కొన్నిసార్లు అలసటగా, మరికొన్ని సార్లు చాలా హుషారుగా ఉంటారు చాలా మంది. దీని కారణం రోజువారీ పనులు, ఒత్తిడి. అయితే అలసట నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. - బాగా అలసటగా అనిపించినప్పుడు 15 నిమిషాలు అటుఇటూ నడవడం వల్ల శరీరంలోకి ఎండాల్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించే హార్మోన్లును విడుదల చేస్తాయి. - నీరు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా అలసట తొందరగా వస్తుంది. శరీరం డిహైడ్రేట్ కావడం వల్ల నీరసంగా ఉండటంతో పాటు తొందరగా అలసిపోవడం, ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి రోజు తగినంత నీళ్ళు తీసుకోవడం తప్పని సరి! ఎండాకాలం మరింత ఎక్కువగా నీళ్ళు తాగాలి. జ్యూస్లు, కొబ్బరినీళ్ళు అలసటను తగ్గిస్తాయి. - ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. కార్బోహైడ్రేట్లు శరీరంలోకి ఎక్కువగా గ్లుకోజ్ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే విటమిన్ 'బి' ఉండే ఆహారపదార్థాలు అరటి పండ్లు, ప్రోటిన్లు, ఆకుకూరలు, పాలకూర, బఠాణిలు మొదలకునవి ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఈ పదార్థాలు ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. - కొన్ని గంటల పాటు కూర్చోని పని చేయడం వల్ల తొందరగా శక్తిని కోల్పోతారు. మళ్ళీ శక్తిని తిరిగి పొందుకోవాలంటే మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవాల్సిదే! అలా పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్న కోల్పోయిన శక్తిని మొత్తం తిరిగి పొందుతారు. - రోజులో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొద్దున్న వ్యాయామం చేయడం వల్ల ఆఫీసు వెళ్లే ముందు కూడా తాజాగా, ఉల్లాసంగా ఉంటారు. ఆఫీస్లో కూర్చోని ఎక్కువ సమయం పని చేసే వారికి మెడ నొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పల నుంచి ఉపశ నమం పొందుతారు. అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.