కృష్ణారావు చనమోలు
కుల మత అడ్డు గోడలతో మానవత్వానికి మచ్చగా, ప్రపంచంలోనే ఎంత వెనుకబాటు తనంతో ఉంటున్నామో నిరంతరం జాగృతం చేయాలి. అలాంటి వాతావరణం యువతకు ధైర్యాన్నిస్తుంది. వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఎన్నికలో స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు. అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురైనా నిలబడగలుగుతారు. తమ భవిష్యత్తు కోసం, మార్పు మార్గంలో తామూ భాగస్వామలవుదామన్న భావం పెరుగుతుంది. ప్రభుత్వం నుండి ప్రచారం, ప్రోత్సాహకాలు పెంచేలా వత్తిడి చేయాలి. సమాజంలో మనమూ మారాలనే ఆలోచనలున్న యువత, తల్లిదండ్రులకు అది ధైర్యాన్నిస్తుంది.
మన సమాజంలోని వివాహ వ్యవస్థ, సాంప్రదాయాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవని గొప్పగా భావిస్తుం టాం. అందుకు ప్రధానంగా చూస్తున్నది మన వ్యవస్థలో విడా కులనేవి చాలా తక్కువగా ఉండటం. కానీ మన కుటుంబ వ్యవ స్థలో ఎంతమంది భార్యాభర్తలు సుఖసంతోషాలతో సంతృప్తి గా ఉంటున్నారో సర్వే రిపోర్టులను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎక్కు వ కుటుంబాలలో రాజీపడి, యాంత్రికంగా జీవనం సాగి స్తున్నా రన్న వివరాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అందుకు మూలా లను పరిశీలిస్తే వాస్తవం బోధపడుతుంది. ముందుగా పరిచ యముండి పరస్పరం అవగాహనతో చేసుకున్నవారి కాపురాల్లో ఎక్కువమంది ఆనందంగా, సంతృప్తిగా ఉంటున్నారని అధ్యయ నాలు చెబుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కాలం గడి చిన కొద్దీ గట్టిపడాలి. సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్న దంపతులు ప్రాణ స్నేహితులుగా మారాలి. శారీరకంగా దగ్గర వటం, సంతానంతో బంధం మరింత బలీయమవుతుంది. వారి మధ్య స్నేహం, సాన్నిహిత్యం ఉన్నత శిఖరాలకు చేరుతుంది. కానీ ఎక్కువ జంటలలో ఇలా జరగకపోవటానికి కారణాలను పరిశీలిస్తే కొందరిలో కాలం గడిచిన కొద్దీ యాంత్రిక ధోరణి పెరగడం కనిపిస్తుంది. ప్రేమించుకున్న వారిలో ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెండ్లికి సిద్ధమవుతారు. అటువంటి వారిలోనూ కొందరు అనతికాలంలోనే కొట్లాటలతో విడిపోవడం కూడా చూస్తున్నాం. కారణాలు స్పష్టంగానే అర్థం చేసుకో వచ్చు. ఏ అంశాలు చూసి ఒకరినొకరు ఇష్టపడు తున్నారో గమనిస్తే ఎందుకు విడిపోతున్నారో కూడా అర్థమవుతుంది. కేవలం కాబోయే జీవిత భాగస్వామిలో అందం, ఆస్తి, హోదానే చూసి చేసుకున్న వారు పెండ్లి అనంతరం వారి వైఖరి (అటిట్యూడ్)తో సర్దుకోలేక దూరమవటం కనిపి స్తుంది. యువతీ యువకులు జీవిత భాగస్వామి ఎన్నిక విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోక పోవడానికి, ఇష్టపడిన వారిని చేసుకోలేకపోవడానికి కులం, మతం ఇనుపగోడల్లా అడ్డుపడటం చూస్తున్నాం. అవి ఆలోచనలకీ ఆటంకమవుతున్నాయి. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల్లో యువత తమకు నచ్చిన వారినే చేసుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఎక్కువగా పెద్దలు గీసిన పరిధుల్లోనే పిల్లలు ఇష్టపడి చేసుకో వడం చూస్తున్నాం. చుట్టూ ఉన్న అనేక మందిలో నచ్చిన వారున్నా కుల, మత ఆచారాల కండ్లద్దాలకు కనిపించిన వారిని మాత్రమే కట్టుకోవడానికి పరిమితమవుతున్నార. మ నతో కలిసి జీవితాన్ని పంచుకునే భాగస్వా మిని ఎంచుకోవడం చిన్న విషయం కాదు.
