స్వీడన్ చిత్రాలు.. భిన్న కథలు, ప్రయోగాత్మక కథలు, భావోద్వేగ పూరిత నేపథ్య గాథలైనప్పటికీ అత్యంత సహజంగా ఉండటం వీటి ప్రత్యేకత. ముఖ్యంగా ఎమోషన్స్‌ని వెండితెరపై విష్కరించడంలో
ఈ చిత్రాలు తీరు అత్యద్భుతంగా ఉంటుంది. విశేష ప్రేక్షకాదరణతో పాటు పలు అంతర్జాతీయ
చలన చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలందుకున్న కొన్ని స్వీడన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ..
40 ఏండ్ల క్రితం జరిగిన వింతగొలిపే వరుస హత్యలను తెలిపే చిత్రమిది. ఓ దీవిలో కుటుంబమంతా కలిసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరైన హరీయట్ వాంగర్ అనే మహిళ తప్పి పోతుంది. ఎన్ని రోజులు వెతికినా ఆమె కనిపించదు. విడిపోయిన తన ఫ్యామిలీకి చెందిన వారే ఈ హత్య చేసుంటారని వాంగర్ మామ భావిస్తారు.
ఈ కేసును కంప్యూటర్ హ్యాకర్‌తో కలిసి ఓ జర్నలిస్ట్ ఛేదించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో వాళ్ళకు దొరికిన ఒక లింక్ ద్వారా గతంలో జరిగిన వరుస వింతైన హత్యలు బయటపడటమే ఈ చిత్ర కథాంశం.
తీగ లాగితే డొంక కదిలిందన్నట్టుగా సాగే
ఈ చిత్రం ఆద్యంతం నాటకీయంగా,
థ్రిల్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. దర్శకుడు నీల్స్ ఆర్డెన్ ఒప్లెవ్ ఈ చిత్రాన్ని అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించారు. ఇది 2009లో విడుదలై సంచలన విజయం సాధించింది. మంచి కలెక్షన్లతోపాటు అనేక అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇందులో జర్నలిస్ పాత్రలో జర్నలిస్ట్ పాత్రలో మైకేల్ నైక్విస్ట్, హ్యాకర్ పాత్రలో నోవోమీ రాపేస్ నటించి మెప్పించారు.
ది గర్ల్
ఇది తొమ్మిదిన్నరేండ్ల అమ్మాయి జీవితాన్ని తెలిపే చిత్రం. 1981లో తల్లిదండ్రులు, సోదరుడు ఛారిటబుల్ వర్క్ కోసం ఆఫ్రికాకు వెళ్తూ అత్తయ్య వరుసైన అన్నా ఇంట్లో తమ పాపను ఉంచుతారు. అయితే అన్నా తీరు, ఆమె చేసే పనులు ఇబ్బందిగా ఉండటంతో ఆ పాప ఇంట్లో నుంచి పారిపోతుంది. తనను తాను తెలుసుకోవడంతోపాటు స్వేచ్ఛ పొందేందుకు ఆ పాప ఎలాంటి అనుభవాలను చవిచూసిందనేది ఈ చిత్ర కథాంశం. స్వేచ్ఛ కోరుకునే అమ్మాయిలోని సవాళ్ళను, ఆలోచనలను ప్రతిబింబించే ఈ చిత్రాన్ని దర్శకుడు ఫ్రెడరిక్ ఎఫ్ఫెల్డ్ 2009లో రూపొందించారు. అమ్మాయి పాత్రలో నటించిన బ్లాంకా ఇంగోస్ట్రోమ్ నటన కట్టిపడేస్తుంది.
బర్రోయింగ్
సెబాస్టియన్ 11ఏండ్ల బాలుడు. తల్లితోపాటు కలిసి ఉన్న ఆ పిల్లాడి లైఫ్ అందంగా సాగుతుంది. తను నివసించే ప్రదేశంలోని ప్లే గ్రౌండ్లో ఉంటూ ఇరుగు పొరుగువారిని, పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అలా సెబాస్టియన్ అక్కడి మనుషులకు, పరిసరాలకు మధ్య ఉన్న ఒక కనెక్టింగ్ పాయింట్ గమనిస్తాడు. అదేంటనేది సినిమా. టీనేజ్ కుర్రాడి ఆలోచనా విధానాన్ని, అతని అనుభవాలను తెలిపే ఈ చిత్రాన్ని దర్శకులు హెన్రిక్ హెల్స్ట్రోమ్, ఫ్రెడ్రిక్ వెన్జెల్ సంయుక్తంగా 2009లో రూపొందించారు. సెబాస్టియన్ పాత్రలో సెబాస్టియన్ ఎక్లండ్ నటన ఆకట్టుకుంది.
