల తక్కువ సమయంలో రోగి కోలుకోగలుగుతారు.
పై రెండు రకాలైన శస్త్రచికిత్సలు డే-కేర్ విధానంలో పూర్తవుతాయి. ఈ శస్త్ర చికిత్సల తర్వాత కంప్రెసన్ గార్మెంట్లు మూడు నుంచి ఆరు వారాల పాటు ధరించాలి.
- డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,
కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్,
అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్,
హైదరాబాద్
Authorization