ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 72వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సౌత్ కొరియాకు చెందిన డ్రామా చిత్రం 'పారాసైట్' గోల్డెన్ ఫామ్ (పాల్మె డి ఓర్) అవార్డునందుకుంది. బ్రాడ్పీట్, లియోనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్స్ నటించిన 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', స్పెయిన్ చిత్రం 'పెయిన్ అండ్ గ్లోరీ', ఓపెనింగ్ చిత్రం 'ది డెడ్ డోంన్ట్ డై' వంటి ప్రముఖ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ 'పారాసైట్' కేన్స్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మరో ప్రముఖ గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని ఫ్రాన్స్, సెనెగల్, బెల్జియం చిత్రం 'అట్లాంటిక్స్' అందుకుంది. బెల్జియం సినిమా 'ది యంగ్ అహ్మద్'కిగానూ జీన్ పీర్రె డార్డెన్నె, లూస్ డార్డెన్నె సంయుక్తంగా ఉత్తమ దర్శకుడి అవార్డుని పొందారు. 'పెయిన్ అండ్ గ్లోరీ' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఆంటోనియో బండెరాస్, 'లిటిల్ జోయి' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎమిలీ బీచమ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుని 'లెస్ మిసేరబుల్', 'బాకురా' చిత్రాలు పంచుకున్నాయి.
మెయిన్ కాంపిటీషన్ విభాగంలో ప్రముఖ మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో గెంజాలెజ్ ఇనర్రిటు అధ్యక్షతన ఎంపికపై జ్యూరీ ప్రధాన అవార్డులను ప్రకటించారు. ఈ నెల 14న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక ఈ నెల 25లో ముగిసాయి. 12 రోజుల పాటు అనేక విశేషాలతో, ప్రపంచ తారల సందడితో కేన్స్ వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. మన దేశం నుంచి బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ఐశ్వర్యరారు, సోనమ్ కపూర్, హ్యూమా ఖురేషి, మల్లికా షెరావత్, హీనా ఖాన్, డయానా పెంటీ వంటి నాయికలు రెడ్ కార్పెట్‌పై హల్చల్ చేసిన విషయం విదితమే. టీవీ నటి హీనా ఖాన్కిది కేన్స్‌లో తొలి సారి కావడం విశేషం.
సత్తా చాటని హాలీవుడ్ సినిమాలు
ప్రముఖంగా చెప్పుకునే చిత్రాలకు కేన్స్‌లో నిరాశే ఎదురైంది. బ్రాడ్పీట్, లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రల్లో క్వాంటికో టొరంటినో దర్శకత్వంలో రూపొందిన 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రం ప్రీమియర్ సందర్భంగా చూసిన ప్రతినిధులంతా దాదాపు ఆరు నిమిషాలపాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. కానీ ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకునే ఏ ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. స్పెయిన్ చిత్రం 'పెయిన్ అండ్ గ్లోరీ', ఓపెనింగ్ చిత్రం 'ది డెడ్ డోంన్ట్ డై', 'ఫ్రాంకీ', 'ఏ హిడెన్ లైఫ్', ఫ్రాన్స్ సినిమాలు 'ఓ మెర్సీ', 'సిబ్లీ', యుకే చిత్రం 'సారీ విరు మిస్డ్ యు' కేన్స్ అవార్డుల పోటీలో డీలా పడ్డాయి. అంతేకాదు తల పండిన సినీ మేధావుల జోస్యం ఏమాత్రం ఫలించలేదు. అటు ఆస్కార్లోను, ఇటు కేన్స్లోను ఈ ఏడాది వాస్తవికతని ప్రతిబింబించే చిత్రాలకే పట్టం కట్టడం విశేషం.
Authorization