బ్రూస్లీ.. మెరుపువేగంతో, అసాధరణమైన పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టి కరిపించగల దిట్ట. మార్షల్ ఆర్ట్స్ ప్రేమికులకు ఆరాధ్యుడు. తన సినిమాల్లో దేశ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన దేశభక్తుడు. సరికొత్త ప్రయోగాలతోమార్షల్ ఆర్ట్స్‌లో నూతన విధానాలను ఆవిష్కరించిన సృష్టికర్త. నటుడిగా, మార్షల్ ఆర్టిస్ట్‌గా, ఫిలాసఫర్‌గా, కవిగా, దర్శకుడిగా, నిర్మాతగా నేటి తరానికి మార్గదర్శి. ఎవర్గ్రీన్ మార్షల్ ఆర్ట్స్ కింగ్‌గా ప్రేక్షకులు, అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన బ్రూస్లీ జయంతి (సోమవారం) నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత ప్రస్థానం గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...!
రియల్ లైఫ్‌లో స్ట్రీట్ ఫైటర్..
బ్రూస్లీ 1940లో నవంబర్ 27న శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనీస్ హస్పిటల్లో జన్మించారు. తండ్రి లీ హోయి చుయెన్. తల్లి గ్రేస్ హో. ఆయన పుట్టిన ఏడాదిని డ్రాగన్ సంవత్సరంగా పిలుస్తారు. బ్రూస్లీ అసలు పేరు లీ జున్ ఫాన్ (చైనీస్‌లో దాని అర్థం 'మళ్ళీ వస్తాడు'). తండ్రి లీ హోయి అప్పటికే సినీ నటుడు. తండ్రి నటించే చిత్రాల్లో బాల నటుడిగా బ్రూస్లీ నటించి మెప్పించారు. చదువుకునే సమయంలో వింగ్ చున్ అనే ఒక రకమైన మార్షల్ ఆర్ట్స్‌ను గురువు యిప్ మ్యాన్ వద్ద నేర్చుకున్నారు. మెరుపు వేగంతో పంచ్‌లు విసరగలిగే బ్రూస్లీ సామర్థ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్‌లోనూ శిక్షణ తీసుకుని స్థానికంగా జరిగే పోటీల్లో పాల్గొన్నారు. వీటిపై ఉన్న ఆసక్తి చదువుపై బ్రూస్లీ చూపించలేదు. ఇదే క్రమంలో స్ట్రీట్ఫైటర్గానూ ముద్ర పడింది. బ్రూస్లీ చెడిపోతున్నాడని భావించిన తల్లిదండ్రులు మళ్లీ అమెరికాకి వెళ్ళిపోయారు. ఎట్టకేలకు వాషింగ్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు.
మార్షల్ ఆర్ట్స్‌కి వన్నె తెచ్చిన ఘనుడు..
అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత అక్కడే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలోనూ పాల్గొన్నారు. అప్పట్లో కొత్త విద్యలపై బాగా కసరత్తులు చేసేవారు. అందులో భాగంగా వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. 1964లో జరిగిన కరాటే ఛాంపియన్ షిప్లో మొదటిసారి ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రత్యర్థికి కేవలం అంగుళం దూరంలో చేతిని ఉంచి, రెప్పపాటులో బలమైన పంచ్ విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ విధానంపై చాలా కాలంఆధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందనే నిర్ధారణకు వచ్చారు. దీంతో బ్రూస్లీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది.
ఆ తర్వాత 1966-67లో టీవీ సిరీస్‌లో నటించడం ప్రారంభించారు. 'ఐరన్ సైడ్', 'లాంగ్‌స్ట్రీట్' వంటి టీవీ షోస్ బ్రూస్లీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మార్షల్ ఆర్ట్స్‌లోనూ కొత్త ప్రయోగాలు చేస్తున్న సమయంలో వెన్నెముకకి గాయమైంది. కొద్దిరోజులు దానితో బాధపడ్డారు.
