కథానాయికగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం '1001 నైట్స్'. రాజుకు భార్యగా శృంగార భరిత పాత్రలో ఆకట్టుకున్నారు. హిస్టారికల్ అడ్వెంచరస్ చిత్రం 'క్రిస్టోఫర్ కోలంబస్: ది డిస్కవరీ'లో బెల్లీడాన్సర్గా, కామెడీ ప్రధానంగా రూపొందిన 'స్ల్పీట్టింగ్ హీర్స్'లో హాస్యభరిత పాత్రలో, 'బ్లూ జూస్'లో లవర్‌గా అలరించారు. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 'ది ఫాంటమ్' చిత్రంలో నటించారు. ఇందులో ఆమె విలన్ పాత్రధారి కూతురిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మైమరపించారు. యాక్షన్ జోనర్లో సబ్ జోనర్ అయిన స్వాష్‌బక్లర్ నేపథ్యంలో రూపొందిన 'ది మాస్క్ ఆఫ్ జోర్రో' చిత్రంలో యుద్ధ వీరుడి తప్పిపోయిన కూతురిగా, వీర నారిగా ఆకట్టుకున్నారు. దొంగతనం నేపథ్యంలో రూపొందిన 'ఎంట్రాప్మెంట్' చిత్రంలో ఇన్వెస్టిగేటివ్గా శక్తివంతమైన పాత్రలో తన అందంతో మంత్రముగ్ధుల్ని చేశారు. సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం 'ది హంటింగ్'లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా విభిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నారు. కామెడీ డ్రామా 'హై ఫెడెలిటీ' చిత్రంలో రొమాంటిక్ పాత్రలో మెస్మరైజ్ చేశారు. అక్రమ డ్రగ్ డీలింగ్, ఇందులో అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ప్రధానంగా రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ 'ట్రాఫిక్'లో డ్రగ్ లార్డ్, చీకటి సామ్రాజ్యానికి అధిపతి భార్యగా, భర్త అరెస్ట్ అయితే ఆయన కోసం పోరాడే ప్రెగెంట్ ఉమెన్ పాత్రలో విలక్షణ నటనని కనబరిచి మెస్మరైజ్ చేశారు. రొమాంటిక్ కామెడీగా వచ్చిన 'అమెరికన్ స్వీట్ హార్ట్స్'లో సినీ స్టార్‌గా కనువిందు చేశారు. సెలబ్రిటీల తెరవెనుక జీవితాలు, అవినీతి, వేధింపులు ప్రధానంగా రూపొందిన మ్యూజికల్ క్రైమ్ కామెడీ డ్రామా 'చికాగో'లో నైట్ క్లబ్ డాన్సర్‌గా అందం, అభినయం, విలక్షణ నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. బ్లాక్ కామెడీ ప్రధానంగా రూపొందిన 'ఇంటోలెరబుల్ క్రూయాల్టీ'లో డబ్బు కోసం వరుసగా విడాకులు తీసుకునే మహిళగా, ప్లే గర్ల్ తరహా పాత్రలో అలరించారు. స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన కామెడీ డ్రామా 'ది టెర్మినల్'లో అభద్రతా భావంతో బతికే ఎయిర్ హోస్టెస్‌గా ఇన్నోసెంట్ పాత్రలో మెప్పించారు. దొంగతనం నేపథ్యంలో 'ఓసియన్ ఎలెవన్'కి సీక్వెల్‌గా వచ్చిన 'ఓసియన్ ట్వెల్వ్'లో యూరప్ ఏజెంట్‌గా, బ్రాడ్ పిట్ లవర్‌గా కనువిందు చేశారు. యాక్షన్ ప్రధానంగా 'ది మాస్క్ ఆఫ్ జోర్రో' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ది లెజెండ్ ఆఫ్ జోర్రో' చిత్రంలో పెళ్ళి జీవితంతో స్ట్రగుల్ పడుతున్న మహిళగా ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. రొమాంటిక్ కామెడీ 'నో రిజర్వేషన్స్'లో స్ట్రగుల్స్ పడే చెఫ్ పాత్రలో ఆద్యంతం నవ్వించారు. పాపులర్ స్టంట్ మన్ హర్రీ హౌడిని బయోపిక్‌గా రూపొందిన 'డెత్ డెఫైంగ్ యాక్ట్స్'లో సైకిక్ పవర్ కలిగిన కాన్ ఆర్టిస్ట్‌గా అలరించారు. రొమాంటిక్ కామెడీగా వచ్చిన 'ది రీబౌండ్'లో స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా, ఓ భార్యగా, తల్లిగా మెప్పించారు. కామెడీ డ్రామా 'లే ది ఫేవరేట్'లో స్పోర్ట్స్ గాంబ్లర్కి చెందిన జెలసీ భార్యగా, ఫ్రీ స్పిరిట్ ఉమెన్‌గా బలమైన పాత్రలో మెస్మరైజ్ చేశారు. మ్యూజికల్ కామెడీ డ్రామా 'రాక్ ఆఫ్ ఏజెస్'లో క్లబ్హోనర్గా, సంప్రదాయాలకు పెద్ద పీఠ వేసే భార్యగా, రొమాంటిక్ కామెడీ 'ప్లేయింగ్ ఫర్ కీప్స్', క్రైమ్ థ్రిల్లర్ 'బ్రోకెన్ సిటీ'లో కీలక పాత్రల్లో మెప్పించారు. సైకలాజికల్ థ్రిల్లర్ 'సైడ్ ఎఫెక్ట్స్'లో సైకియాట్రిస్ట్‌గా, యాక్షన్ కామెడీ 'రెడ్ 2'లో సీక్రెట్ ఏజెంట్‌గా, బ్రిటీష్ వార్ కామెడీ 'డాడ్స్ ఆర్మీ'లో గ్లామరస్ జర్నలిస్ట్‌గా మంత్రముగ్ధుల్ని చేశారు.
Authorization