యుక్త వయస్సు వచ్చిన పిల్లలు జీవిత భాగస్వామి ఎన్నిక పట్ల అవగాహన ఏర్పర్చుకోవడంలో 2 దశలను చూస్తుంటాం. కుటుంబంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి తెలుసుకోవడం. 2.చదువు, ఉపాధి పొందే చోట్ల స్నేహితుల సర్కిల్, సినిమా, సాహిత్యం, మీడియా, ప్రభుత్వ చర్యలు తదితరాల ప్రభావం. మొదట నేటి మన కుటుంబ నేపథ్యాలను పరిశీ లించాలి. చిన్నతనం నుండి పిల్లలు ఏం చదివితే బాగుంటుందో, జీవితంలో ఎలా స్థిరపడాలో చర్చిస్తుంటాం కానీ భవిష్యత్తులో 50, 60 ఏండ్లు కలిసి బతకాల్సిన జీవిత భాగస్వామిగా ఎలాంటి వారైతే బాగుంటుందన్న విషయాలను పిల్లలతో మాట్లాడుతుంటామని చెప్పగలమా? ఉదాహ రణకు లైఫ్ పార్టనర్ నిజాయితీ గురించి. ఒకరి పట్ల మరొకరు అరమరికలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించడానికి నిజా యితీగా ఉండటమే కదా కొలమానం. డబ్బు పట్ల అవగాహన కూడా ఎంతో ముఖ్యమైంది కదా! కుటుంబ పోషణకు అవసరమైన మేరకు సంపాదనకు స్వయం కృషితో ప్రయత్నించే మనస్తత్వం ఉన్నవారితో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కానీ డబ్బుతోనే అన్నీ సమకూరుతాయన్న పిచ్చి ఎక్కువగా ఉంటే కట్నకానుకులు, ఆస్తి ఆశించడం, పిసినారితనం, అవినీతికి అలవాటు పడే ప్రమాదం లేదనగలమా! సామాజిక స్పృహ కూడా అవసరం కదా! మన చుట్టూ ఉండే ప్రజల సమస్యలను, పరిస్థితులను అర్థం చేసుకునే లక్షణం ఉంటే తమ జీవితంలోనూ ఎదురయ్యే సమస్యలను అధిగమించగలుగుతారు. అవకాశం ఉన్న మేరకు స్పందించి తోటివారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఒకరి ఇష్టాలను, అలవాట్లను మరొకరు గౌరవించడం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించే లక్షణాలుండటం కూడా ఎంతో ప్రధానం కదా! ఇంట్లో పిల్లలను అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తేడా లేకుండా సమంగా పెంచటాన్ని బట్టే పురు షాధిక్యతా స్వభావం ఏర్పడకుండా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు భార్యా భర్తలుగా మాట్లాడుకునే తీరు, నిర్ణయాలలో భాగస్వాములయ్యే పద్ధతి, ఒకరిపట్ల మరొకరు ప్రవర్తించే తీరు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. చెప్పిందానికంటే చూసిందే ప్రభావితం చేస్తుంది. అనే క సినిమాలు చూస్తుంటాం. హీరో హీరోయిన్ల పెండ్లీకి ఎక్కువ ప్రేమే పునాదిగా ఉంటుంది. కథలో కష్టాలతో ఉండే అనేక మలు పుల్ని అధిగమించి చివరలో వారు ఒకటయ్యే దృశ్యాలను ఆస్వాది స్తాం. కులం పేరుతో, అంతరాల పేరుతో వారి ప్రేమకు అడ్డుప డే పెద్దల్ని తిట్టుకుంటాం. కానీ అదే పిల్లల విషయంలో జరిగితే భూమి బద్దలైనట్టు ఫీలవుతాం. విశాలమైన ఆలోచనలకు బదు లు సంకుచిత సంకెళ్లు వేసుకుంటాం. మన పొరల్లో ఉన్న మను వాదపు భావజాలం పడగ విప్పుతుంది. వెండి తెర సీన్లు మబ్బు ల మరుగున పడతాయి. జీవితం సినిమా కాదంటాం! అడుగు లు ముందుకు వేసేవారిని చూసి భయపడతుంటాం. ముందడుగు వేస్తామనే పిల్లల్ని లాగి భయపెడుతుంటాం.
