ఈ ప్రపంచంలో ఏ మనిషి జీవితమూ సాఫీగా సాగదు. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నాలకు తమ అద్భుత బుద్దిబలాన్ని ఆయుధంగా చేసుకుంటారు. లక్ష్యాలను సాధించిన క్రమంలో వీరి జీవితాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈ తరహా నేపథ్యంలో తెరకెక్కి, ప్రేక్షకుల విశేషా ఆదరణ పొందిన కొన్ని అత్యద్భుత మేధాశక్తి చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'...
ది లెజెండ్ ఆఫ్ 1900
డానీ బూడ్మాన్ అనే వ్యక్తి షిప్లో ఓ చిన్న పిల్లాడిని చూస్తాడు. ఆ పిల్లాడిని పెంచి పెద్ద చేస్తాడు. పిల్లాడు పెద్దయిన తర్వాత పియానో నేర్చుకుంటాడు. అట్నుంచి మ్యూజికల్ జీనియస్‌గా, లెజెండ్‌గా ఎదుగుతాడు. ఈ క్రమంలో లేడీ ట్రంపెట్ ప్లేయర్ మాక్స్ టూనీ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథ. ఇటాలియన్ దర్శకుడు గియు సేప్ టోర్నాటోరే రూపొందించిన తొలి ఇంగ్లీష్ చిత్రమిది. 1998లో విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌గా ఓ మాస్టర్ పీస్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు పొందింది.
ఫెర్మాట్స్ రూమ్
నలుగురు మేథమేటిషియన్స్ను ఓ గుర్తు తెలియని వ్యక్తి తన ఆఫీస్‌కు ఆహ్వానిస్తాడు. ఈ నలుగురు ఒకరికొకరు తెలియక పోయినా ఓ మిస్ట్టీరియస్ వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్తారు. వచ్చిన వాళ్ళని ఓ రూమ్‌లో ఉంచి ఓ అంశాన్ని కనిపెట్టాలనే టాస్క్‌ను ఇస్తాడు ఆ అపరిచిత వ్యక్తి. ఆ రూమ్‌లో అన్ని వస్తువులు కదులుతుంటాయి. విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. ఆలోచించే టైమ్ కూడా ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో వారేం చేశారు?, మిస్టీరియస్ అంశం ఏంటన్నదే సినిమా. ఈ స్పానిష్ చిత్రానికి లూయిస్ పైద్రహిత, రోడ్రిగో సపోన్యా సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.
కిలో టు బ్రావో
బ్రిటీష్ సైనికులు అఫ్ఘానిస్తాన్‌లోని కజకి డ్యామ్ వద్ద టెర్రరిస్టులకు, ల్యాండ్ మైనింగ్‌కు వ్యతిరేకంగా సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అందులో మార్క్ వైట్ అనే మంచి టాలెంటెడ్, చురుకైన సైనికుడు అనుకోకుండా ఎన్‌కౌంటర్‌కు గురవుతాడు. ఆద్యంతం స్ఫూర్తిని కలిగించే అత్యంత తెలివైన
ఆ సైనికుడి మరణం అప్పట్లో సంచలన సృష్టించింది. మార్క్ వైట్ జీవితం ఇతివృత్తంతో ఈ బ్రిటీష్ వార్ చిత్రాన్ని దర్శకుడు పాల్ కటిస్ రూపొందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగానూ ఆకట్టుకుంది. పలు అవార్డులనూ కైవసం చేసుకుంది.
విప్లాష్
యువ టాలెంటెడ్ డ్రమ్మర్ ఆండ్రూ ప్రతిష్టాత్మక మ్యూజిక్ అకాడమీలో చేరి ప్రొఫెషనల్‌గా తయారు కావాలనేది అతని లక్ష్యం. ఆ స్కూల్ ప్రొఫెసర్ చాలా స్ట్రిక్ట్. బాగా చేయడం కోసం, తను చెప్పింది చేయడం కోసం కఠినంగా వ్యవహరిస్తారు. కొట్టడం కూడా చేస్తుంటాడు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆండ్రూ గ్రేట్ డ్రమ్మర్‌గా ఎదగడమనేది ఈచిత్ర కథ. డామియన్ చజెల్లే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకున్న ఈ చిత్రం 4 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 50 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
ది బెస్ట్ ఆఫర్
విర్జిల్ ఓల్డ్‌మ్యాన్ తెలివైన కళాకారుడు. ఆర్ట్, పురాతన కళాఖండాలను పెయింట్స్ వేస్తూ ప్రపంచంలోనే జీనియస్ ఆర్ట్ ఎక్స్‌పర్ట్‌గా పేరొందుతాడు. ఈ క్రమంలో పరిచయమైన ఓ మహిళ వల్ల అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. గియుసేప్ టోర్నాటోరే దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ మిస్టరీ బేస్ట్ ఇంటలిజెంట్ చిత్రం 2013లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది.
