స్కార్లెట్ జాన్సన్.. స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్ సొంతం చేసుకున్న హాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోయిన్. అడల్ట్ క్యారెక్టర్స్‌తో కుర్రకారు మతి పోగొట్టిన ఫైర్ బ్రాండ్. నటిగానే కాకుండా గాయనిగా కూడా ప్రేక్షకుల్ని ఫిదా చేసి, అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్కార్లెట్ జాన్సన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
బాల్యం నుంచే నటనపై ఆసక్తి
అమెరికాలోని న్యూయార్క్లోగల మ్యాన్‌హట్టన్‌లో 1984, నవంబర్ 22న స్కార్లెట్ జాన్సన్ జన్మించారు. ఆమె తండ్రి కార్ట్సెన్ ఒలాఫ్ జాన్సన్. ఆర్కిటెక్ట్. తల్లి మెలానియి స్లోన్, నిర్మాత. 13ఏండ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. పాఠశాల విద్య మ్యాన్ హట్టన్‌లోని గ్రీన్ విచ్ విలేజ్‌లో పీఎస్ 41లో సాగింది. ఆ టైమ్‌లో పాటలు పాడటం, చేతులతో చేసే జాజ్ హ్యాండ్స్ డాన్స్, ట్యాప్ డాన్స్ నేర్చుకున్నారు. కెరీర్ పరంగా తన ఇష్టాలకు తల్లిదండ్రులు ప్రయారిటీ ఇచ్చారు. అయితే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక ఆమె లైఫ్ చాలా సాదాసీదాగా సాగింది. రొటీన్ లైఫ్‌తో బోర్‌గా ఫీలైన జాన్సన్ స్వతహాగా యాక్టింగ్ నేర్చుకోవడం ప్రారంభించారు. అద్దం ముందు నిల్చుని వివిధ రకాల భావోద్వేగాలను పలికిస్తూ తనకు తానుగా నటన నేర్చుకునే ప్రయత్నం చేశారు. పాపులర్ నటి జుడీ గార్లాండాలా కావాలని కలలు కన్నారు. ఏడేండ్ల వయసులోనే ఆడిషన్‌కు వెళ్ళారు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత ఎలాగైన నటి కావాలని నిర్ణయించుకున్నారు. లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. పలు కమర్షియల్ యాడ్స్ కోసం కూడా ఆడిషన్స్‌కు వెళ్ళారు. కొంత కాలానికి అది వదిలేసి పూర్తి స్థాయిలో సినిమాలు, థియేటర్స్పై దృష్టి సారించారు.
మలుపు తిప్పిన ది హార్స్ విస్పెరర్..
ఆ టైమ్‌లోనే బాలనటులకు శిక్షణ ఇచ్చే స్కూల్ ప్రొఫెషనల్ చిల్డ్రన్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అప్పటికి ఆమె వయసు 9ఏండ్లు. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా ఎట్టకేలకు ఫాంటసీ కామెడీ చిత్రం 'నార్త్'లో నటించే అవకాశం వరించింది. గుంపులో గోవింద లాంటి పాత్ర అది. 1994లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'జస్ట్ కాజ్' చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. ఏడాది తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ 'ఇఫ్ ల్యూసీ ఫెల్' చిత్రంలో ఆర్ట్ స్టూడెంట్‌గా కనిపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మాన్నీ అండ్ లో'. ఈ కామెడీ డ్రామాలోని మాన్నీ పాత్రలో నటించిన స్కార్లెట్‌కు మంచి పేరొచ్చింది. విమర్శకులు సైతం రైజింగ్ ఛార్మ్‌గా అభివర్ణించారు. అంతేకాదు ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు కూడా వరించింది. 1997లో వచ్చిన 'ఫాల్', 'హోమ్ అలోన్ 3' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన 'ది హార్స్ విస్పెరర్' చిత్రంలోని తనదైన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇప్పటి వరకు బాలనటి పాత్రలకే పరిమితమైన జాన్సన్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. విశేష ప్రశంసలతోపాటు మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఆమె జీవితంలో ఎన్నో మార్పులకు ఈ సినిమా కారణమైంది. ఆ తర్వాత ఆమెకోసం మంచి మంచి శక్తివంతమైన పాత్రలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అడల్ట్ రోల్స్ రాశారు. 1999లో 'మై బ్రదర్ ది పిగ్'లో నటించారు. ఆ తర్వాత 'ది మ్యాన్ హు వాస్ నాట్ ధేర్' చిత్రాలు చేశారు. 2001లో వచ్చిన 'ఘోస్ట్ వరల్డ్' చిత్రం జాన్సన్‌కు మరింత మంచి గుర్తింపు తెచ్చింది. 'కల్ట్' సినిమాగా అందరి ప్రశంసలందుకుంది. ఇందులోని విద్యార్థిని పాత్రకు స్కార్లెట్‌కు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. 2001లో బయోగ్రాఫికల్ చిత్రం 'యాన్ అమెరికన్ రాప్సోడీ', 2002లో హర్రర్ కామెడీ 'ఎయిట్ లెగ్గ్డ్ ఫ్రీక్స్'లోని నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. అయిన్ప్పటికీ ఈ చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ సినిమాలు చేయకూడదని, కంటెంట్ ప్రధాన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
గ్లామర్ స్టార్ ఇమేజ్..