ఇన్వాలెంటరీ
ట్రాజిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇందులో ఐదు కథలు ఏకకాలంలో సాగుతుంటాయి. ఐదు కథల్లో.. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడుగానీ, మరే పరిస్థితుల్లోనైనా సమాజంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది?, ఐదు కథల్లోనూ వాళ్ళ స్పందన ఎలా ఉందనే విషయానికి ఈ చిత్రం అద్దం పట్టింది. రుబెన్ ఓస్ట్లండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2008లో విడుదలై ఆకట్టుకుంది. విమర్శకుల నుంచి పాజిటివ్ స్పందన రాబట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ఏడు నిమిషాల పాటు కట్స్ లేకుండా తీసిన లాంగ్ షాట్ ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు విదేశీ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌కు పంపబడింది. అలాగే అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. మారియా లుండ్‌క్విస్ట్, లీఫ్ ఎడ్లుండ్, ఒల్లె లిజాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సెర్చింగ్ ఫర్ షుగర్ మ్యాన్
1990లో జరిగిన కథ. అమెరికన్ మ్యూజిక్ స్టార్ సిక్ట్సోరొడ్రిగ్విజ్ కనిపించకుండా పోతాడు. సౌత్ ఆఫ్రికాలో పాపులర్ మ్యూజిషియనే అయినప్పటికీ అమెరికాలో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతాడు. ఈ క్రమంలో అతను కనిపించకుండా పోవడం వెనుక ఉన్న కారణాలను అతనంటే పెద్దగా ఇష్టం లేని ఓ ఇద్దరు వ్యక్తులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఈ క్రమంలో వాళ్ళు ఏం తెలుసుకున్నారనేది కథ. మాలిక్ బెండ్జిలౌల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2012లో విడుదలై విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది.
సౌత్ ఆఫ్రికన్ సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రం ఆస్కార్ అవార్డునందుకోవడంతోపాటు అనేక అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇందులో షుగర్ మ్యాన్, క్రేగ్ బాత్రోమెవ్ ప్రధాన పాత్రల నటన ప్రేక్షకుల్ని మెప్పించింది.
యుఫోరియా
ఇదొక ఇద్దరు టీనేజ్ ట్విన్ సిస్టర్స్ కథ. ఓ తెలియని గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఈ ఇద్దరి ట్వీన్ సిస్టర్స్ మధ్య జరిగే సంఘటనలు, వారి భావాలు, అభిప్రాయాలు.. ఇలా ప్రతీదీ విరుద్ధంగా ఉంటాయి. ఈ క్రమంలో వాళ్ళెదుర్కున్న మానసిక సంఘర్షణ ఏమిటి?, ఆ తెలియని గమ్యానికి అర్థమేమిటో తెలుసుకున్నారా లేదా అనేదే ఈ చిత్రం. ఈ చిత్రానికి యుఫోరియా అనే టైటిల్ పెట్టారు. యుఫోరియా అంటే ఆనందం. ఆనందాన్ని వెతకటానికి ట్విన్ సిస్టర్స్ చేసిన ప్రయాణమే ఈచిత్రమని చెప్పొచ్చు. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రానికి లిసా లాంగ్సెత్ దర్శకత్వం వహించారు.
