నటాలీ గ్లామర్ పాత్రలతోపాటు సాహసోపేతమైన పాత్రల్లోనూ మెప్పించి ఆకట్టుకున్నారు. సంఘర్షణ ఎదుర్కొనే మహిళగా, ఇన్నోసెంట్ అమ్మాయిగా, యువరాణిగా, వీరనారిగా.. ఇలా విభిన్న పాత్రల్లో, భిన్న నేపథ్య చిత్రాల్లో అత్యద్భుత విలక్షణ నటనను ప్రదర్శించారు. 'స్టార్‌వార్స్: ఎపిసోడ్ 1- ది ఫాంటమ్ మెనేస్'లో అద్భుత శక్తులున్న అందమైన రాణిగా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు. 'స్టార్‌వార్స్'లో భాగంగా వచ్చిన మూడు సీక్వెల్స్‌లోనూ రాణి పాత్రల్లో మెరిసి అలరించారు. కమింగ్ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'ఎనీవేర్ బట్ హియర్' చిత్రంలో ఆశనిరాశల నడుమ జీవిస్తున్న కూతురిగా నటించి మెప్పించారు. 'వేర్ ది హార్ట్స్ ఈజ్' చిత్రంలో ప్రెగెన్సీతో ఉన్న 17ఏండ్ల అమ్మాయిగా వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల్ని కంట తడిపెట్టించారు. 'క్లోజర్'లో వెయిటర్‌గా నటాలీ అందం, అభినయంతో మంత్రముగ్దుల్ని చేశారు. 'ఫ్రీ జోన్' చిత్రంలో నిశ్చితార్థం రద్దు చేసుకున్న అమ్మాయిగా, ఫాంటసీ కామెడీ చిత్రం 'మిస్టర్ మగోరియమ్స్ వండర్ ఎంపోరియమ్'లో ఎంపోరియమ్ ఉద్యోగినిగా కామెడీ పాత్రలో నటించి మెప్పించారు.
'ది అదర్ ఉమెన్' చిత్రంలో తల్లిగా విభిన్న భావోద్వేగాలను పలికించి అద్భుత నటనకు కేరాఫ్‌గా నిలిచారు. ఓ కమిటెడ్ డాన్సర్ ప్రతిష్టాత్మక 'స్వాన్లేక్' నాటకంలో లీడ్ రోల్లో నర్తించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. వ్యక్తిగతంగా ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నప్పటికీ చిత్తశుద్ధిగా తన పాత్రలో ఎలా జీవించిందనే కథాంశంతో థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన 'బ్లాక్స్వాన్' చిత్రంలో డాన్సర్‌గా పోర్ట్మన్ నటన తన నట విశ్వరూపానికి ప్రతీకగా నిలిచింది. రొమాంటిక్ కామెడీ 'నోస్ట్రింగ్స్ అటాచ్డ్'లో డాక్టర్‌గా మెప్పించారు.
కామెడీ ప్రధానంగా రూపొందిన 'యువర్ హైనెస్'లో వీరవనితగా నటించారు.
సూపర్ హీరో ప్రధానంగా రూపొందిన 'థోర్' చిత్రంలో సైంటిస్ట్‌గా, థోర్కి ప్రియురాలిగా అందం, సాహసంతో కూడిన పాత్రలో మెప్పించారు. బయోగ్రఫీ, హిస్టరీ డ్రామాగా తల్లీతనయుల మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందిన 'ఏ టేల్ ఆఫ్ లవ్ అండ్ డార్క్నెస్' చిత్రంలో తల్లిగా అద్భుత నటనతో మెప్పించారు. అంతేకాదు దర్శకురాలిగా తన దర్శకత్వ ప్రతిభనూ చాటుకున్నారు.
వెస్టర్న్ యాక్షన్ చిత్రం 'జానె గాట్ ఏ గన్' చిత్రంలో కౌబారు తరహా పాత్రలో ఆకట్టుకున్నారు. అమెరికన్ బుక్ ఎడిటర్,రైటర్, సామాజిక కార్యకర్త జాకీ కెన్నెడీ జీవితం ఆధారంగా రూపొందిన 'జాకీ' చిత్రంలో జాకీ పాత్రలో నటించి మెప్పించారు. దెయ్యాల్లో సూపర్‌నేచురల్ పవర్స్ ఉంటాయని నమ్మే ఇద్దరు అమాయకమైన అమెరికన్ సిస్టర్స్ జర్నీని తెలిపే 'ప్లానెటేరియమ్'లో
అమెరికన్ సోదరిగా మెప్పించారు. ప్రయోగాత్మక రొమాంటిక్ డ్రామా
'సాంగ్ టు సాంగ్' చిత్రంలో ప్రియురాలిగా విభిన్న పాత్రలో నటించారు.
సైన్స్ ఫిక్షన్ హర్రర్ చిత్రం 'అన్నిహిలేషన్'లో బయోలజీ ప్రొఫెసర్‌గా,
మాజీ సైనికురాలిగా నటించి నటాలీ ప్రేక్షకుల్ని ఫిదా చేశారు.
Authorization