బ్రాడ్ పిట్ ..
ప్రేక్షకులు మెచ్చిన స్టయిలీష్ క్రేజీ స్టార్ హీరో.
భిన్న, వైవిధ్యమైన, ప్రయోగాత్మక
చిత్రాలకు, పాత్రలకు చిరునామా.
హాలీవుడ్‌ని అత్యంత ప్రభావితం
చేసిన అగ్ర కథానాయకుడు.
విలక్షణ నటుడిగానే కాకుండా నవ్య చిత్రాల నిర్మాణంతో అందరినీ మెప్పించిన అభిరుచిగల నిర్మాత. అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగానే కాకుండా పలు
సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన
బ్రాడ్ పిట్ గురించి ఈ వారం
అందిస్తున్న స్పెషల్ షో..
చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా నటించారు.
రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో బయోగ్రాఫికల్ వార్ డ్రామాగా రూపొందిన 'సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్' చిత్రంలో అమెరికన్ పర్వత అధిరోహకుడిగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో టిబెట్ కోసం పోరాడే వ్యక్తిగా నటించి ఆకట్టుకున్నారు. ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కిన 'ఫైట్ క్లబ్' చిత్రంలో సోప్స్ సేల్స్‌మెన్‌గా, కామెడీ చిత్రం 'ది మెక్సికన్'లో నేరస్థుడిగా, 'స్పై గేమ్'లో సీఐఏ ఏజెంట్‌గా మెప్పించారు. క్రైమ్ చిత్రం 'ఓసియన్స్ ఎలెవన్', 'టెల్వ్', 'థర్టీన్' చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా మెస్మరైజ్ చేశారు.
ఎపిక్ పీరియడ్ వార్ చిత్రం 'ట్రారు'లో గొప్ప యుద్ధ వీరుడిగా అబ్బురపరిచారు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్'లో కంస్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, నాటకీయంగా తెరకెక్కిన 'బాబెల్'లో స్ట్రగుల్స్‌లో ఉన్న ప్రేమికుడిగా, ప్రయోగాత్మక ఎపిక్ డ్రామా 'ది ట్రీ ఆఫ్ లైఫ్'లో సంఘర్షణ పడే భర్తగా, స్పోర్ట్ బేస్డ్ చిత్రం 'మనీబాల్'లో ఓక్లాండ్ అథ్లెటిక్ జనరల్ మేనేజర్‌గా, క్రైమ్ థ్రిల్లర్ 'ది కౌన్సెలర్'లో బిజినెస్ మ్యాన్‌గా, వార్ ప్రధాన చిత్రం 'ఫ్యూరీ'లో కమాండర్‌గా, యుద్ధ వీరుడిగా, మార్టిన్ స్కోర్సెస్ రూపొందించిన 'ది ఆడిషన్' చిత్రంలో తన పాత్రలోనే నటించారు. రొమాంటిక్ డ్రామా 'బై ది సీ' చిత్రంలో భర్తగా, రైటర్‌గా, బయోగ్రాఫికల్ కామెడీ 'ది బిగ్ షార్ట్'లో రిటైర్డ్ ఫార్మర్ ట్రేడర్‌గా మెప్పించారు. వార్ ప్రధానంగా రూపొందిన 'అలైడ్' చిత్రంలో కెనడియన్ ఇంటలిజెంట్ ఆఫీసర్‌గా, సెటైరికల్ వార్ చిత్రం 'వార్ మెషిన్'లో ఆర్మీ జనరల్‌గా ఆలరించారు. ఇలా వైవిధ్యభరిత, భిన్న పాత్రలతో వెండితెరపై విశ్వరూపం చూపించి ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
గుర్తింపు లేని పాత్రలతో కెరీర్ ప్రారంభం..