టూరిస్ట్
విహార యాత్రకు వెళ్ళిన ఓ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. స్వీడన్‌కు చెందిన ఓ కుటుంబం సెలవుల్లో ఫ్రెంచ్‌లోని ఆల్ఫ్స్ పర్వాత ప్రాంతానికి వెళ్ళి సరదాగా గడిపిన అనంతరం సమీపంలోని రెస్టారెంట్లో లంచ్ చేస్తుంటారు. ఆ టైమ్‌లో పర్వతాలకు చెందిన మంచు దిబ్బలు జారి వేగంగా ఆ రెస్టారెంట్ వైపు వస్తుంటాయి. దీంతో ప్రాణాలను కాపాడుకోవడానికి జనంతోపాటు భార్య, ఇద్దరు పిల్లలు ఓ వైపు పరిగెడుతుంటే, స్వీడన్ వ్యాపారవేత్త థామస్ వేరే దారిలో పరిగెడతాడు. దీంతో దూరమైన తన ఫ్యామిలీని థామస్ వెతుక్కుంటూ వెళ్ళే ప్రయాణమే ఈ సినిమా. ఆద్యంతం కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2014లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. విజువల్ ట్రీట్‌గా నిలిచిన ఈ చిత్రంలోని థామస్ పాత్రలో జోహాన్నెస్ బాV్‌ా కుహ్న్కే, ఆయన భార్యగా లిసా లావెన్ కాంగ్ల్సిల నటన అలరిస్తుంది. ఈ చిత్రం ఆస్కార్ నామినేట్ కావడంతోపాటు కేన్స్‌లోనూ ప్రదర్శితమై జ్యూరీ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ అవార్డులను కైవసం చేసుకుంది.
వి ఆర్ ది బెస్ట్
వివిధ నేపథ్యాలకు చెందిన 13ఏండ్ల వయస్సున్న ముగ్గురు టీనేజ్ గర్ల్స్ కలిసి ఒక గ్రూప్‌గా పంక్ బ్యాండ్‌గా తయారవ్వాలనుకుంటారు. అయితే వీరి దగ్గర సంగీత పరికరాలు లేకపోగా, వాటినెెలా వాయించాలో కూడా తెలీదు అయినప్పటికీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారికి సమీపంలో ఐరన్ ఫిస్ట్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నడుపుతున్న కుర్రాళ్లను వీళ్ళు డిస్ట్రబ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు వి ఆర్ ది బెస్ట్ అనిపించుకునేలా ఏం చేశారు? వారి చేసిన సరికొత్త ప్రయత్నాలు ఏమిటి? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. లుకాస్ మూడ్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మ్యూజికల్ డ్రామా చిత్రం విశేష ఆదరణ పొందింది. ముగ్గురు టీనేజ్ అమ్మాయిల పాత్రల్లో మీరా బార్ఖమ్మార్, మీరా గ్రోసిన్, లివ్ లెమోయ్నే నటించారు. వారి నటన ఆద్యంతం అలరిస్తుంది. ఓ మధురమైన జారుఫుల్ మూవీగా విమర్శకులు అభివర్ణించిన ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై అందరి మనసుల్ని గెలిచింది.
ఈట్ స్లీప్ డై
ఈస్ట్ యురోపియన్‌కు చెందిన 20 ఏండ్ల యువతి రాసా ఉద్యోగం కోసం స్వీడన్‌కు వలస వస్తుంది. కొన్ని కారణాల వల్ల పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ఉద్యోగం కోల్పోతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న టైమ్‌లోనే తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. ఓ వైపు తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉద్యోగం కోసం తిరిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, సవాళ్ళు ఏంటనేది ఈ చిత్ర కథాంశం. రియలిస్టిక్ కథాంశంతో గాబ్రియేలా పిచ్లన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2012లో విడుదలైంది. మహిళా శక్తిని చాటిన ఈ చిత్రంలో రాసా పాత్రలో నిర్మిన లుకాక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
ది రీ యూనియన్
దాదాపు 20 ఏండ్ల తర్వాత హైస్కూల్లో చదువుకున్న క్లాస్‌మెట్స్ అంతా కలుస్తారు. కాని పాపులర్ నటి, క్లాస్‌మెట్స్‌లో ఒకరైన అన్నా ఓడిల్కి మాత్రం ఆహ్వానం రాదు. ఆహ్వానం రాలేదని అన్నా బాధపడుతుంది. ఒకవేళ ఈ పూర్వ సమ్మేళానికి తాను హాజరై ఉంటే ఎలా ఉంటుంది?, అక్కడే జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనే అనుభవాలను ఊహించి, వాటిని సినిమాగా తీసి, తన క్లాస్మెట్స్కి చూపించాలనే అన్నా లక్ష్యమే ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వీయ దర్శకత్వంలో అన్నా ఓడిల్ ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు నటిగా నటించి విమర్శకుల ప్రశంసలందుకోవడం విశేషం. 2013లో విడుదలై ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. తన అనుభవాలను అన్నా ఓడిల్ తెరపై ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది.
