కెరీర్ ప్రారంభంలో అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొన్న మిలా కునీస్ సినిమా అవకాశాల కోసం ఎంతో శ్రమించారు. తొలుత నటించిన సినిమాలు విజయాలు సాధించలేకపోవడంతో ఆశించిన పేరు రాలేదు. తొలి బ్రేక్ కోసం ఎన్నో ఏండ్లు వెయిట్ చేశారు. కామెడీ ప్రధానంగా రూపొందిన 'సాంటా విత్ మజిల్స్'లో
కీలక పాత్రలో మెరిశారు. ట్రైబల్స్ ప్రధానంగా కామెడీ నేపథ్యంలో వచ్చిన 'క్రిప్పెండార్ఫ్ ట్రైబ్'లో, టీనేజ్ కామెడీ 'గెట్ ఓవర్ ఇట్'లో చిన్న పాత్రల్లో కాసేపు అలరించారు. బ్లాక్ కామెడీ హర్రర్‌గా రూపొందిన 'అమెరికన్ సైకో 2'లో మెయిన్ లీడ్‌గా సీరియల్ కిల్లర్‌గా నటించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఎనిమిది మంది జంటల మధ్య అనుబంధం, సమస్యల నేపథ్యంలో వచ్చిన 'ఆఫ్టర్ సెక్స్'లో నాల్గొ జంటగా మెప్పించారు. హాస్యభరితంగా తెరకెక్కిన 'మూవీంగ్ మెక్ ్అల్లిస్టర్'లో హాలీవుడ్ నటిగా మెప్పించారు. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'బూట్ క్యాంప్'లో టీనేజర్‌గా, ప్రియురాలిగా, రెబల్ తరహా పాత్రలో కనువిందు చేశారు. రొమాంటిక్ కామెడీ 'ఫర్గెట్టింగ్ సరా మార్షల్'లో రొమాంటిక్ పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. నియో నాయర్ యాక్షన్ థ్రిల్లర్ 'మ్యాక్ పేనె'లో తన సోదరి హత్యకి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే అమ్మాయిగా విశ్వరూపం చూపించారు. కామెడీ ప్రధానంగా వచ్చిన 'ఎక్స్ట్రాక్ట్'లో కాన్ ఆర్టిస్ట్‌గా, పోస్ట్ అపోకలిప్టిక్ వెస్టెర్న్ యాక్షన్ చిత్రం
'ది బుక్ ఆఫ్ ఎలి'లో ఎలిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అమ్మాయి పాత్రలో మంత్రముగ్ధుల్ని చేసి విశేష ప్రశసంలందుకున్నారు. ఆమె నటనని ప్రపంచ విమర్శకులు సైతం అప్రిషియేట్ చేశారు. సైకలాజికల్ హర్రర్ 'బ్లాక్ స్వాన్'లో టైటిల్ పాత్రలో బ్యాలెట్ డాన్సర్‌గా అద్భుతంగా నటించారు. నెగటివ్‌గా సాగే ఆమె పాత్రకు ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రొమాంటిక్ కామెడీ 'ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్'లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌గా అందం, అభినయంతో మైమరపించారు. హాస్యభరితంగా వచ్చిన 'టెడ్'లో ప్రియురాలి పాత్రలో అలరించారు. నాటకీయంగా తెరకెక్కిన 'ది కలర్ ఆఫ్ టైమ్'లో పులిజార్ ప్రైజ్ విన్నర్ విలియమ్స్ భార్యగా నటించారు. ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం 'ఓజ్ ది గ్రేట్ అండ్ పవర్ఫుల్'లో దేవకన్యగా, మాయా శక్తులను నమ్మే పాత్రలో ఆకట్టుకున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ 'బ్లడ్ టైస్'లో హీరోకి కొత్త ప్రియురాలిగా, శక్తివంతమైన పాత్రలో మెప్పించారు. రొమాంటిక్ డ్రామా 'థర్డ్ పర్సన్'లో ఎక్స్ సోప్ ఓపెరా నటిగా, సంఘర్షణ పూరితమైన పాత్రలో అలరించారు. కామెడీ డ్రామా 'ది ఆంగ్రీయెస్ట్ మ్యాన్ ఇన్ బ్రూక్లిన్'లో డాక్టర్‌గా ఆకట్టుకున్నారు. స్పేస్ ఒపెరా 'జూపిటర్ అస్సెండింగ్'లో ఉద్యోగం, ఫ్యామిలీ జీవితం ఇలా అన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్న జూపిటర్గా మెప్పించారు. కామెడీ ప్రధానంగా వచ్చిన 'బ్యాడ్ మామ్స్'లో ఇద్దరు పిల్లల తల్లిగా, దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ఏ బ్యాడ్ మామ్స్ క్రిస్మస్'లోనూ కామెడీ తరహా పాత్రలో అబ్బురపరిచారు. యాక్షన్ స్పై స్పూఫ్ కామెడీగా వచ్చిన 'ది స్పై హు డంప్డ్ మీ'లో రొమాంటిక్, కామెడీ తరహా పాత్రలో మైమరపించారు.
Authorization