కేట్ బ్లాంచెట్.. అత్యద్భుతమైన విలక్షణ పాత్రలతో యావత్ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేసిన ఆస్కార్ విజేత. స్టార్ హీరోలకు దీటుగా అత్యధిక పారితోషికం అందుకున్న క్రేజీ కథానాయిక. అటు నాటక రంగంతోపాటు ఇటు సినిమా రంగంలోనూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న గ్రేట్ లెజెండ్ కేట్ బ్లాంచెట్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
నాటక రంగం టు సినీ రంగం
ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నాటకాలకు విశేష ఆదరణ ఉండేది. అప్పుడే కాదు ఇప్పుటికీ ఏమాత్రం ఆదరణ తగ్గలేందంటే అతిశయోక్తి కాదు. నాటక రంగం నుంచి చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన వారిలో కేట్ బ్లాంచెట్నొకరు. థియేటర్స్, నాటకాల నుంచి టీవీ రంగంలో, ఆ తర్వాత చిత్ర రంగంలోకి అగ్ర నటిగా వెలుగొందుతున్న కేట్ బ్లాంచెట్ అసలు పేరు కేథరిన్ ఎలిస్ బ్లాంచెట్. 1969 మే 14న ఆస్ట్రేలియాలోని విక్టోరియా పట్టణానికి చెందిన ఐవాన్హోలో జన్మించారు. తల్లి జూన్ బ్లాంచెట్ది ఆస్ట్రేలియా. ఆమె ప్రాపర్టీ డెవలపర్‌గా పనిచేసేవారు. తండ్రి రాబర్ట్ డీ విట్ బ్లాంచెట్ జూనియర్‌ది అమెరికా. ఆయన అమెరికన్ నేవీ ఛీప్ పెట్టీ ఆఫీసర్‌గా పనిచేసేవారు. బ్లాంచెట్కి అన్నయ్య బాబ్ బ్లాంచెట్, చెల్లి గెనెవీవ్ బ్లాంచెట్ ఉన్నారు. తన పదేండ్ల వయసులోనే గుండెపోటుతో తండ్రి మరణించారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యత అంతా తల్లే చూసుకున్నారు. మెల్బోర్న్ యూనివర్సిటీలో ఫైన్స్ ఆర్ట్స్‌లో జాయిన్ అయి మధ్యలోనే ఆపేశారు. ఫ్యామిలీకి సపోర్ట్ కోసం నర్సింగ్ హోమ్‌లో చిన్న ఉద్యోగం చేశారు. ఆ టైమ్‌లో ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ బాక్సింగ్ మూవీ 'కబోరియా'లో చీర్ గర్ల్‌గా నటించే అవకాశం వచ్చింది. దీంతో నటనపై ఆసక్తి ఏర్పడింది. ఎలాగైనా నాటక రంగంలో రాణించాలని సిడ్నీకి తిరిగి వచ్చాక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ కాలేజ్‌లో యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. 1992లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ కాలేజ్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పొందిన తర్వాత పూర్తి స్థాయి యాక్టింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టారు. అదే ఏడాది తొలి ప్రయత్నంగా సిడ్నీ థియేటర్ కంపెనీ తరపున 'ఓలియాన్నా' నాటకంలో నటించారు. 'ఎలెక్ట్రా' నాటకం తనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 1994లో పాపులర్ నాటకం 'హామ్లెట్'లో నటించారు. దీంతోపాటు మినీ సిరీస్ 'బార్డర్ ఆర్మ్‌ఫీల్డ్' (1995), షార్ట్ డ్రామా 'పార్క్లాండ్స్'(1996)లో నటించారు. నటిగా పాపులర్ అయిన తర్వాత కూడా మధ్యమధ్యలో 'ఏ స్ట్రీట్‌కార్ నేమ్డ్ డిజైర్', 'అంకుల్ వన్యా', 'ది మెయిడ్స్' వంటి నాటకాలతో వీక్షకులను మెప్పించారు.