ప్లే
యదార్థ సంఘటనల ఆధారంగా 'లిటిల్ బ్రదర్ నెంబర్' లేదా 'బ్రదర్ ట్రిక్' వంటి వినూత్న పేర్లతో పిల్లలను దోచుకునే ఓ టీనేజ్ గ్యాంగ్ కథతో రూపొందిన చిత్రమిది. స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌లో 12-14ఏండ్ల వయసు గల ఐదుగురు నల్లజాతి టీనేజ్ గ్యాంగ్ (2006-2008) రెండు సంవత్సరాల్లో 40 సందర్భాల్లో పిల్లలను ఎలా దోచుకున్నారనేది ఈ సినిమా. రుబెన్ ఓస్ట్లాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2011లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఇందులో అనాస్ అబ్దిరహ్మాన్, సెబాస్టియన్ బ్లికెర్డ్, యన్నిక్ డైకైట్, సెబాస్టియన్ హెగ్మర్, అబ్సియాజిజ్ హిల్‌లో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు.
షీ మంకీస్
టీనేజ్ గర్ల్స్ ఎమ్మా, కసాంద్రా క్వెస్ట్రియన్ విన్యాసాల్లో జట్టుగా కలిసి శిక్షణ పొందుతారు. పోటీల్లోనూ పాల్గొంటారు. ఈ క్రమంలో వీళ్లిద్దరు ఫిజికల్‌గా, సైకలాజికల్‌గానూ బాగా దగ్గరవుతారు. గేమ్స్‌లో ఎమ్మా మాస్టర్‌గా ఎదుగుతూ టాప్ పొజిషియన్కు వెళ్తుంది. కానీ కసాంద్రా మాత్రం గెలవలేకపోతుంటుంది. తన స్నేహితురాలే తనకు పోటీ అనేది తట్టుకోలేకపోతుంది. దీంతో ఆమె ఏం చేసిందనేది సినిమా. సంక్లిష్టమైన సినిమాగా అభివర్ణించబడిన ఈ చిత్రానికి లిసా ఆచస్ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఎమ్మా పాత్రలో మాథిల్లా పెరేడిసెర్, కేసాంద్రా పాత్రలో లిండా మోలిన్ల నటన ఆద్యంతం భావోద్వేగపూరితంగా సాగుతుంది.
అవలోన్
ఓ వ్యక్తి జీవితంలో అనుకోకుండా చోటు చేసుకున్న ఒక సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పిందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. 60ఏండ్ల వయసున్న జానే పార్టీ ప్రమోటర్. బాస్టర్ నగరంలోని సముద్ర తీరంలో టెన్నిస్ వార్షిక చివరి వారంలో ఓ రోజు నైట్‌క్లబ్ నిర్వహిస్తాడు. ఆ టైమ్‌లో తన సోదరి కూడా ఉంటుంది. ఈ క్రమంలో జానే ఓ యాక్సిడెంట్ చేస్తాడు. దీంతో అతని జీవితం మొత్తం తలక్రిందులైపోతుంది. సరదాగా ఉండే జానే మానసికంగా కుంగిపోతాడు. ఇతరుల నిందలు ఎదుర్కొంటాడు. అనంతరం అతని జీవితం ఎలాంటి ఒడుదుడుకులకు లోనైందనేదే సినిమా కథాంశం. అక్సెల్ పీటర్సన్ దర్శకత్వంలో 2011లో రూపొందిన ఈ చిత్రంలోని జానే పాత్రలో జోహాన్నెస్ బ్రోస్ట్ నటన అలరిస్తుంది.
సెబ్బీ
ఓ టీనేజ్ కుర్రాడి బలాన్ని, బలహీనతని తెలిపే చిత్రమిది. సెబ్బీ 15ఏండ్ల కుర్రాడు. ఓ ఇరుకైన అపార్ట్మెంట్లో తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. సెబ్బీ చాలా టాలెంటెడ్. తను ఏదైన చేశాడంటే దానిలో తిరుగుండదు. అమ్మే తన బలం. ఆమె విఫలమైతే అతని జీవితంలో అన్ని వైఫల్యాలే ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో సెబ్బీ ఫేస్ చేసిన స్ట్రగుల్సే ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం భావోద్వేగపూరితంగా సాగే ఈ చిత్రానికి బాబక్ నజాఫి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా సెబ్బీ పాత్రలో ఓర్నాస్ సెబాస్టియన్ హియోర్ట్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
Authorization