సోఫియా కొప్పొలా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్', పీటర్ వెబ్బర్ దర్శకత్వంలో వచ్చిన 'గర్ల్ విత్ ది పెరల్ ఇయర్ రింగ్' చిత్రాల్లో అడల్ట్ పాత్రల్లో నటించారు. 2004లో ఐదు సినిమాల్లో మెరిసారు. 'ది పర్ఫెక్ట్ స్కోర్', 'ఏ లవ్ సాంగ్ ఫర్ బాబీ లాంగ్', 'ఏ గుడ్ ఉమెన్' చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మూడు చిత్రాలు దొంగతనం నేపథ్యానికి చెందినవి కావడం విశేషం. నాలుగో చిత్రం 'ది స్పాంగ్ బాబ్ స్వైర్ ప్యాంట్స్ మూవీ'. ఈ యానిమేషన్ చిత్రానికి వాయిస్ అందించారు. దీంతోపాటు 'ఇన్ గుడ్ కంపెనీ'లో నటించారు. 2005లో ప్రముఖ సెటైరికల్, కామెడీ దర్శకుడు వూడీ అలెన్ దర్శకత్వంలో తొలిసారి 'మ్యాచ్ పాయింట్' చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అదే ఏడాది సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ది ఐలాండ్'లో నటించారు. ఈ సినిమా కోసం ఆమె చాలా స్ట్రగుల్స్ పడ్డారు. గాయాల పాలయ్యారు. సినిమా మంచి ఫలితాన్నే రాబట్టుకుంది. ఈ క్రమంలో వరుసగా రొమాంటిక్ క్రైమ్ 'స్కూప్', నియో నాయిర్ క్రైమ్ థ్రిల్లర్ 'ది బ్లాక్ డలియా', లఘు చిత్రం 'వెన్ ది డీల్ గోస్డౌన్', క్రిస్టోఫర్ నోలన్ మిస్టరీ థ్రిల్లర్ 'ది ప్రిస్టిజ్', కామెడీ డ్రామా 'ది నాన్నీ డైరీస్', నటాలియో పోర్టమన్, ఎరికా బానాలతో కలిసి హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా 'ది అదర్ బోలెయిన్ గర్ల్', మరోసారి వూడీ అలెన్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'విక్కీ క్రిస్టినా బార్సెలోనా', సూపర్ హీరో చిత్రం 'ది స్పిరిట్', మరో కామెడీ డ్రామా 'హి ఈజ్ జస్ట్ నాట్ దట్ ఇన్టు యు' చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించారు. అభినయంతోనూ తన నటన ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో 'సెక్సీయెస్ట్' హీరోయిన్గా పేరుతెచ్చుకున్నారు.
స్టార్ హీరోలకు దీటుగా..
2010 నుంచి హాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు ఆమెను వరించాయి. తొలుత డ్రామా చిత్రం 'ఏ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్' జాన్సన్‌కు హాలీవుడ్లో మెయిన్ స్ట్రీమ్ కథానాయికగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత 'ఐరన్ మ్యాన్ 2'లో భాగమయ్యారు. 'వి బాట్ ఏ జూ' చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. 2012లో వచ్చిన 'ది అవెంజర్స్' చిత్రం స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బయోగ్రాఫికల్ డ్రామా 'హిచ్‌కాక్', రొమాంటిక్ కామెడీ 'డాన్జాన్', సైన్స్ ఫిక్షన్ 'అండర్ ది స్కిన్' చిత్రాలు స్కార్లెట్‌ను నటిగా మరో మెట్టు ఎక్కించాయి. 2014లో వచ్చిన 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్'తో ఆమె హాలీవుడ్లో మోస్ట్ క్రేజీ స్టార్‌గా ఎదిగారు. 'ఛెఫ్', 'ల్యూసీ', 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్', 'హైయిల్ సీజర్', 'కెప్టెన్ అమెరికా : సివిల్ వార్', 'ఘోస్ట్ ఇన్ ది షెల్', 'రఫ్ నైట్', 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' చిత్రాలు స్కార్లెట్ జాన్సన్‌ను హాలీవుడ్లో తిరుగులేని నటిని చేశాయి. ఆయా చిత్రాలతో ఆమె విశేష అభిమానగణాన్ని ఏర్పర్చుకున్నారు. స్టార్ హీరోలకు దీటుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగానూ నిలిచారు. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
బుల్లితెర ప్రేక్షకులూ మంత్రముగ్దులైపోయారు..
