ది హిడెన్ స్వార్డ్
దర్శకుడు గ్జు హవోఫెంగ్ రాసిన 'ది హిడెన్ స్వార్డ్' నవల ఆధారంగా తనే రూపొందించిన మార్షల్ ఆర్ట్స్ చిత్రమిది. 1939లో జరిగిన వూజియా కథని ఆధారంగా చేసుకుని ఓ కొత్త కోణంలో ఆద్యంతం యాక్షన్ భరితంగా, మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా తెరకెక్కించారు. మార్షల్ ఆర్ట్స్ యుద్ధ వీరుడిగా గ్జు క్వింగ్, ఆయన సరసన జెస్సీ లి అద్బుత నటనతో ఆకట్టుకున్నారు. 2017లో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందడంతోపాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అవార్డులను గెలుచుకుంది.
ది వైట్ హెయిర్డ్ విత్ ఆఫ్ ల్యూనర్ కింగ్డమ్
లియాంగ్ యుషెంగ్ రాసిన 'బైఫా మోను జ్వాన్' అనే నవల ఆధారంగా దర్శకుడు జాకోబ్ చెయుంగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు స్టార్ క్రాస్డ్ లవర్స్ యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉంటారు. మానవతీత శక్తులు వారి సొంతం. అయితే వారి మధ్య ఉండే ప్రేమ ఈ ప్రపంచాన్ని ఎలా మార్చింది?, వారి ప్రేమలో ఉన్న శక్తి ఏంటనే ఆసక్తికర కథాంశంతో దర్శకుడు జాకోబ్ ఈ మార్షల్ ఆర్ట్స్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించారు.
2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రంలో యుద్ధ వీరులుగా, మాయా శక్తులు కలిగిన ప్రేమికులుగా ఫాన్ బింగ్‌బింగ్, హువాంగ్ గ్జియావోమింగ్ నటించి అబ్బురపరిచారు.
టైమ్ రైడర్స్
గ్జులీ రాసిన 'డావోము బిజి' అనే నవల ఆధారంగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రమిది. సమాధి అన్వేషకులు టోంబ్ రైడర్, యుద్ధవీరులు కలిసి భూమిని నాశనం చేస్తున్న
ఓ మిస్టీరియస్ భయంకర జీవులను అంతం చేసేందుకు నడుంబిగించడం, ఈ నేపథ్యంలో శత్రువులతో సాగే భీకర పోరులో గెలుపెవరిది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
దర్శకుడు డానియల్ లీ దర్శకత్వం వహించారు. జింగ్ బోరన్, లుహన్ ప్రధాన పాత్రల్లో అద్భుత నటనతో మెస్మరైజ్ చేశారు. విజువల్ వండర్‌గా నిలిచిన ఈ సినిమా కమర్షియల్గానూ
భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ది టేకింగ్ ఆఫ్ టైగర్ మౌంటేన్
పాపులర్ చైనీస్ రైటర్ క్యూ బో రాసిన 'ట్రాక్స్ ఇన్ ది న్నో ఫారెస్ట్' అనే నవల ఆధారంగా దర్శకుడు ట్నూయి హార్క్ ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనాలోని
ఓ ప్రాంతంలో పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, బందిపోటు దొంగలకు మధ్య జరిగిన భీకర పోరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 1917 నుంచి 1947 వరకు యాంగ్ జిరాంగ్, షావో జియంబో అనే విప్లవకారుల పోరాటం ప్రధానంగా
వారి నిజ జీవితానికి కొంత కల్పితాన్ని మేళవించి దర్శకుడు ట్సూయి
ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఇందులో యాంగ్ జిరాంగ్ పాత్రలో జాంగ్ హన్యూ, షావోజియాంబో పాత్రలో లిన్ గెంగ్జిన్ అద్బుత నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. 2014లో విడుదలైన ఈ చిత్రం భారీ
బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే చైనా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన పదో చిత్రంగానూ నిలవడం విశేషం.
