ఈ వేడుకలో మొదటిసారి ఓ నల్లజాతీయురాలు, ఫ్రెంచ్ నటి, దర్శకురాలు మటిడియోప్ రూపొందించిన 'అట్లాంటిక్స్' చిత్రం ఎంపిక కావడం, అది గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు ఓ సౌత్ కొరియన్ దర్శకుడు బాంగ్ జూన్ హో కేన్స్‌లో అవార్డు గెలవడం ఇదే మొదటిసారి. అలాగే ఆసియాలోనే ఆయన రెండో దర్శకుడు. ఆయన రూపొందించిన 'పారాసైట్' గోల్డెన్ పామ్ అవార్డునందుకున్న విషయం విదితమే. అవార్డు పొందిన సందర్భంగా బాంగ్ మాట్లాడుతూ, 'ఈ ఏడాదితో సౌత్ కొరియన్ సినీ పరిశ్రమ వందేండ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా సౌత్ కొరియన్ సినిమాకి కేన్స్ గొప్ప బహుమతినిచ్చింది. మా సినిమాని ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు' అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక 'లిటిల్ జోయి' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అందుకున్న ఎమిలీ బీచమ్ ఉత్తమ నటి కేటగిరిలో బ్రిటీష్ నుంచి అవార్డు పొందిన మొదటి నటిగా నిలిచారు. అవార్డు పొందిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంది. 'ఆనందంతో మునిగిపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రేపు ఉదయం నాకు ఓ ప్రయోగాత్మకమైన, కొత్త రోజు. నా శక్తిసామర్థ్యాల(అవార్డు)ను నేను మా దేశానికి మోసుకుపోవాలి' అని అన్నారు. ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న ఆంటోనియో బండెరాస్ మాట్లాడుతూ, 'నాతో ఏడు సినిమాలు చేసిన, ఇందులో మంచి పాత్ర ఇచ్చి బాగా నటించేలా చేసిన దర్శకుడు ఆల్బోడోవర్కి థ్యాంక్స్' అని చెప్పారు. మరో మహిళా దర్శకురాలు సెలైన్ సైమ్మా స్క్రీన్‌ప్లే విభాగంలో 'పాట్రాయిట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్' చిత్రానికిగానూ అవార్డు దక్కించుకోవడం విశేషం.