మారిన జీవనశైలి కారణంగా యువతలో, మధ్యవయసు వారిలో
గుండె వ్యాధులు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు పదులు దాటని వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పదిహేను శాతం పెరిగింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇందుకు కారణం శరీరంలో పెరుగుతున్న పని ఒత్తిడి, కొలెస్ట్రాల్ లెవల్స్ ముఖ్య కారణమంటున్నారు పరిశోధకులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మనదేశంలో క్రానిక్ గుండె వ్యాధుల సంఖ్య పెరిగిపోవడానికి అధిక చెడు కొలెస్టాల్ స్థాయిలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. పెద్దపెద్ద నగరాల్లో యువతలో, నలభై ఏండ్లలోపు వారిలో హార్ట్ ఎటాక్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలలో రికార్డు అవుతున్న వారి సంఖ్య పదిహేను శాతం పెరిగింది. 25-40 ఏండ్ల్ల మధ్య వయసులో ఉన్న స్త్రీ, పురుషులలో చాలా మంది ఏసీఎస్ - అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లక్షణాలతో బాధపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే, యువతలో హార్ట్ అటాక్ కేసుల పెరుగుదల 15శాతం ఉంది. ఈ రోగుల్లో అత్యధికం ఐటీ రంగంలో పని చేసే వారే. పని ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా వారు గుండె వ్యాధుల బారిన పడుతున్నారు.
కారణాలు..
- పాశ్చాత్య ప్రజలతో పోలిస్తే మనదేశంలో కనీసం పదేండ్లు ముందుగానే గుండె వ్యాధులకు గురవుతున్నారు. గుండె వ్యాధులు బాగా పెద్ద వయస్సు వారికే వస్తాయన్న సాధారణ నమ్మకానికి భిన్నంగా యువత గుండెజబ్బుల బారిన పడుతున్నారు.
- జన్యుపరమైన కారణా లు, జీవనశైలి, పిండిపదార్థాలు, కొవ్వు అధి కంగా ఉండే ఆహారం, శారీరక కార్యకలా పాలు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు అనేకం ఉన్నాయి.
- మానసిక ఒత్తిడి బ్లడ్ కొలెస్టాల్, ట్రైగ్లెనెరిడెస్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ లను అధికం చేస్తుంది. గుండె పోటు రావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. టైం ప్రకారం భోజనం చేయక పోవడం, జంక్ ఫుడ్ తినడం, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం వంటివి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. వీటి కారణంగానే యువత లో గుండె జబ్బులు అధికం అవుతున్నాయి.
జాగ్రత్తలు..
- పాల ఉత్పత్తులు, రిఫైన్డ్ షుగర్, పిండి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ బాగా ఉంటాయి. వాటిని తీసుకోవడం తగ్గించుకోవాలి.
- ఫైబర్ బాగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి.
- ఆరోగ్యదాయక జీవన శైలిని అనుసరించడం ముఖ్యం. టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్న చరిత్ర ఉంటే తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
చికిత్స..
స్టాటిన్స్ వంటి హై కొలెస్ట్రాల్ స్థాయిలకు చికిత్స చేసేందుకు ప్రస్తుతం మందులు లభ్యమవుతున్నాయి. గుండె వ్యాధులతో బాధపడే రోగు ల్లో బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇవి ఎంతో ప్రభావపూరితంగా పని చేస్తున్నాయి.
- డాక్టర్ టి.శశికాంత్,
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్, హైదరాబాద్
Authorization