స్కార్లెట్ 'ది క్లైంట్', 'అనాటోమీ ఆఫ్ ఏ సీన్', 'ఎంటరేజ్', 'రోబోట్ చికెన్', 'సాటర్డే నైట్ లైవ్', 'హిట్ రికార్డ్ ఆన్ టీవీ' వంటి సిరీస్‌లలో నటించి బుల్లితెర ప్రేక్షకులనూ మెప్పించారు. 2013లో 'క్యాట్ ఆన్ ఏ హాట్ తిన్ రూఫ్' నాటకంలోనూ నటించడం విశేషం. ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో నటించి అందం, అభినయంతో, స్టయిలీష్ నటనతో మెప్పించిన స్కార్లెట్‌కు ఇప్పటి వరకు ఆస్కార్ దక్కకపోవడం గమనార్హం. 'లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్' చిత్రంలో ఉత్తమ నటిగా బ్రిటీష్ అకాడమీ అవార్డు అందుకున్నారు. 'హర్' చిత్రానికి అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ హర్రర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నారు. స్కార్లెట్ చిన్నప్పుడు పాటలు బాగా పాడేవారు. పలు షోస్‌లో పాడి ఆకట్టుకున్నారు. పలు ఆల్బమ్స్‌లో పాడటంతోపాటు నటించి కనువిందు చేశారు. హాలీవుడ్ నటీనటులు రూపొందించిన 'అన్ఎక్స్పెక్టెడ్ డ్రీమ్స్ సాంగ్స్ ఫ్రమ్ ది స్టార్స్' పాట పాడారు. కొచెల్లా ఫెస్టివల్లో 'ది జీసస్ అండ్ మేరీ చెయిన్' రాక్బ్రాండ్ టీమ్‌తో కలిసి మ్యూజికల్ షోస్ ఇచ్చారు. తొలిసారి 'ఎనీ వేర్ ఐ లే మై హెడ్' స్టూడియో ఆల్బమ్‌ను రూపొందించారు. ఇందులో పాటలు పాడటంతోపాటు నటించారు. 'ఫాలింగ్ డౌన్', 'రిలేటర్', 'బ్యాడ్ డ్రీమ్స్' మ్యూజిక్ వీడియోస్‌లోనూ మెరిశారు. దర్శకురాలిగా 'హర్రీ హర్రీ' అనే మ్యూజిక్ వీడియోనూ రూపొందించారు. జాన్సన్ కెనడియన్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్‌ను 2008లో పెళ్ళి చేసుకుని 2011లో విడాకులు తీసుకున్నారు. 2012 తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అధినేత ఫ్రెంచ్‌మ్యాన్ రోమన్ డారియక్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు రోజ్ డోరాతీ జన్మించింది. 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె టీవీ హోస్ట్ కోలిన్ జోస్ట్తో అనుబంధం కొనసాగిస్తున్నారు. 2011లో ఫోన్ హ్యాక్‌కి గురై తన న్యూడ్ ఫొటోలు ఆన్లైన్ ప్రత్యక్షమయ్యాయి. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. తనను 'సెక్స్ సింబల్'గా వర్ణించడం పట్ల ఆమె స్పందిస్తూ అది మగవాళ్ళ ఊహా కల్పిత స్వరూపానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 2004లో ఆస్కార్ కమిటీలో భాగమయ్యారు. 2006లో ఫోర్బ్ ప్రకటించిన సెలబ్రిటీ 100లో స్థానం సంపాదించారు. 2014 నుంచి 16 వరకు అత్యధిక పారితోషికం అందుకున్న నాయికగా రాణించారు. ఈ మూడేండ్లలో ఆమె ఏకంగా 1.2 బిలియన్ల ఆదాయాన్ని సంపాదించారు. ఆదాయంలోనే కాదు, నటించిన సినిమాల పరంగానూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పలు అంతర్జాతీయ ప్రకటనలకు బ్రాండ్ అంబాసీడర్‌గా పనిచేశారు. 'ఎయిడ్స్ స్టిల్ రిక్వైర్డ్' అనే యుకెకు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్కి ఆర్థిక సాయం అందించడంతోపాటు అనేక సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చారు. రాజకీయాల్లోనూ పాల్గొన్నారు. 2004 ఎలక్షన్లలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జాన్ కెర్రీకి సపోర్ట్ చేశారు.