అదే తరుణంలో తనలోని రచయిత కోణాన్ని బ్రూస్లీ బయటకు తీసుకొచ్చారు. 'కుంగ్ ఫు' అనే టీవీ సిరీస్ రాశారు. 1970 సమయంలో లీ రెండు చిత్రాలకు సైన్ చేశారు. 'ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ', 'గ్రీన్ హార్నెట్' చిత్రాల్లో ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ విద్యలను ప్రదర్శించి చైనీస్, హాంకాంగ్ సంస్కృతిని ప్రతిబించించేలా చేశారు. ఆ తర్వాత వచ్చిన 'ది చైనీస్ కనెక్షన్' సంచలన విజయం సాధించింది. దీంతో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. 1972లో ఆసియాలోనే పెద్ద స్టార్‌గా లీ ఎదిగారు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రంతో లీ దర్శకుడిగా కూడా మారారు. హాంకాంగ్‌లో స్టార్‌గా ఎదిగినప్పటికీ అమెరికాలో మాత్రం బ్రూస్లీకి ఆ స్టార్ హోదా దక్కలేదు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్న టైమ్‌లో లిండాతో పరిచయం ఏర్పడింది. 1964లో ఆమెను వివాహం చేసుకున్నారు. అదే సమయంలో సొంతంగా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ 'సీటీల్'ను లీ ప్రారంభించారు. లీకి ఇద్దరు పిల్లలు బ్రాండన్, షాన్నన్లున్నారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు.
మిస్టరీగా మరణం..
1973, జులై 20న 'గేమ్ ఆఫ్ డెత్' చిత్రానికి సంబంధించి నిర్మాత రేమండ్ చౌ, తైవాన్ నటి బ్రెట్టీ టింగ్ పైతో కలిసి కథా చర్చలు జరుపుతున్న తరుణంలో లీ మరోసారి కుప్పకూలిపోయారు. అంబులెన్స్‌లో క్వీన్ ఎలిజిబెత్ హాస్పిటల్‌కి తరలించే లోపే లీ (32) కన్నుమూశారని డాక్టర్లు మీడియాకి ప్రకటించారు. ఇదిలా ఉంటే, బ్రూస్లీపై విషప్రయోగం జరిగిందని, బ్రూస్లీ ఐకానిక్ స్టేటస్‌ను జీర్ణించుకోలేని కొందరు సన్నిహితులు కుట్ర చేసి చంపేశారని ..
ఇలా రకరకాలుగా రూమర్స్ వచ్చాయి. దీంతో బ్రూస్లీ మరణం ఓ సంచలన మిస్టరీగా మారింది. లెక్కలేనన్ని సార్లు శవపరీక్షలూ చేశారు. తీవ్రమైన సెరెబ్రియల్ ఎడెమా వల్ల బ్రూస్లీ చనిపోయారని నేరపరిశోధకులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపై కూడా అనుమానాలే వ్యక్తమయ్యాయి. బ్రూస్ లీ జ్ఞాపకార్థం 2013లో హాంకాంగ్ హేరిటేజ్ 'బ్రూస్లీ:కుంగ్ ఫు, ఆర్ట్ లైఫ్' పేరుతో మ్యూజియమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
బాలనటుడిగా తండ్రితోపాటు నటించిన బ్రూస్లీ 'గోల్డెన్ గేట్ గర్ల్', 'ది బర్త్ ఆఫ్ మ్యాన్‌కైండ్', 'వెల్త్ ఈజ్ లైక్ ఏ డ్రీమ్', 'ది కిడ్', 'ఇన్ఫాన్సీ', 'ఏ మైరియడ్ హోమ్స్', 'బ్రేమ్ ఇట్ ఆన్ ఫాధర్', 'ది గైడింగ్ లైట్', 'ఏ మదర్స్ టీయర్స్' వంటి తదితర చిత్రాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, కవిగా.. ఇలా పలు విభాగాల్లో తానేమిటో నిరూపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి లీ. ఆయన నటించిన చిత్రాల్లో, డాక్యు మెంటరీల్లో ది బెస్ట్‌గా నిలిచిన కొన్నింటి గురించి..