నటిగా గుర్తింపు తెచ్చిన ఎలిజబెత్
1997లో వెండితెరపై మెరిసే అవకాశం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రధానంగా రూపొందిన 'పారడైజ్ రోడ్'లో ఆస్ట్రేలియన్ నర్స్‌గా సపోర్టింగ్ రోల్ పోషించారు. ఇది అంతగా ఆదరణ పొందలేదు. మరో సినిమా 'థ్యాంక్స్ గాడ్ హి మెట్ లిజ్జీ' సైతం మిశ్రమ ఫలితాన్నే చవిచూసింది. 'ఆస్కార్ అండ్ ల్యూసిండా' అనే చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ఇందులో పాపులర్ నటుడు రాల్ఫ్ ఫీన్నెస్తో కలిసి నటించారు. ఇది ఆమె నటనకు మంచి పేరుని తీసుకొచ్చింది. విమర్శకులు ఆమె నటనపై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించారు. ఒక సక్సెస్ జీవితాల్నే మార్చేస్తుందన్నట్టు ఈ సినిమా ఆమెకి బ్రిటీష్ ఆఫర్ తెచ్చింది. ఇంగ్లాండ్‌కి చెందిన మొదటి ఎలిజబెత్ రాణి జీవితం ఆధారంగా బ్రిటీష్ డైరెక్టర్‌గా రాణిస్తున్న ఇండియాకు చెందిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ రూపొందించిన 'ఎలిజబెత్'లో నటించే అవకాశం వరించింది. ఇందులో ఆమె ఎలిజబెత్ రాణిగా అద్భుత అభినయంతో ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ చిత్రంలో తన నటనకుగానూ ఆస్కార్‌కి ఎంపిక కాగా, బ్రిటీష్ అకాడమీ అవార్డుని సొంతం చేసుకున్నారు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మరోబ్రిటీష్ సినిమా 'యాన్ ఐడియల్ హస్బెండ్'లో జూలియానె మూర్, జెరెమీ నార్థమ్లతో కలిసి నటించారు. ఇది కూడా భారీ విజయాన్ని సాధించింది. కేవలం అందాలకే కాదు, మెస్మరైజ్ చేసే నటన కూడా కేట్ సొంతం అని నిరూపించకున్నారు. అందుకే జయాపజయాలకు అతీతంగా తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేస్తూ ప్రపంచ ప్రేక్షకులు మెచ్చిన క్రేజీస్టార్‌గా నిలిచారు.
హాలీవుడ్ ఎంట్రీతో అంతర్జాతీయ గుర్తింపు
'ఎలిజబెత్' సినిమా కేట్కి హాలీవుడ్ ఆఫర్‌ని తెచ్చిపెట్టింది. 1999లో ఏంజెలినా జోలీతో కలిసి 'పుషింగ్ టిన్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తొలి సినిమాతోనే హాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యారు. ఆమె అద్భుత నటనకు ఫిదా అయినా హాలీవుడ్ దర్శక, నిర్మాతలు కేట్ కాల్షీట్ల కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో మరో సంచలనాత్మక, ఆస్కార్ చిత్రంలో భాగమయ్యే అరుదైన ఛాన్స్ లభించింది. అదే 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్'. మూడు సినిమాలుగా వచ్చిన ఈ సిరీస్ అన్నింటిలో కేట్ మెయిన్ లీడ్‌గా మెస్మరైజ్ చేశారు. 'వెరోనికా గ్వారిన్' అనే మహిళా ప్రధాన చిత్రంలో లీడ్ పాత్రతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రేక్షకులు మెచ్చిన ఆస్కార్ విజేత
2004లో నటించిన బయోగ్రాఫికల్ డ్రామా 'ది యావియేటర్' చిత్రం ద్వారా ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. 2006లో విడుదలైన 'నోట్స్ ఆన్ ఏ స్కాండల్', 'ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్' (2007), 'ఐ యామ్ నాట్ థేర్' (2007), 'కారోల్' (2015) చిత్రాలకు గానూ ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. 2013లో బ్లాక్ కామెడీ డ్రామా 'బ్లూ జాస్మిన్'కిగానూ ఉత్తమ నటిగా ఆస్కార్ సొంతం చేసుకుంది. దీనికి వూడీ అలెన్ దర్శకత్వం వహించడం విశేషం. వీటితోపాటు 'ది టాలెంటెడ్ మిస్టర్ రిప్లే' (1999), 'హెవెన్' (2002), 'ది హ్యాబిట్' ట్రిలోజి (2012-2014), 'బాబెల్' (2006), 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బట్టన్' (2008), స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్'(2008), 'రాబిన్ హుడ్'(2010), 'హన్నా', 'ది మొనుమెంట్స్ మెన్'(2014), 'సిండ్రిల్లా'(2015), 'ట్రూత్(2015), 'మ్యానిఫెస్టో'(2015), 'థోర్: రాగ్నారోక్'(2017), 'ఓసియన్స్ 8'(2018) వంటి భారీ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుని హాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 'మ్యానిఫెస్టో'లో 13 విభిన్న పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు. మహిళా ప్రధాన చిత్రం 'ఓసియన్ 8'లో సాండ్రా బుల్లక్, అన్నె హాత్వే, సారా పాల్సన్, మిండీ కాలింగ్, హెలెనా బోన్హమ్, రిహాన్నా వంటి స్టార్స్‌తో కలిసి నటించారు. ఇలా కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు యాభైకి పైగా సినిమాల్లో, దాదాపు 20 నాటకాల్లో, ఏడు టీవీ సిరీస్‌లో, ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో మెరిశారు. కేట్ సినీ రంగానికి అందిస్తున్న సేవలనుగానూ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 2017లో సెంటినరీ మెడల్‌తో సత్కరించింది.. రెండు ఆస్కార్ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందుకున్న కేట్ 2007-08లో టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేసే వంద మంది గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా నిలవడంతోపాటు 2018లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా నిలవడం విశేషం.
