ప్రేక్షకుల మనసులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టిన సిరీస్ సినిమాలతోపాటు పలు డిఫరెంట్ జోనర్ చిత్రాలు భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆసక్తికర నేపథ్యాలతో, అబ్బుర పరచే విజువల్ ట్రీట్‌తో, పిల్లల్ని మాయ చేసే గ్రాఫిక్ మాయాజాలంతో,యూత్‌ని ఎంటర్టైన్ చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో
ఈ ఏడాది సందడి చేయబోయే కొన్ని క్రేజీ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
అలిటా: బ్యాటిల్ ఏంజెల్
ప్రస్తుతం హాలీవుడ్లో అత్యంత క్రేజ్‌ను నెలకొన్న చిత్రం 'అలిటా: బ్యాటిల్ ఏంజెల్'. సైన్స్ ఫిక్షన్‌లోని సబ్ జోనరైన సైబర్‌పంక్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాబర్ట్ రోడ్రిగ్విజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌ, రాబర్ట్ రోడ్రిగ్విజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. తన చుట్టూ జరిగే వాస్తవాలని గ్రహించి, ప్రపంచాన్ని మార్చేందుకు చేపట్టిన జర్నీలో ఎదురైన సవాళ్లని ఓ శక్తివంతమైన మహిళ ఎలా ఎదుర్కొంది?, ఎలా పోరాడిందనే కథాంశంతో రూపొందించారు. శక్తివంతమైన అమ్మాయి అలిటా పాత్రలో రోసా సాలాజర్ నటించారు. 'టైటానిక్', 'అవతార్' వంటి చిత్రాలను నిర్మించిన సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న ప్రపంచ వాప్తంగా విడుదలవుతోంది.
కెప్టెన్ మార్వెల్
మార్వెల్ కంపెనీ నుంచి వస్తున్న మరో సూపర్ హీరో చిత్రమిది. ఈ సంస్థ నిర్మించిన 21వ చిత్రమిది. సూపర్ హీరోయిన్ ప్రధాన పాత్ర ధారిణిగా సినిమా సాగుతుంది. మార్వెల్ కామిక్స్‌లో భాగంగా వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ దర్శకత్వం వహించారు. గాలాక్సీలో రెండు ఏలియన్ ప్రపంచాల మధ్య జరిగే యుద్ధం ప్రధానంగా సాగే చిత్రమిది. భూమిపై ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టేందుకు సూపర్ హీరోయిన్ చేసే యుద్ధంలో గెలుపొంది, కెప్టెన్ మార్వెల్‌గా అవతరించడం కోసం డాన్వెర్స్ చేసే పోరాట నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. మార్వెల్ స్టూడియో రూపొందిన మొదటి ఫీమేల్ లీడ్ సూపర్ హీరో చిత్రం కావడం విశేషం. డాన్వెర్స్గా బ్రీ లార్సన్ నటించగా, సామ్యూల్ ఎల్ జాన్సన్, బెన్ మెండల్సన్, జిమన్ హౌన్సు, లీ పేస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 8న సినిమా విడుదల కానుంది.
అవెంజర్స్-4 : ఎండ్ గేమ్
భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు షాడోస్ తానోస్ బృందం ప్రయత్నిస్తుంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు సూపర్ పవర్ కలిగిన అవెంజర్స్ టీమ్ చేసే పోరాట నేపథ్యంలో 'అవెంజర్స్' చిత్రాలు రూపొందాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటికి భారీ క్రేజ్ నెలకొంది. పిల్లల నుంచి పెద్దల వరకు చూసేలా యూనివర్సల్ కాన్సెప్ట్స్‌తో ఈ సినిమాలు రూపొందుతుండటంతో
ప్రపంచ ప్రేక్షకులంతా ఈ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. మార్వెల్ కామిక్స్‌లో భాగంగా వస్తున్న 22వ చిత్రం. 'అవెంజర్స్' సిరీస్‌లో నాల్గవ చిత్రమిది. ఆంటోని రుస్సో, జోయి రుస్సో సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎప్పటిలాగే రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రుఫ్పాలో, క్రిస్ ఎవాన్స్, స్కార్లెట్ జాన్సన్, బెనెడిక్ కంబర్బ్యాచ్, డాన్ చీడ్లే, టామ్ హోలాండ్, చాడ్విక్ బోస్మాన్, సెబాస్టియన్ స్టాన్, ఎలిజబెత్ ఒల్సెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ అడ్వెంచర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 26న సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అడ్ ఆస్ట్రా
బ్రాడ్ పిట్ హీరోగా రూపొందిన భారీ చిత్రమిది. ఇరవై ఏండ్ల తర్వాత నెప్ట్యూన్ గ్రహంపైకి వెళ్లే మిషన్ నుంచి తండ్రి తప్పిపోవడంతో, రారు మెక్బ్రిడ్జ్ తన ఆర్మీ ఇంజనీర్ బ్రందంతో కలిసి సోలార్ సిస్టమ్ ద్వారా తండ్రి మిషన్ ఎలా ఫెయిల్ అయ్యింది?, ఆయన ఆచూకి ఎక్కడా అని కనిపెట్టే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమిది. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా జేమ్స్ గ్రే దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఈ ఏడాది రాబోతున్న చిత్రాల్లో ప్రధానంగా ఉంది. బ్రాడ్ పిట్, డెడె గార్డెనర్, జెరెమీ క్లీనర్, జేమ్స్ గ్రే, ఆంటోని కాటేగాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మెక్ రాబ్ బ్రిడ్జ్ పాత్రలో బ్రాడ్ పిట్ నటించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 24న రిలీజ్ కాబోతోంది.
గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్
సినిమా ఫ్రాంచైజీలో అత్యధిక సినిమాలు వచ్చిన సిరీస్ 'గాడ్జిల్లా'. ఇందులో 'గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' 35వ చిత్రం కావడం విశేషం. అంతేకాదు అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీ కూడా. 2014లో వచ్చిన 'గాడ్జిల్లా'కిది సీక్వెల్. హాలీవుడ్ స్టూడియో పూర్తి స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. 32 సినిమాలు జపనీస్ సంస్థ నిర్మించగా, మూడు సినిమాలని అమెరికన్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మించింది. ఈ చిత్రాలపై ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉంది. గాడ్జిల్లాపై మానవ పోరాటం ప్రధానంగా సినిమాలు సాగుతుంటాయి. తాజా సినిమాలో మూడు తలల రాక్షస జంతువు భూమిపై దాడికి తెగబడుతుంది. ఒకానొక సమయంలో ఆ రాక్షస జంతువు, గాడ్జిల్లా మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో సైనికులు, మనుషులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. వాటిని ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో తాజా సినిమా రూపొందింది. మైఖేల్ డౌగెర్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ మాన్స్టర్ చిత్రంలో కైలె ఛాండ్లర్, వెరా ఫార్మిగా, మిల్లీబాబీ బ్రౌన్,బ్రాడ్లీ వైట్‌ఫోర్డ్, సల్లీ హాకిన్స్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎక్స్‌మెన్: డార్క్ ఫోనిక్స్..
ఈ ఏడాది రాబోతున్న మరో విజువల్ వండర్, సూపర్ హీరో చిత్రమిది. పాపులర్ ప్రాంఛైజీ 'ఎక్స్‌మెన్' సిరీస్‌లో భాగంగా వస్తున్న 12వ చిత్రమిది. మూడేండ్ల క్రితం విడుదలైన 'ఎక్స్‌మెన్:అపోకలిప్సే'కిది సీక్వెల్. జీన్ గ్రే ఓ మిషన్ చేపడతారు. ఈ క్రమంలో ఓ మిస్టీరియస్ ఫోర్స్ ఆమెపై దాడి చేస్తుంది. చావు అంచుల వరకు వెళ్ళిన ఆమె తిరిగి తన స్థావరానికి చేరుకుంటుంది. కానీ ఆ మిస్టీరియస్ ఫోర్స్ చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుందని తెలుసుకుని అత్యంత శక్తివంతమైన ఫోనిక్స్గా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. ఈ క్రమంలో తమ ఎక్స్మెన్స్ బృందంతో కలిసి ఆమె చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సిమన్ కింబెర్గ్ దర్శకత్వంలో మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఫోనిక్స్గా సోఫియా టర్నర్ నటించగా, జెన్సీఫర్ లారెన్స్, మైఖేల్ ఫాస్బెండర్, జేమ్స్ మెక్ అవోరు, టై షెరిడన్, అలెగ్జాండ్రా షిప్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మెన్ ఇన్ బ్లాక్: ఇంటర్నేషనల్
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీగా వచ్చిన 'మెన్ ఇన్ బ్లాక్' సిరీస్ సైతం మంచి ఆదరణ పొందింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి ఆడియెన్స్‌కి కావల్సిన వినోదాన్ని పంచాయి. మరోసారి ఆకట్టుకోవడానికి నాలుగో సినిమా వస్తోంది. మెన్ఇన్ బ్లాక్ సీక్రెట్ ఏజెంట్ టీమ్ ఓ మర్డర్ మిస్టరీని చేధించడానికి ప్రపంచ వ్యాప్తంగా తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న యాక్షన్, హాస్యభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఎఫ్. గ్యారీ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రిస్ హెమ్స్‌వర్త్, టెస్సా థామ్సన్, లియామ్ నీసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 14న విడుదల కాబోతుంది.