ది చైనీస్ కనెక్షన్
గురువు హు యుంజియా వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంటాడు చెన్ జెన్. కొందరు దుండగులు పాయిజన్‌తో గురువును చంపేస్తారు. ఆయన శవాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో స్థానికంగా ఉండే జపనీస్ కుర్రాళ్ళు చెన్ జెన్ను కామెంట్ చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి వాళ్ళ భరతం పట్టి, గురువు మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమనే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రమిది. 1972లో విడుదలైన ఈ మార్షల్ ఆర్ట్స్ చిత్రాన్ని దర్శకుడు లో వియి రూపొందించారు. చెన్ జెన్ పాత్రలో బ్రూస్లీ నటన, ఆయన చేసే మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ది చైనీస్ కనెక్షన్ 2', 'ది చైనీస్ కనెక్షన్ 3', 'ది చైనీస్ కనెక్షన్ 4' చిత్రాలు రూపొందాయి.
ది వే ఆఫ్ ది డ్రాగన్
బ్రూస్లీ అన్నీ తానై చేసిన సినిమా ఇది. 1972లో విడుదలైన ఈ చిత్రం కూడా మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగుతుంది. లక్షా 30వేల డాలర్లలో తెరకెక్కిన ఈ చిత్రం 50లక్షల డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఎంటర్ ది డ్రాగన్
మార్షల్ ఆర్టిస్టుగా పాపులరైన బ్రూస్లీ క్రైమ్‌ను అదుపు చేయడానికి గూఢచారిగా పనిచేయడానికి అంగీకరిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్లో జరిగే అక్రమాలు, కొందరు మాఫియ దుండగుల ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయడమనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని దర్శకుడు రాబర్ట్ క్లౌసీ రూపొందించారు. బ్రూస్లీ పాత్రలో బ్రూస్లీ నటించడంతోపాటు దర్శకత్వ నిర్వహణ, అలాగే నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. ఈ చిత్రం సంస్కృతి, చరిత్ర పరంగా విశిష్ణమైన సినిమాగా అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో గుర్తింపు పొంది భద్రపరచబడింది. బ్రూస్లీ మరణాంతరం విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 22 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతోపాటు 'ది థండర్ స్టోమ్', 'డార్లింగ్ గర్ల్', 'ది ఆర్ఫన్', 'మార్లోవి', 'ది రెక్కింగ్ క్రూ', 'ఏ వాక్ ఇన్ ది స్ప్రింగ్ రెయిన్' చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నారు. 'సర్కిల్ ఆఫ్ ఐరన్', 'గేమ్ ఆఫ్ డెత్', 'గేమ్ ఆఫ్ డెత్ 2' వంటి బ్రూస్లీ నటించిన చిత్రాలు ఆయన చనిపోయిన తర్వాత విడుదలై భారీ విజయం సాధించాయి. వీటితోపాటు 'బ్రూస్లీ: ఏ వారియర్ జర్నీ', బ్రూస్ చిత్రాల ఫూటేజ్‌తో ఆయనకు నివాళిగా నిర్మించిన 'బ్రూస్ లీ : ది మ్యాన్ అండ్ ది లెజెండ్', అలాగే లీ పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు జరిగిన సంఘటనల ఆధారంగా, బ్రూస్లీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా ' ది లైఫ్ ఆఫ్ బ్రూస్లీ' డాక్యుమెంటరీని రూపొందించారు.
ఒకవేళ నేను రేపు చనిపోయినా నాకు ఎలాంటి అసంతృప్తి లేదు, ఉండదు. నాకు ఏం కావాలో,
నేను ఏం చేయాలో అవి ఇప్పటికే చేసేశా. జీవితంలో దేన్నీ అతిగా ఆశించను
- బ్రూస్లీ
బ్రూస్లీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు..
బ్రూస్లీ పుట్టిన ఏడాదిని డ్రాగన్ సంవత్సరంగా పిలుస్తారు. ఇది సంచలనాలకు కేరాఫ్ అని అర్థం. దాని ప్రకారమే ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించారో మనకు తెలిసిందే. బ్రూస్లీ ముద్దు పేర్లు 'లిటిల్ డ్రాగన్', 'లిటిల్ ఫోనిక్స్'. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఈ పేర్లతోనే పిలిచేవారు.