అమెరికాలోని ఒక్లామాలో షానీ పట్టణంలో 1963, డిసెంబర్ 18న విలియమ్ అల్విన్ పిట్, జానె ఎట్టాలకు బ్రాడ్ పిట్ జన్మించారు. చిన్నతనం నుంచి క్రీడల్లో చురుకుగా పాల్గొనేవారు. స్విమ్మింగ్, టెన్నిస్, గోల్ఫ్ వంటి ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ మిస్కోరి నుంచి అడ్వర్టైజింగ్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. సినిమాలపై ఇష్టం కలగడంతో పలు ఉద్యోగాలు చేస్తూ నటుడు, యాక్టింగ్ టీచర్ రారు లాండన్ దగ్గర నటనలో శిక్షణ పొందుతూనే అవకాశాల కోసం ప్రయత్నాలు సాగించారు. 1987లో 'నో వే ఔట్' చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అంతగా గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత వరుసగా 'నో మ్యాన్స్ ల్యాండ్', 'లెస్ దెన్ జీరో' చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాల్లో తన పాత్రలన్నీ అలా వచ్చి, ఇలా పోయేవే. దీంతో ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో టెలివిజన్ వైపు అడుగులు వేశారు. ఎన్బీసీలో ప్రసారమయ్యే 'అనదర్ వరల్డ్'లో నటించే ఛాన్స్‌ను దక్కించుకున్నారు. దీంతోపాటు ఏబీసీ ఛానెల్లో ప్రసారమయ్యే 'గ్రోవింగ్ పెయిన్స్'లో అతిథి పాత్రలో మెరిశారు. అలాగే సీబీఎస్‌లో వచ్చే 'డల్లాస్'లో నాలుగు ఎపిసోడ్స్‌లో నటించారు.
అపజయాలతో ప్రశ్నార్థకంగా మారిన కెరీర్..
బ్రాడ్ పిట్ కెరీర్లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ మెయిన్ హీరోగా నటించడానికి ఏడాది సమయమే పట్టింది. 1988లో '21 జంప్ స్ట్రీట్'లో గెస్ట్ రోల్లో నటించారు. అదే సంవత్సరం వచ్చిన 'ది డార్క్ సైడ్ ఆఫ్ ది సన్'లో లీడ్ రోల్లో నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే క్రోటియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కారణంగా దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఈ సినిమా విడుదలైంది. 1989లో 'హ్యాపీ టుగెదర్', 'కట్టింగ్ క్లాస్'లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. 1991లో 'ఎక్రాస్ ది ట్రాక్స్'లో అతిథి పాత్రలో, లో బడ్జెట్ చిత్రాలు 'థెల్మా అండ్ లూయిస్', 'జానీ సుయిడ్'లో మెయిన్ రోల్లో మెప్పించారు. నెక్ట్స్ ఇయర్ 'కూల్ వరల్డ్'లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత నటించిన 'ఏ రివర్ రన్స్ త్రూ ఇట్', 'కాలిఫోర్నియా', 'ట్రూ రొమాన్స్' చిత్రాలు సైతం నిరాశ పరిచాయి. దీంతో బ్రాడ్ పిట్ కెరీర్ ప్రశ్నార్థకంగానూ మారింది.
వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్స్..
1994లో ట్రామ్ క్రూజ్‌తో కలిసి నటించిన 'ఇంటర్య్వూ విత్ ది వాంపైర్' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రాడ్ కెరీర్లో తొలి హిట్‌గా నిలిచింది. అంతేకాదు బ్రాడ్ కెరీర్‌కి మంచి బ్రేక్‌నిచ్చింది. అదే ఏడాది వచ్చిన హిస్టారికల్ డ్రామా 'లెజెండ్స్ ఆఫ్ ది ఫాల్' సైతం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.. దీనిలోని నటనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు బ్రాడ్ నామినేట్ అయ్యారు. 1995లో మోర్గన్ ఫ్రీమన్తో కలిసి మరో బ్లాక్ బస్టర్ 'సెవెన్' చిత్రంలో నటించారు. ఇదే ఏడాది సైన్స్ ఫిక్షన్ చిత్రం '12 మంకీస్' సైతం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్స్ సాధించడంతో హాలీవుడ్లో మోస్ట్ క్రేజియస్ట్ హీరో అయిపోయారు. '12 మంకీస్' చిత్రానికిగానూ ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ 'స్లీపర్స్', 'ది డెవిల్స్ ఓన్', 'సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్', 1998లో వచ్చిన రొమాంటిక్ ఫాంటసీ 'మీట్ జోయి బ్లాక్', ఆ తర్వాత వచ్చిన 'ఫైట్ క్లబ్' చిత్రాలు సైతం విశేష ఆదరణ పొందాయి. బాక్సింగ్ ప్రధానంగా రూపొందిన 'ఫైట్ క్లబ్' చిత్రంలోని నటనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రశంసలు దక్కాయి. 2000లో విడుదలైన 'స్నాచ్', 'ది మెక్సికన్', 'స్పై గేమ్' చిత్రాలూ మంచి విజయాలు సాధించాయి.