స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్
'స్పైడర్ మ్యాన్' చిత్రాలకు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఈ సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని కొల్లగొట్టాయి. దీంతో ఈ సీక్వెల్లో వచ్చే ప్రతి సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. 'స్పైడర్‌మ్యాన్: హౌమ్ కమింగ్'కి సీక్వెల్‌గా ప్రస్తుతం 'స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్' చిత్రం రూపొందింది. మార్వెల్ సంస్థలో వస్తున్న 23వ చిత్రమిది. జాన్ వాట్స్ దర్శకత్వం వహించారు. పార్కర్(స్పైడర్‌మ్యాన్) విద్యార్థి. తన స్కూల్ ఫ్రెండ్‌తో కలిసి యూరప్ ట్రిప్ వెళ్తాడు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. గత చిత్రాల్లో నటించిన టామ్ హౌలాండ్, సామ్యూల్ ఎల్ జాక్సన్, జెండయ, కోబీ స్మల్డర్స్, జాన్ ఫావ్రియు, జె.బి.స్మూవ్, జాకోబ్ బ్యాట్లాన్, మార్టిన్ స్టార్ నటించిన ఈ చిత్రం జులై 5న విడుదల కాబోతుంది.
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
హాలీవుడ్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌పిట్‌ల సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది. వారి సినిమాల కోసం వేచి చూసే అభిమానులు చాలా మందే ఉంటారు. మరి ఈ ఇద్దరూ కలిసి నటిస్తే వారి అభిమానులకు పెద్ద పండగే. మార్గాట్ రాబీ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. ఓ ఫేడౌట్ అయిన టీవీ నటుడు, అతని స్టంట్ డూప్ జర్నీని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సక్సెస్ సాధించేందుకు ఆ నటుడు పడే స్ట్రగుల్స్, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి క్వెంటిన్ టరంటినో దర్శకత్వం వహించారు. మొదట ఈ చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ స్థానంలో సోనీ పిక్చర్స్ విడుదల హక్కులని దక్కించుకుంది. కామెడీ డ్రామాగా కమర్షియల్ అంశాల ప్రధానంగా రూపొందిన ఈ సినిమా జులై 25న విశ్వ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్ ప్రజెంట్స్: హాబ్స్ అండ్ షాస్
రేసింగ్ ప్రధానంగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూయరిస్' సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆదరణ పొందాయి. భారీ విజయాలని సాధించాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందులో భాగంగా రేస్ ప్రధాన యాక్షన్ ఎంటర్టైనర్గా ఇప్పుడు తొమ్మిదో చిత్రం రాబోతుంది. డేవిడ్ లించ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డ్వానే జాన్సన్, జాసన్ స్టథమ్ ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో వీన్ డీజిల్ ప్రధాన పాత్ర పోషించేవారు. కానీ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన గతంలోనే ప్రకటించారు. దీంతో ఆ స్థానంలోకి జాసన్ స్టథమ్ వచ్చారు. ఆగస్ట్ 12న విడుదల కానుంది.
జెమినీ మ్యాన్
దర్శకుడు ఆంగ్ లీ 'లైఫ్ ఆఫ్ పై' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం విదితమే. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం అంటే తెలియకుండానే ఓ క్యూరియాసిటీ నెలకొని ఉంటుంది. హీరోలో విల్ స్మిత్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో 'జెమినీ మ్యాన్' చిత్రం రూపొందింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఒక హంతకుడు తన వృతికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటాడు. అందుకోసం తన ముఖాన్ని మార్ఫింగ్ చేసుకుంటాడు. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4న ఆడియెన్స్‌ని అలరించడానికి రాబోతోంది.
స్టార్ వార్స్: ఎపిసోడ్ 9
'స్టార్ వార్స్' సిరీస్‌లో 'ఎపిసోడ్9' తొమ్మిదో చిత్రమిది. 'స్టార్ వార్స్ సీక్వెల్ ట్రిలోజీ'లో మూడో చిత్రమిది. గతంలో వచ్చిన రెండు చిత్రాలు 'ది ఫోర్స్ అవేకెన్స్', 'ది లాస్ జెడీ' చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో 'స్టార్ వార్స్: ఎపిసోడ్9'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'స్టార్‌వార్స్ : ది లాస్ట్ జెడీ'లో కథకి ఏడాది తర్వాత జరిగే కథ ఇది. జేజే ఆబ్రామ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇయర్ ఎండింగ్లో సందడి చేయడానికి డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. వీటితోపాటు జాన్ విక్: చాప్టర్ 3- పారాబెల్లమ్ మార్చి 17న, 'హెల్ బారు రీబూట్' ఏప్రిల్ 12న, 'ఇట్ ఛాప్టర్ టు' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.