బ్రూస్లీకి చిన్నప్పట్నుంచి సైట్ సమస్య ఉంది. అప్పట్లో ఫస్ట్‌టైమ్ లెన్స్‌ని వాడిన వారిలో బ్రూస్లీ ఒకరు. బ్రూస్లీ మంచి డాన్సర్ కూడా. 'చా చా ' డాన్స్ వేసేవారు. అంతేకాదు హై స్కూల్ స్థాయిలో 'చా చా' డాన్స్ పోటీల్లో పాల్గొని బహుమతిని గెలుపొందారు. జుడో లెజెండ్ గెనె లెబెల్ వద్ద బ్రూస్లీ జూడో క్రీడను నేర్చుకున్నారు.
బాలనటుడిగా బ్రూస్లీ చాలా ఫేమస్ అయ్యారు. 18ఏండ్లు వచ్చేసరికి ఆయన ఏకంగా 20 సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించారు. మొదటిసారి కనిపించిన చిత్రం 'గోల్డెన్ గేట్ గర్ల్' అప్పటికీ బ్రూస్లీ వయసు మూడు నెలలు మాత్రమే.
బ్రూస్లీకి నీళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకే ఆయన స్విమ్మింగ్(ఈత కొట్టడం) చేసేవాడు కాదని బ్రూస్లీ సోదరీసోదరులు ఫోయిబె, రాబర్ట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
యుక్త వయస్సులో 'ది టైగర్స్ ఆఫ్ జంక్షన్ స్ట్రీట్' పేరుతో బ్రూస్లీ ఓ గ్యాంగ్‌ను మెయింటేన్ చేసేవారు.
బ్రూస్లీకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం ఎక్కువగా పుస్తకాలు చదివే వారు. ఆయన వ్యక్తిగత లైబ్రరీలో 2 వేలకు పైగా పుస్తకాలుండేవి.
బ్రూస్లీ గొప్ప కవి కూడా. కవితలు రాయడం హబీ. 'ది టయో ఆఫ్ జీట్ కునె డు' అనే పుస్తకం అప్పట్లో బాగా ప్రాచూర్యం పొందింది. అలాగే చాలా కోట్స్ కూడా రాసేవారు. అందులో 'బి ఫార్మ్లెస్, షార్ప్ లెస్ లైక్ వాటర్' బాగా ఆకట్టుకుంది.
1964లో బ్రూస్లీ రాసిన ఓ లెటర్ ముఫ్పై వేల డాలర్లు పలికింది. ఇందులో తన అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తం చేశారు. ఇదే కాదు ఆయనకు సంబంధించిన ఇతర వస్తువులు కూడా భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయాయి.
బ్రూస్లీ గొప్ప స్కెచ్ ఆర్టిస్టు కూడా. తన సినిమాలకు సంబంధించి యాక్షన్ ఎలిమెంట్స్‌ను ముందుగా స్కెచ్ వేసుకుని, వాటి ప్రకారం యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసుకునేవారు.
1962లో జరిగిన కరాటే పోటీల్లో అత్యధికంగా బ్రూస్లీ 15 పంచ్‌లు వేశారు. ఇది కేవలం 11 సెకన్లలోనే వేయడం రికార్డు. పంచ్‌లో కొత్తరకమైన టెక్నిక్స్‌ను ఫాలో అయ్యేవారు. ప్రపంచ లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీకి బ్రూస్లీ పెద్ద అభిమాని. ఆయన ఫైట్స్‌ను క్రమం తప్పకుండా చూసేవారట.
ప్రస్తుతం మార్షల్ ఆర్ట్ హీరోగా రాణిస్తున్న జాకీ చాన్ సైతం బ్రూస్లీ సినిమాలు 'ఫిస్ట్ అండ్ ఫ్యూరీ', 'ఎంటర్ ది డ్రాగన్'ల ద్వారా స్టంట్ మ్యాన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. జాకీ చాన్తోపాటు యుఎన్ బియావో, సామో హంగ్, చక్ నోరిస్, స్టీవ్ మెక్ క్వీన్, జేమ్స్ కోబర్న్, జార్జ్ లాజెన్బీ, కరీమ్ అబ్దుల్ జబార్, జోయి లెవిస్, రోమన్ పోలాన్స్కీ వంటి స్టార్స్ అంతా బ్రూస్లీ శిష్యులే.
Authorization