విలక్షణ అభినయానికి ప్రతీకలు..
అందం, అభినయం, నట విలక్షణతకు స్కార్లెట్ కేరాఫ్. తొలుత గ్లామర్ తరహా పాత్రలే చేసినా ఆ తర్వాత గ్లామర్‌కు అభినయాన్ని, కామెడీని జోడించి, బలమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి వాటిల్లో రొమాంటిక్ కామెడీ డ్రామా 'లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్' ఒకటి. గుర్తింపు కోల్పోయిన ఓ సినీ స్టార్‌కు, భర్త నిర్లక్ష్యానికి గురైన ఇల్లాలికి మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఒంటరిగా ఉన్న ఇల్లాలిగా స్కార్లెట్ నటన ప్రేక్షక హృదయాలను కదిలిస్తుంది. ఈ చిత్రంలో ఆమెను అలనాటి తార ల్యూరెన్ బాకాల్తో పోల్చారు. పీటర్ వెబ్బర్ రూపొందించిన రొమాంటిక్ డ్రామా 'గర్ల్ విత్ ఏ పెరల్ ఇయర్ రింగ్'లో గొప్ప పెయింటర్‌ను ఫిదా చేసిన సేవకురాలిగా నటించారు. సేవకురాలిగా ఆమె ఇన్నోసెంట్ నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది. తల్లి చనిపోవడంతో సిటీలో ఉన్న కూతురు పుర్సీ సొంతింటికి వస్తుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులను కలుస్తుంది. వాళ్ళిద్దరూ తాగుడుకు బానిసలై ఉంటారు. వాళ్ళతో తనకు ఏర్పడిన అనుబంధం నేపథ్యంలో రూపొందిన డ్రామా చిత్రం 'ఏ లవ్ సాంగ్ ఫర్ బాబీ లాంగ్'. ఇందులో కూతురు పుర్సీ పాత్రలో స్కార్లెట్ విలక్షణ నటన అబ్బురపరుస్తుంది. బ్రదర్ ఇన్ లా ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవితం తలక్రిందులైన కథాంశంతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన 'మ్యాచ్ పాయింట్' చిత్రంలో ప్రియురాలిగా, నటిగా జాన్సన్ అందం, అభినయంతో అలరించారు. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది ఐలాండ్' చిత్రంలో ప్రత్యర్థులను ఎదుర్కొనే మహిళగా బలమైన పాత్రలో నటించారు. ఇందులో ఆమె చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తాయి. 'స్కూప్'లో జర్నలిజమ్ స్టూడెంట్‌గా, ఓ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ వూడీ అలెన్‌తో కలిసి ఆమె పలికించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అమెరికాలో సంచలనం సృష్టించిన ఎలిజబెత్ షార్ట్ హత్యకేసు ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'ది బ్లాక్ దల్హియా' చిత్రంలో ఈ కేసును ఛేదించే డిటెక్టివ్‌కు ప్రియురాలి పాత్రలో సీరియస్ పాత్రలో మెప్పించారు. క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ 'ది ప్రిస్టీజ్' చిత్రంలో ఆస్ట్రోనాట్, మెజీషియన్‌కు లవర్‌గా, అసిస్టెంట్‌గా నటించారు. ఇందులో ఆమె నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. నియో నోయిర్ సూపర్ హీరో చిత్రం 'ది స్పిరిట్'లో సైంటిస్ట్‌గా అందం, అభినయంతో అలరించారు. తొమ్మిది మంది వ్యక్తుల లవ్, రొమాంటిక్ సమస్యలను తెలిపే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'హీ ఈజ్ జస్ట్ నాట్ దట్ ఇన్టు యు' చిత్రంలో ఓ ప్రేమికురాలిగా ఆకట్టుకున్నారు.
ఇన్నోసెంట్, కామెడీ, ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్ని రకాల కోణాల్లో ఇప్పటికీ స్కార్లెట్ ప్రేక్షకులను మైమరపిస్తూనే ఉండటం విశేషం.
Authorization