ప్రేక్షకుల్ని మెప్పించిన విలక్షణ పాత్రలు..
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి రక్తికట్టించడం, తన పాత్రతో ప్రేక్షకులను మైమరపింప చేయడం కేట్ ప్రత్యేకత. అందుకే ఆమె ప్రపంచం మెచ్చిన అగ్ర తారగా పేరొందారు. అంతేకాదు విలక్షణ పాత్రలకు పక్కా కేరాఫ్‌గానూ మారారు. కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన 'ఎలిజబెత్'లో మొదటి ఎలిజబెత్‌గా హుందాతనంతో కూడిన పాత్రలో అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన 'ది టాలెంటెడ్ మిస్టర్ రీప్లే'లో సామాజిక కార్యకర్తగా బలమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. కామెడీ డ్రామాగా రూపొందిన 'పుషింగ్ టిన్'లో హీరోకి భార్యగా రొమాంటిక్ తరహా పాత్రలో మెరిశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ది గిఫ్ట్'లో ప్రధాన పాత్రలో మర్డర్ కేసులో ఇరుక్కున్న విడోగా ఆకట్టుకున్నారు. ఆంగ్లో- ఫ్రెంచ్ డ్రామా 'ది మ్యాన్ హు క్రైడ్'లో రష్యన్ డాన్సర్‌గా విలక్షణ పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. బ్రిటీష్, ఆస్ట్రేలియన్,
జర్మన్ డ్రామా 'చార్లోట్టె గ్రే' చిత్రంలో బ్రిటీష్ స్పెషల్ అపరేషన్ ఎగ్జిక్యూటివ్‌గా, ప్రియుడు, ఫ్యామిలీ, జాబ్ విషయంలో సంఘర్షణ ఎదుర్కొనే మహిళా పాత్రలో అబ్బురపరిచారు. క్రిమినల్ కామెడీ డ్రామా 'బండిట్స్'లో దొంగగా మరో విలక్షణ పాత్రలో బ్రూస్ విల్లీస్, బిల్లీ బాబ్ థార్టన్ లతో కలిసి నటించారు. ఎపిక్ ఫాంటసీ అడ్వెంచరస్‌గా, విజువల్ గ్రాండియర్‌గా యాక్షన్ భరితంగా రూపొందిన 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్' చిత్రంలో రూలర్‌గా విభిన్నమైన పాత్రతో మెస్మరైజ్ చేశారు. దీనికి సీక్వెల్స్‌గా వచ్చిన రెండు చిత్రాల్లోనూ రాణిగా మైమరపించారు.