ఫాలింగ్ డౌన్
డిఫెన్స్ ఇంజనీర్‌గా రిటైర్డ్ అయిన ఓ వ్యక్తి ఒంటరిగా జీవనం సాగిస్తుంటాడు. సమాజంలో కనిపించే లోపాలను చూసి తట్టుకోలేకపోతుంటాడు. ప్రభుత్వ అధికారుల్లోనూ, ఇతర వ్యక్తుల్లోనూ, షాపుల్లోనూ, రోడ్లపై ఇలా ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, అశ్రద్ధ, దోపిడీలే కనిపిస్తాయి. దీంతో ఆ మాజీ ఇంజనీర్ ప్రస్టేషన్కు గురై సమాజంపై ఎదురుతిరుగుతాడు. హింసను ఆయుధంగా చేసుకుని ఆయనెలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడు?,
దాన్ని వల్ల చోటు చేసుకున్న పరిణామాలేంటి అన్నదే సినిమా. జోయేల్ షూమేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1993లో విడుదలై విశేష ఆదరణ పొందింది. ఇదొక ఫ్రెష్ కంటెంట్‌గా అభివర్ణించబడింది. మాజీ ఇంజనీర్ పాత్రలో మైఖేల్ డగ్లాస్ నటన అద్యంతం అలరిస్తుంది. 25 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 41 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
బ్లైండ్నెస్
ఇద్దరు భార్యభర్తలు హ్యాపీగా జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో భర్తకు తెల్లటి మబ్బులతో కూడిన అంధత్వం వస్తుంది. అది కాస్త అంటువ్యాధిగా మారి అక్కడి వారందరికీ వ్యాపిస్తుంది. ఆ అంటువ్యాధికి కారణమేంటి?, దాన్నుంచి ప్రజలంతా బయటపడ్డారా లేదా అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 1995లో అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా దర్శకుడు ఫెర్నాండో మైరెల్లిస్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 2008లో విడుదలైన ఈ చిత్రంలో జులియన్నే మూర్, మార్క్ రుఫలో, గేల్ గార్సియా బెర్నాల్, డానీ గ్లోవర్ తదితరులు నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
ఎగ్జామ్
కార్పొరేట్ జాబ్ కోసం ఎనిమిది మందిని ఒక రూమ్‌లో ఉంచుతారు. ఆ తర్వాత రూమ్‌కి లాక్ చేస్తారు. వారికిచ్చిన ప్రశ్నాపత్రంలో ఒకే ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న అందరిని కన్ఫ్యూజ్ చేయడంతోపాటు టెన్షన్‌కి గురి చేస్తుంది. ఆ తర్వాత వారి మధ్య గొడవలకు దారి తీసి, ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్తుంది. ఈ క్రమంలో అంత్యంత ఇంటలిజెన్స్‌తో కూడిన ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పారు?, చివరికి వారిలో ఎవరు మిగిలారన్నది ఈ చిత్ర కథ. స్టువర్ట్ హాజెల్డైన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆడార్ బెక్, క్రిస్ కారే, గెమ్మ చాన్, నతలీ కాక్స్ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు.
ట్రాకర్
యుద్ధంలో శరణార్థిగా మిగిలిన ఓ ఆఫ్రికన్ పరదేశమైన న్యూజిలాండ్‌కి వలస వెళ్తాడు. అక్కడ తన మనుగడ కోసం పోలీసులను చంపుతాడు. ఆ తర్వాత తనకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతుంటాయి. అత్యంతం సాహసోపేతంగా సాగే అతని ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు?,
తన తెలివితో ఎలా మనుగడ సాధించగలిగాడనేది ఈ చిత్ర కథాంశం. ఇయాన్ షార్ప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2011లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించబడింది. శరణార్థి పాత్రలో రే విన్‌స్టోన్ నటన అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
వాట్ డ్రీమ్స్ మే కమ్
క్రిస్ నెల్సన్ ఓ రోజు కళాకారిణి అన్నె కోలిన్స్‌ను కలుస్తాడు. తొలి పరిచయమే పెళ్ళికి దారి తీస్తుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిస్తారు. అనుకోకుండా కారు ప్రమాదంలో ఆ ఇద్దరు పిల్లలు చనిపోతారు. భార్య మానసికంగా డిస్ట్రబ్ అవుతుంది. మరికొన్ని రోజులకు క్రిస్ సైతం కారు యాక్సిడంఎట్లో చనిపోతాడు. కానీ తన ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఆత్మ రూపంలో తన భార్యను, పిల్లలను వెతికే ప్రయత్నమే ఈ చిత్రం. విన్సెంట్ వార్డ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1998లో విడుదలై విశేష ఆదరణ పొందింది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. ఈ చిత్రంలో క్రిస్ పాత్రలో రాబిన్ విలియమ్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఇన్స్టింక్ట్
ఓ తెలివైన సామాజిక శాస్త్రవేత్త డా||ఎథన్ పవెల్ ఉన్నట్టుండి సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వరుసగా హత్యలకు పాల్పడుతుంటాడు. గోరిల్లాగా ప్రవర్తిస్తుంటాడు. ఇది తెలిసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. సెల్లో ఓ సైకాలజిస్ట్ ఎథన్ను ట్రీట్ చేస్తుంటాడు. ఎథన్ నుంచి రాబట్టిన నిజాలేంటి? ఆయన అలా మారడానికి కారణమేంటి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమా. ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు జోన్ టర్టెల్తాంబ్ రూపొందించారు. 1999లో విడుదలైన ఈ చిత్రంలో ఎథన్ పాత్రలో ఆంటోని హాప్కిన్స్ నటన అందరినీ విశేషంగా అలరిస్తుంది.