అగ్రస్థాయి నటుడిగా నిలబెట్టిన విజయ పరంపర..
2001లో ఆయన నటించిన 'ఓసియన్స్ ఎలవెన్' బ్రాడ్‌కు మరో బ్రేక్ అనే చెప్పాలి. 2004లో వచ్చిన 'ట్రారు', 'ఓసియన్స్ టెల్వ్', 2005లో వచ్చిన 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. అగ్రకథానాయకుడిగా అత్యధిక పారితోషికం అందుకున్నారు. 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్'లో తన ప్రియురాలు ఏంజిలినా జోలీతో కలిసి నటించడం విశేషం. వీరి జోడీకి విశేష ప్రశంసలు దక్కాయి. 2005లో ఇది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 2006లో కేట్ బ్లాంచెట్‌తో కలిసి అలెజాండ్రో ఇనార్రిటు రూపొందించిన 'బాబెల్'లో నటించారు. రొటీన్‌కి భిన్నంగా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల పంథాను మార్చి చేసిన ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సత్తా చాటింది. ఇందులో తన నటనకుగానూ గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయ్యారు. 'ఓసియన్' చిత్ర సిరీస్‌లో భాగంగా వచ్చిన రెండో సీక్వెల్ 'ఓసియన్స్ థర్టీన్' కూడా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే ఏడాది వెస్టర్న్ డ్రామా 'అస్సాస్సినేషన్ ఆఫ్ జెస్సె జేమ్స్ బై ది కోవార్డ్ రాబర్డ్ ఫోర్డ్' చిత్రం తనకు డిఫరెంట్ ఇమేజ్ను తీసుకొచ్చింది. వరుసగా 2008లో 'బర్న్ ఆఫ్టర్ రీడింగ్', 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బట్టన్', 'ఇన్గ్లూరియస్ బాస్టర్డ్స్', 'ది ట్రీ ఆఫ్ లైఫ్', 'మనీబాల్', 'కిల్లింగ్ థెమ్ సాఫ్ట్లీ', 'వరల్డ్ వార్ జెడ్', '12 ఇయర్స్ ఏ స్లేవ్', 'ది కౌన్సెలర్', 'ఫ్యూరీ', 2015లో 'ది ఆడిషన్', 'బై ది సీ', 'ది బిగ్ షార్ట్', 2016లో 'వోయేజ్ ఆఫ్ టైమ్', 'అలియడ్', 2017లో 'వార్ మెషిన్', 'అడ్ అస్ట్రా' వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించారు. ఇందులో 'ది ట్రీ ఆఫ్ లైఫ్', 'కిల్లింగ్ దెమ్ సాఫ్ట్లీ', '12 ఇయర్స్ ఏ స్లేవ్', 'ఫ్యూరీ', 'వోయేజ్ ఆఫ్ టైమ్' చిత్రాలు నటుడిగా బ్రాడ్ పిట్‌కు అంతర్జాతీయంగా గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు తన సినీ కెరీర్లో 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ డేంజరస్ మైండ్'లో గెస్ట్ రోల్లో, 'సిన్బాడ్: లెజెండ్ ఆఫ్ ది సెవెన్ సీస్' యానిమేషన్ చిత్రానికి, 'మెగామైండ్', 'హ్యాపీఫీట్ టూ' చిత్రాలకు వాయిస్‌ను అందించారు. ప్రస్తుతం 'ది జిబ్ జెఫరీస్' షోలో నటిస్తున్నారు.
