మన చరిత్రను ఆధారంగా తీసుకొని ఏదైనా మాట్లాడాల్సి వస్తే అవతలి వ్యక్తి చరిత్రను కూడా కొంత తెలుసుకోవాలి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సీతను ఎత్తుకెళ్లాడు అనే కారణంతో అవతలి దేశంలో న్యాయవంతమైన నాయకున్ని అతి దారుణంగా రాముడు చంపాడు.. ఇది న్యాయమా అన్యాయమా,, ఇది కథనా, వాస్తవమా అనే విషయాలను పక్కన బెడితే.. మనం చదివిన, మనకు తెలిసిన విషయాలనే పరిగణలోనికి తీసుకోవాలి. మన దేశ ఆడపడుచుకు అన్యాయం జరిగింది అనేది మొదటి సమస్య.. ఒక స్త్రీని హేళన చేశాడు అనేది రెండవది. దీనిని కొందరు హేతువాదులు తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతికారంగా తీసుకెళ్ళాడు కనుక అందులో తప్పేమి లేదు.. అయినా వీళ్ళలాగా ఆయన ఎలాంటి హింసను శారీరకంగా చూపలేదు, పైగా గౌరవించాడు అనేది వాళ్ళ వాదన.. కానీ ఏ చట్టాలు, శాసనాలు, కోర్టులు, నిబంధనలు లేని రోజుల్లో జరిగిన దానికి రావణాసూరుడిని చంపితే,, మరి అవన్నీ పక్కాగా అమలౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి శిక్షలు ఎందుకు అడ్డువస్తున్నాయి.
మన దేశం ఇప్పటికి కొంత గౌరవంగా ఉందంటే అందుకు కారణం కొన్ని సంప్రదాయాలు, ఇంకొన్ని విలువలు. మన దేశానికి ఏ నష్టం జరిగింది? అంతా బాగానే ఉంది కదా అనుకునే వ్యక్తులు లేకపోలేదు, వారికి చిన్నపిల్లలపై జరిగే లైంగికదాడులు, ఆకలి చావులు తెలిస్తే, ఎంత మట్టుకు బాగుంది, ఏం బాగుపడాలి అనే విషయం తెలుస్తుంది. అందుకే మనం దేశం రొమ్ములు విరుచుకుని గర్వంగా తలెత్తే అంత గౌరవంగా లేదనే నిదర్శనంపై రెండు విషయాలు తేటతెల్లం చేస్తాయి. పైన చెప్పబడిన సంప్రదాయాలు, లైంగికదాడుల గురించి ఓ మారు తెలియచెయ్యాలి. మన చరిత్రను ఆధారంగా తీసుకొని ఏదైనా మాట్లాడాల్సి వస్తే అవతలి వ్యక్తి చరిత్రను కూడా కొంత తెలుసుకోవాలి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సీతను ఎత్తుకెళ్లాడు అనే కారణంతో అవతలి దేశంలో న్యాయవంతమైన నాయకున్ని అతి దారుణంగా రాముడు చంపాడు.. ఇది న్యాయమా అన్యాయమా,, ఇది కథనా, వాస్తవమా అనే విషయాలను పక్కన బెడితే.. మనం చదివిన, మనకు తెలిసిన విషయాలనే పరిగణలోనికి తీసుకోవాలి. మన దేశ ఆడపడుచుకు అన్యాయం జరిగింది అనేది మొదటి సమస్య.. ఒక స్త్రీని హేళన చేశాడు అనేది రెండవది. దీనిని కొందరు హేతువాదులు తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతికారంగా తీసుకెళ్ళాడు కనుక అందులో తప్పేమి లేదు.. అయినా వీళ్ళలాగా ఆయన ఎలాంటి హింసను శారీరకంగా చూపలేదు, పైగా గౌరవించాడు అనేది వాళ్ళ వాదన.. ఎవరి వాదనలు వారివి. ఎవరి సమర్థత వాళ్ళది.. కానీ ఏ చట్టాలు, శాసనాలు, కోర్టులు, నిబంధనలు లేని రోజుల్లో జరిగిన దానికి రావణాసూరుడిని చంపితే,, మరి అవన్నీ పక్కాగా అమలౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి శిక్షలు ఎందుకు అడ్డువస్తున్నాయి,, దేవుండ్లకు ఒక నీతి అదే దేవుండ్లను కొలుస్తున్న ప్రజలకు మరో నీతి. ఆ రోజు అది న్యాయమైనప్పుడు ఈ రోజు ఆ న్యాయం ఎందుకు అన్యాయమౌతుంది. కేవలం చేతిని కూడా తాకకుండా గౌరవంగా సీతను తీసుకెళ్లిన రావణున్ని చంపితే, అడవిలో కర జంతువులు కూడా చెయ్యని మగ సంయోగం చేసే ఈ మానవమగాలను ఎందుకు చంపడంలేదు. అప్పుడు జరిగింది న్యాయమైతే అదే న్యాయం ఇప్పుడు కూడా జరగాలి.. ఇప్పుడు అప్పటి న్యాయం జరగకపోతే అప్పుడు జరిగిన న్యాయం కూడా అన్యాయమే అవుతుంది. ఒక్క స్త్రీకి అన్యాయం జరిగితేనే సహించని మన దేశం నేడు ఎందరో మాతమూర్తుల మానానికి, ప్రాణానికి ఒకే సమయంలో హాని జరుగుతుంటే ఎందుకు చలించడం లేదు. పైన పేర్కొన్న అందరు వ్యక్తులు దేవుండ్లు, మహానుభావులు కావొచ్చు ఎవరి విశ్వాసం వాళ్ళది, కానీ వాళ్ళు కూడా ఇదే భూమి మీద జీవనం గడిపినవాళ్లే, నేటి మన మనుగడకు సమానులే. మరి ఆ విశ్వసనీయత ఇప్పుడు ఎందుకు లేదు, ఆ ఆచారం ఎందుకు అమలుకావడం లేదు. మనం దుష్ట సంహారం అని బొమ్మలను తగలపెడుతున్నప్పుడు అలాంటి దుష్టులను ఎందుకు సంహరించలేకపోతున్నాం. అది నిజమైతే ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగాలి. నాడు రావణుడు చేసింది తప్పైతే నేడు ఆడవాళ్ళను హింసిస్తున్న ప్రతివాడూ రావణాసూరుడే. నేడు వీళ్లకు శిక్షలు పడకుంటే ఈ రోజు జరిగిన శిక్ష కూడా అన్యాయమే అవుతుంది. ఎందుకంటే నీతి ఏ రోజైనా నీతిగానే ఉండాలి. అలా లేనప్పుడు జాతికి అర్థముండదు. ఒక వ్యక్తి రాసినదాన్ని మనం నమ్మి భావితరాలకు నేర్పుతున్నప్పుడు వాటిని పాటించే విధానంలో కూడా భేదాలు ఉండకూడదు. ఒక వేళ ఉన్నట్లైతే అది అర్థ రాహిత్యమవుతుంది. అన్ని సక్రమంగా జరిగినప్పుడే సంప్రదాయాలు గౌరవించబడుతాయి. లేదంటే బయటి సంప్రదాయాలు మనలో మమేకం అవుతాయి. మనల్ని వాళ్ల వైపుకు నడిపిస్తాయి. ఇది జరుగకూడదంటే అది జరగాల్సిందే.. ప్రతి స్త్రీ గౌరవింపబడాలి దానికి గత చరిత్ర నిదర్శనమవ్వాలి.
గాజుల అశోక్
సెల్ : 9618174731
Authorization