విల్ స్మిత్ అంటే హాస్యభరిత పాత్రలే గుర్తొస్తాయి. యాక్షన్ సినిమాల్లోనూ తనదైన నటనతో హాస్యం పండించడం ఆయన ప్రత్యేకత. దీంతో అతి తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం 'బ్యాడ్ బాయ్స్'లో దొంగతనానికి గురైన భారీ హెరాయిన్‌ని కనిపెట్టేందుకు పోరాడే డిటెక్టివ్‌గా నటించారు. యాక్షన్ క్రైమ్ కామెడీగా రూపొందిన ఇందులో విల్ స్మిత్ నటన కడుపుబ్బ నవ్విస్తుంది.
భూమిని నాశనం చేయడానికి ఏలియన్ సూపర్‌పవర్ వస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి టెక్నికల్ బృందం చేసే ప్రయత్నం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచరస్‌గా వచ్చిన 'ఇడిపెండెన్స్ డే' చిత్రంలో ఆర్మీ కెప్టెన్ పాత్రలో అద్భుతమైన యాక్షన్‌తో మైమరపించారు. వివిధ నెగటివ్ పవర్స్ నుంచి భూమిని కాపాడేండుకు ఇద్దరు సీక్రెట్ ఏజెంట్స్ చేసే యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన 'మెన్ ఇన్ బ్లాక్'లో సీక్రెట్ ఏజెంట్‌గా సీరియస్ నటనతో మెప్పించారు. ఓ నాయకుడి హత్య కేసుని చేధించే కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్‌గా టోనీ స్కాట్ దర్శకత్వంలో రూపొందిన 'ఎనిమీ ఆఫ్ ది స్టేట్'లో లాయర్‌గా డిఫరెంట్ రోల్లో అలరించారు.
'వైల్డ్ వైల్డ్ వెస్ట్'లో సీక్రెట్ ఏజెంట్‌గా, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'ది లెజెండ్ ఆఫ్ బ్యాగ్గర్ వాన్స్'లో గైడ్‌గా మెప్పించారు. ప్రముఖ ఛాంపియన్ బాక్సర్ మహ్మద్ అలీ జీవితం ఆధారంగా రూపొందించిన బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా 'అలీ'లో టైటిల్ రోల్ పోషించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. 'మెన్ ఇన్ బ్లాక్ 2'లోనూ సీక్రెట్ ఏజెంట్‌గానే అలరించారు. 'బ్యాడ్ బార్సు 2'లో నార్కోటిక్ పోలీస్‌గా యాక్షన్ భరిత పాత్రలో ఆకట్టుకున్నారు. 'ఐ రోబోట్'లో చికాగో పోలీస్ డిటెక్టివ్‌గా మరోసారి అలరించారు. 'హిచ్'లో ప్రొఫేషనల్ డేట్ డాక్టర్ పాత్రలో విభిన్న తరహా నటనతో మైమరపించారు. 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్'లో సేల్స్‌మెన్‌గా, కుమారుడి కోసం తప్పించే తండ్రి భావోద్వేగభరిత పాత్రలో విల్ స్మిత్ నటన అబ్బురపరుస్తుంది. హృదయాన్ని కలచివేస్తుంది.'ఐ యామ్ లెజెండ్'లో మాజీ యుఎస్ ఆర్మీ మెడికల్ డాక్టర్‌గా, సైంటిస్ట్‌గా నటించారు. 'హాంకాక్'లో మద్యానికి బానిసైన సూపర్ పవర్స్ కలిగిన సూపర్ హీరో పాత్రలో ఆద్యంతం నవ్వించారు. 'మెన్ ఇన్ బ్లాక్'కి రెండో సీక్వెల్ 'మెన్ ఇన్ బ్లాక్ 3'లో మరోసారి ఏజెంట్‌గా యాక్షన్‌తో అదరగొట్టి, కామెడీతో నవ్వించారు. 'ఆఫ్టర్ ఎర్త్'లో శాంతిని కోరే ఆర్గనైజేషన్ కమాండెడ్ పాత్రలో ఆకట్టుకున్నారు. 'ఫోకస్'లో రొమాంటిక్ పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు.
బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా 'కాన్కాషన్'లో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌గా నటించారు. సూపర్ హీరో సినిమా 'సూసైడ్ స్వ్కాడ్'లో హంతకుడిగా ఆకట్టుకున్నారు. తన లైఫ్‌లో చోటు చేసుకున్న ట్రాజెడీ తర్వాత ఓ వ్యక్తి ప్రేమ గురించి, టైమ్, డెత్ గురించి కవితలు రాసే కథాంశంతో రొమాంటిక్ డ్రామాగా వచ్చిన 'కొల్లేటరల్ బ్యూటీ'లో అడ్వటైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, కథలు రాసే వ్యక్తిగా విషాదభరితమైన పాత్రలో మైమరపించారు. ప్రస్తుతం విజువల్ వండర్‌గా రూపొందుతున్న 'అలాద్దీన్'లో హీరోని గైడ్ చేసే మాయా జీనీ పాత్రలో నటిస్తున్నారు. ఇది ఈనెల 24న విడుదల కానుంది.
Authorization