నిర్మాతగా తొలి సినిమాతోనే సక్సెస్..
నటనతోపాటు నవ్యమైన సినిమాలను ప్రోత్సహించడం బ్రాడ్ పిట్‌కి ప్యాషన్. అందుకే నిర్మాణం వైపు అడుగులు వేశారు. 2006లో 'గాడ్ గ్రూ టైర్డ్ ఆఫ్ అజ్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అదే ఏడాది ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ కంపెనీని స్థాపించి తొలి ప్రయత్నంగా 'ది డిపార్టెడ్' చిత్రాన్ని నిర్మించారు. దీనికి బ్రాడ్ గ్రే, గ్రాహమ్ కింగ్ ఇతర నిర్మాతలు. క్రైమ్ డ్రామాగా మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. నిర్మాతగా తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యారు. ఈ సినిమా ఉత్తమ చిత్రంతోపాటు మరో మూడు విభాగాల్లో ఆస్కార్‌ను అందుకుంది. అదే ఏడాది 'రన్నింగ్ విత్ సీజర్స్' చిత్రాన్ని నిర్మించారు. 'ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్', 'ది ప్రైవేట్ లైవ్స్ ఆఫ్ పిప్పా లీ', 'ఫ్యూరీ', 'సెల్మా', 'మూన్ లైట్', 'ఒక్జా' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'కిక్-యాస్', 'ఈట్ ప్రే లవ్', 'ది ట్రీ ఆఫ్ లైఫ్', 'మానీబాల్', 'కిల్లింగ్ దెమ్ సాఫ్ట్లీ', 'వరల్డ్ వార్ జెడ్', 'కిక్-యాస్ 2', '12 ఇయర్స్ ఏ స్లేవ్', 'ట్రూ స్టోరీ', 'బై ది సీ', 'హిట్టింగ్ ది అపెక్స్', 'ది బిగ్ షార్ట్', 'ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్', 'వార్ మెషిన్', 'బ్రాడ్స్ స్టేటస్', 'బ్యూటిఫుల్ బారు' చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం 'వైస్', 'అడ్ అస్ట్రా', 'ది కింగ్'తోపాటు మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రియల్ లైఫ్‌లోనూ రొమాంటిక్ హీరో..
రాబిన్ గివెన్స్, జిల్ ష్కోలెన్, జులియెట్టె లెవిస్, గైనెత్ పాల్ట్రో వంటి తదితర కథానాయికలతో రిలేషన్షిప్ కొనసాగించి రియల్ లైఫ్‌లోనూ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. అలాగే జెన్నీఫర్ అనిస్టోన్ను ప్రేమించి, పెళ్ళి చేసుకుని 2005లో విడిపోయారు. ఆ తర్వాత 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' టైమ్‌లో ఏంజెలినా జోలీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొన్ని రోజులు సహజీవనం చేశారు. 2014లో పెళ్ళి చేసుకుని, 2016లో విడిపోయారు. పిట్‌కు ఆరుగురు పిల్లలున్నారు. వీరితోపాటు మరో ముగ్గురుని దత్తత తీసుకున్నారు.
స్ఫూర్తిదాయక సమాజ సేవకుడు..