ఫ్లాష్ ఆఫ్ జీనియస్
1993లో న్యూయార్క్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా జాన్ సీబ్రూక్ రాసిన ఆర్టికల్‌ను బేస్ చేసుకుని రూపొందించిన బయోగ్రాఫికల్ చిత్రమిది. రాబర్ట్ కీర్న్స్ ఆటోమొబైల్‌కు సంబంధించి వైడ్షీల్డ్ వైపర్ టెక్నాలజీ ఐడియాను కనిపెడతాడు. దానికి సంబంధించి పేటెంట్‌ను కూడా పొందుతాడు. కానీ రాబర్ట్‌కు తెలియకుండా ఫోర్డ్ మోటర్ కంపెనీ ఆ ఐడియాను చోరీ చేసి ఓ కారును కూడా తయారు చేస్తుంది. దీనిపై రాబర్ట్ చేసిన న్యాయపరమైన పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి వ్యతిరేకంగా ఒక వ్యక్తి సాగించే పోరాటం స్ఫూర్తివంతంగా నిలిచింది. మార్క్ అబ్రహం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాబర్ట్ కీర్న్స్ పాత్రలో గ్రెగ్ కిన్నేర్ నటించి మెప్పించాడు.
పే ఇట్ ఫార్వర్డ్
ఓ విద్యార్థికి తండ్రి లేడు, ఉన్న తల్లి మద్యానికి బానిసై ఉంటుంది. దీంతో ఆయోమయమైన స్థితిలో ఉన్న ఆ కుర్రాడికి వాళ్ళ టీచర్ ఓ ఛాన్స్ ఇస్తాడు. అది ప్రపంచాన్ని మర్చే గొప్ప ఐడియా. దాన్ని సుసాధ్యం చేసేందుకు బయలుదేరిన ఆ కుర్రాడు తన తెలివితేటలతో ప్రపంచాన్ని మలుపుతిప్పే పని ఏం చేశాడన్నది ఈ చిత్ర కథాంశం. మిమి లెదర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకా దరణ పొందింది. ముఖ్యంగా యాక్టింగ్, కథ, సంగీతం, సినిమాటో గ్రఫీ విభాగంలో మంచి ప్రశంసలందుకుంది. కలెక్షన్ల పరంగానూ ఆకట్టుకుంది. ఇందులో కుర్రాడు పాత్రలో హలే జోయెల్ ఓస్మెంట్, అతనికి గైడ్ చేసే టీచర్ పాత్రను కెవిన్ స్పేసీ పోషించారు.
ది ఇంటర్వ్యూ
ఉద్యోగం పోవడం, కుటుంబం దూరమవడంతో ఎడ్డీ రోడ్నీ ఫ్లెమింగ్ ఒంటరిగా తన అపార్ట్మెంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు ఉదయం ఇద్దరు పోలీసులు ఎడ్డీని అరెస్ట్ చేసి ఇంటిని సీజ్ చేస్తారు. కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడమే కాకుండా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి తీస్కెళ్ళి కారు దొంగతనం గురించి విచారిస్తుంటారు. ఈ క్రమంలో బయటపడిన నిజాలేంటి? దాని వెనకాల ఉన్న అసలు కథేంటి అనేది ఈ చిత్ర ఇతివృత్తం. సినిమా మొత్తం పోలీస్ ఇంటరాగేషన్ గదిలో జరుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, సస్పెన్స్‌గా సాగే
ఈ చిత్రాన్ని క్రెయిన్ మొనాహన్ దర్శకత్వం వహించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇందులో ఎడ్డీ పాత్రలో హ్యూగో వీవింగ్, పోలీసుల పాత్రల్లో టోనీ మార్టిన్, ఆరోన్ జేఫ్ఫెరీల నటన కట్టిపడేస్తుంది.
Authorization