వీటికి ప్రీక్వెల్‌గా రూపొందించిన 'ది హ్యాబిట్ : యాన్ అన్ ఎక్సెపెక్టెడ్ జర్నీ' సిరీస్‌లోనూ అదే పాత్రలో మాయ చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ 'హెవెన్'లో బాంబ్ ప్లానర్, బాంబులు తయారు చేసే వ్యక్తిగా భిన్న పాత్రతో ఆకట్టుకున్నారు.డ్రగ్ ట్రేడ్‌పై ఇన్వెస్టిగేషన్ చేసి అనేక నగ సత్యాలను బయటపెట్టి 37ఏండ్లకే హత్యకు గురైన ప్రముఖ ఐరీష్ జర్నలిస్ట్ వెరోనికా గ్వెరిన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ క్రైమ్ చిత్రం 'వెరోనికా గ్వెరిన్' చిత్రంలో టైటిల్ పాత్రలో మెస్మరైజ్ చేశారు. వెస్టర్న్ థ్రిల్లర్ 'ది మిస్సింగ్'లో సంఘర్షణ పూరిత పాత్రలో అద్భుత నటనతో ప్రేక్షక లోకాన్ని కన్నీరు పెట్టించారు. ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్న ఎపిక్ బయోగ్రాఫికల్ డ్రామా 'ది యావియేటర్'లో స్ఫూర్తివంతమైన అమెరిక పాపులర్ నటి కాథరిన్ హెప్బర్న్ పాత్రలో నటించి అబ్బుర పరిచారు. మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె లియోనార్డో డికాప్రియోతో కలిసి నటించారు. మహిళా ప్రధాన చిత్రం 'లిటిల్ ఫిష్'లో గతం తాలుకు ఆలోచనలు, కలలతో బాధపడుతూ డ్రగ్స్‌కి బానిసైన అమ్మాయిగా మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగ్జాండ్రో ఇనార్రిటు దర్శకత్వం వహించిన మల్టీఫుల్ స్టోరీస్‌తో సాగే సైకలాజికల్ డ్రామా 'బాబెల్'లో హీరో బ్రాడ్ పిట్‌కి భార్యగా, బందిపోట్ల దాడికి గురైన మహిళగా ఆకట్టుకున్నారు. బ్రిటీష్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా 'నోట్స్ ఆన్ ఏ స్కాండల్'లో తన కంటే ఎక్కువ వయసున్న భర్తని పెళ్ళి చేసుకుని దాంపత్య జీవితంతో ఇబ్బందులు పడుతూ, తన వీక్నెస్ వల్ల సహ ఉపాధ్యాయురాలి చేతిలో బలవుతున్న టీచర్‌గా అద్బుత నటనతో మెస్మరైజ్ చేశారు. బ్రిటీష్ బయోగ్రాఫికల్ డ్రామా 'ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్'లో మరోసారి బ్రిటీష్ రాణి ఎలిజబెత్‌గా ఫిదా చేశారు. మ్యూజికల్ డ్రామా 'ఐయామ్ నాట్ థేర్'లో గిటార్ ప్లేయర్‌గా, యాక్షన్ అడ్వెంచరస్‌గా వచ్చిన పాపులర్ సినిమా 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్'లో సోవియట్ ఏజెంట్ విలన్ పాత్రధారిగా అబ్బుర పరిచి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఫాంటసీ రొమాంటిక్ డ్రామా 'ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బట్టన్'లో హీరో బ్రాడ్ పిట్‌కి ప్రియురాలిగా, ఎపికల్ హిస్టారికల్ డ్రామా 'రాబిన్ హుడ్'లో విడోగా,
యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ 'హన్నా'లో సీఐఏ ఏజెంట్‌గా నెగటివ్ పాత్రలో, మహిళా ప్రధానంగా వూడీ అలెన్ రూపొందిన బ్లాక్ కామెడీ డ్రామా 'బ్లూ జాస్మిన్'లో పలు ఇబ్బందులు పడే సామాజిక వేత్తగా, జార్జ్ క్లూనీ రూపొందించిన వార్ ప్రధాన చిత్రం 'ది మోనుమెంట్స్ మెన్'లో ఫ్రెంచ్ శరణార్థిగా, ఆర్ట్ హిస్టారియన్గా, మహిళా ప్రధాన రొమాంటిక్ ఫాంటసీ 'సిండెరెల్లా'లో సవతి తల్లిగా, మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'కారోల్'లో గ్లామరస్ మహిళగా, తన కూతురు కోసం వెతికే తల్లిగా, సంఘర్షణ పూరిత పాత్రలో అద్భుతంగా అలరించారు. ప్రయోగాత్మక చిత్రం, మల్టీ స్టోరీస్‌తో రూపొందిన 'మ్యానిఫెస్టో'లో 13 విభిన్న పాత్రల్లో నటించి యావత్ ప్రేక్షకలోకాన్ని మైమరపించారు. మార్వెల్ సూపర్ హీరో సినిమా 'థోర్: రాగ్నారోక్'లో థోర్కి సోదరిగా అలరించారు. దొంగతనం నేపథ్యంలో రూపొందిన మరో లేడీ ఓరియెంటెడ్ సంచలన చిత్రం 'ఓసియన్ 8'లో ఎనిమిది మంది మహిళా దొంగల్లో ఒకరిగా అబ్బురపరిచారు.
Authorization