మూల కణం పరిశోధనపై అవగాహన కల్పించడంతోపాటు దానికి ఫండింగ్ చేశారు. పేదరిక నిర్మూలనకు, ఎయిడ్స్ బాధితులకు ట్రీట్మెంట్ ఇప్పించే సంస్థ 'వన్ క్యాంపెయిన్'కు సపోర్ట్ చేశారు. ఏంజెలినా జోలితో కలిసి పేద దేశాలైన చాద్, సుడాన్లో పర్యటించి డార్ఫర్ ప్రాంతంలో చోటు చేసుకున్న సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ వంతుగా ఒక మిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. 'నాట్ ఆన్ అవర్ వాచ్' ఆర్గనైజేషన్ స్థాపించి సామూహిక అత్యాచారాలకు వ్యతిరేకంగా, వాటిని అరికట్టేందుకు పాటుపడ్డారు. పిట్ మంచి ఆర్కిటెక్చర్. పర్యావరణానికి హాని జరగకుండా నిర్మాణాలు చేపట్టాలని అవగాహన కల్పించారు. కత్రినా తుఫాను బాధితులను అదుకునే చర్యల్లో భాగంగా మేక్ ఇట్ రైట్ ఫౌండేషన్ పేరుతో 150 కొత్త ఇండ్లను తనదైన శైలిలో నిర్మించి అందించారు. అందుకుగానూ అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు అందుకున్నారు. ఏంజెలినా జోలీతో కలిసి 2006లో ఛారిటీ ఆర్గనైజేషన్‌ను స్థాపించి చిన్నపిల్లలకు ఆసుపత్రిని నిర్మించి, మిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. శరణార్థులకు ప్రతి ఏడాది భారీగా విరాళం అందిస్తున్నారు. దీంతోపాటు పిట్ సేమ్ సెక్స్ మ్యారేజ్‌లను ప్రోత్సహిస్తూ లక్ష డాలర్లు విరాళం అందించారు. బ్రాడ్ అనేక గౌరవాలు పొందడంతోపాటు అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో ఒకరిగా నిలిచారు. కమర్షియల్ హీరోగా పాపులర్ అయిన బ్రాడ్‌కు నటుడిగా ఒక్క ఆస్కార్ కూడా దక్కకపోవడం గమనార్హం. నటుడిగా '12 మంకీస్', 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బట్టన్', 'మనీబాల్' చిత్రాలకు ఆస్కార్‌కు నాటినేట్ అయ్యారు. కానీ తాను నిర్మించిన '12 ఇయర్స్ ఏ స్లేవ్' చిత్రానికి నిర్మాతగా ఆస్కార్ అందుకున్నారు. నిర్మాతగా నాలుగు అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అవార్డులు, హీరోగా ఒక బ్రిటీష్ అకాడమీ పురస్కారం, రెండు గోల్డెన్ గ్లోబల్ అవార్డులతోపాటు మొత్తంగా 61 అవార్డులను దక్కించుకున్నారు.
వెండితెరపై నట విశ్వరూపం
బ్రాడ్ స్టయిలీష్ నటనతో యువతను బాగా ఆకట్టుకున్నారు. అలాగే విభిన్నపాత్రలతోనూ నటుడిగా అందరినీ మెప్పించారు. రోడ్ జర్నీ నేపథ్యంలో రూపొందిన 'థెల్మా అండ్ లూయిస్' చిత్రం నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో నిలకడ లేని కుర్రాడిగా, అమ్మాయిలను ఆకట్టుకునే వ్యక్తిగా నటించారు. కమింగ్ ఏజ్ పీరియడ్ డ్రామాగా 'ఏ రివర్ రన్స్ త్రూ ఇట్' చిత్రంలో ఫన్ లవింగ్ కుర్రాడిగా, టాలెంటెడ్ ఫిషర్మ్యాన్గా మెప్పించారు. నటుడిగా బ్రేక్ నిచ్చిన గోతిక్ (మోటైనా) హర్రర్ చిత్రం 'ఇంటర్య్వూ విత్ ది వాంపైర్'లో రాక్షసుడి పాత్రలో భయపెట్టారు. ఎపిక్ హిస్టారికల్ డ్రామా 'లెజెండ్ ఆఫ్ ది ఫాల్' చిత్రంలో అమెరికా, భారతీయ సంస్కృతులను ఇష్టపడే వ్యక్తిగా విభిన్న పాత్రలో మెప్పించారు. నియో నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ 'సెవెన్' చిత్రంలో టాలెంటెడ్ డిటెక్టివ్‌గా అబ్బుర పరిచారు. సైన్స్ ఫిక్షన్ చిత్రం '12మంకీస్'లో అద్భుత ఆలోచనలు కలిగిన మెంటల్ పేషెంట్‌గా మెస్మరైజ్ చేశారు. లీగల్ క్రైమ్ డ్రామా 'స్లీపర్స్'