Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి అన్నా రు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మం దిరంలో జిల్లా బాలికల సంరక్షణ సొసైటీ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల సంరక్షణ సొసైటీలో పోలీస్, మహిళా సంక్షేమం డీఆర్డీఏ, గిరిజన, వైద్య, విద్య, ఎంప్లారుమెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మిక, లీగల్ సర్వీసెస్, మహిళా సమాఖ్య, ముగ్గురు స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధిలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరు జిల్లాలో బాలికల, మహిళల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటారని అన్నారు.
మహిళా సంరక్షణకు 181 హెల్ప్ లైన్, బాలికల సంరక్షణకుగాను 1098 హెల్ప్‌లైన్‌ను ఏర్పా టు చేశామని చెప్పారు. ఏదైనా జరిగితే వెంటనే ఈ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు గాను 1098కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారులను పంపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వరూప రాణి, డీఆర్డీఓ కౌటిల్య పాల్గొన్నారు.