యుక్త వయస్సు వచ్చిన పిల్లలను బయటి ప్రపంచం కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. సమాజం కుటుంబాల జీవనంతో వ్యవస్థీకృతమై ఉంది. అసమానతలు అంతరాలను అధిగమించే ఆరోగ్యకరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఏర్పడీ కుటుంబాల పట్ల పాలకులకు బాధ్యత లేదా? పాలించే స్థానంలో ఉన్నవారే కదా! మంచి మార్పుకై ప్రభావితం చేయగలిగేది. కా నీ ప్రభుత్వాలు తమ బాధ్యతగా భావిస్తున్నాయనుకోగల మా? వ్యక్తిగత, కుటుంబ సమస్యలుగా చూపుతూ పట్టించుకోకపోవడమే చూస్తున్నాం. అనేక కుల దురహంకార హత్యలు జరుగుతున్నా ప్రభుత్వ చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. త మ అధికారానికి ప్రజల్లో విభజనే పునాధి గా భావించే పాలకులు పట్టించుకునే అ వకాశం ఉన్నదా? అందుకే ప్రభుత్వాలు అవకాశవాదంతో కంటి తుడుపు చర్యలకే పరిమితమవటం కనిపిస్తుం ది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి కొంత ఆర్థిక సాయం చేస్తామనే ప్రకటనలతోనే వదిలేస్తున్నది. కులాం తర వివాహాలు చేసుకునే వారు ప్రారం భంలో నిలదొక్కుకోవటానికి తగిన ఆర్థిక ఆసరా ఎంతో అవసరం. అలాంటి వివాహాలను అడ్డుకునే వారి నుండి రక్షణ కల్పించడం ఇంకా అవసరం. పెండ్లి చేసుకున్న దంపతులకు హా ని తలపెట్టే చర్యలకు పాల్పడే వారు భయపడేలా కఠిన చర్యలుండాలి. కుల అసమానతల సాంప్రదా యానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించాలి.
కుల మత అడ్డు గోడలతో మానవత్వానికి మచ్చగా, ప్రపంచంలోనే ఎంత వెనుకబాటు తనంతో ఉంటున్నామో నిరంతరం జాగృతం చేయాలి. అలాంటి వాతావరణం యువతకు ధైర్యాన్నిస్తుంది. వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఎన్నికలో స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు. అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురైనా నిలబడగలుగుతారు. తమ భవిష్యత్తు కోసం, మార్పు మార్గంలో తామూ భాగస్వామలవుదామన్న భావం పెరుగుతుంది. ప్రభుత్వం నుండి ప్రచారం, ప్రోత్సాహ కాలు పెంచేలా వత్తిడి చేయాలి. సమాజంలో మనమూ మారా లనే ఆలోచనలున్న యు వత, తల్లిదం డ్రుల కు అది ధైర్యా న్నిస్తుంది. కుల విభజన చూపే మనువాదపు చర్యలు ఇటీవల పెరిగిపోయాయి. అందుకే కుల పరమైన వాదనలకు వ్యతిరేకమైన క్యాంపెయిన్ తీవ్రంగా జరగాల్సిన అవసరం నేడు మరింత పెరిగింది.
సెల్ : 9490098586
Authorization