నెవర్ గాన్
రైటర్ గ్జిన్ యివు రాసిన 'నెవర్ గాన్' అనే నవలని ఆధారంగా చేసుకుని
'సో యంగ్ 2: నెవర్ గోన్' అనే చిత్రాన్ని రూపొందించారు. సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి, ఓ పేదతరగతి నుంచి వచ్చిన అమ్మాయి ఒకే స్కూల్లో చదువుకుంటారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ తమ ఆర్థిక స్థితిలో ఉన్న
తేడాని గమనించిన అమ్మాయి దిగులు పడుతుంది. అయినప్పటికీ ప్రేమని ఒప్పుకుంటుంది. ప్రియురాలి తల్లి ఆపరేషన్‌కి ప్రియుడు సహాయం చేయాలనుకున్నప్పుడు
ఆమె తిరస్కరిస్తుంది. దీంతో వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోతారు.
కొంత కాలం తర్వాత ప్రియురాలిలో మార్పు వస్తుంది. మరి తన ప్రేమికుడిని కలుసుకుందా?,
ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికర అంశాల సమాహారంగా, రొమాంటిక్ డ్రామాగా
ఈ సినిమాని దర్శకుడు జోవు టౌరు రూపొందించారు. ప్రియురాలిగా చైనా పాపులర్ నటి లియు యిఫీ, ప్రియుడిగా క్రిస్ వూ తమదైన నటనతో ఆడియెన్స్‌ని మాయ చేశారు. 2016లో ఈ సినిమా విడుదలై విశేషంగా ఆదరణ పొందింది.
మోజిన్: ది లాస్ట్ లెజెండ్
'ఘోస్ట్ బ్లోస్ ఔట్ ది లైట్' అనే ఫేమస్ నవల ఆధారంగా యాక్షన్ అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. హు బాయి, వాంగ్ కైగ్జువాన్, షిర్లీ యాంగ్ ముగ్గురు సమాధి, నిధి అన్వేషకులు. వీరోచితమైన వీరి పోరాటంలో అనేక ఘనతలు సాధిస్తారు. ఈ క్రమంలో బాయి, వాంగ్ తమ ప్రియురాలిని కోల్పోతారు. ఆ తర్వాత తమ జాబ్‌కి రిటైర్మెంట్ తీసుకుని న్యూయార్క్‌లో సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. గత జర్నీలో బాయి, షిర్లీ మధ్య ప్రేమ పుడుతుంది. దాన్ని ఎంజారు చేస్తున్న సమయంలో వీరికి మరో పని వస్తుంది. మళ్ళీ చైనాలోని సమాధుల్లో నిధిని వెతికే జాబ్. దీంతో తిరిగి ఈ ముగ్గురు కలుసుకుంటారు. అయితే ఈసారి చేసే అడ్వెంచర్‌లో తమ స్నేహాన్ని, ప్రాణాలనే రిస్క్‌లో పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సాహసోపేతమైన జర్నీలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి?, తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారా? లేదా అనేదే ఈ సినిమా కథ. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, విజువల్ వండర్‌గా, థ్రిల్ చేసే అంశాలతో సాగే ఈ సినిమాకి వూర్షన్ దర్శకత్వం వహించారు. 2015లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హు బాయి పాత్రలో చెన్ కున్, షిర్లీ పాత్రలో షు క్వీ, వాంగ్ పాత్రలో హాంగ్ బో నటించి ఆకట్టుకున్నారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా పలు అవార్డులను సైతం దక్కించుకుంది.
ది మిడ్నైట్ ఆఫ్టర్
25 ఏండ్ల యంగ్ రైటర్ మిస్టర్ పిజ్జా రాసిన 'లాస్ట్ ఆన్ ఏ రెడ్ మిని బస్ టు తైఫీ' అనే నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. మినిబస్‌లో ప్రయాణిస్తున్న విభిన్న నేపథ్యాలకు చెందిన ప్రయాణికులను గబ్బిలం తరహా ముసుగులతో కొంతమంది వచ్చి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరిని ఉక్కిరి బిక్కరి చేసే కథాంశంతో రూపొందిన సెటైరికల్ హర్రర్ కామెడీ చిత్రమిది.
ఫ్రూట్ చాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో విడుదలైంది. నటీనటుల నటన, డైలాగ్‌లు, హర్రర్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇది బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. ఇక ఇందులో ప్రధాన పాత్రల్లో వాంగ్ యు నామ్, జనిక్ మ్యాన్, సిమన్యమ్, కారా యుయి, లామ్సూట్, చుయి టీన్ యు నటించి ఆకట్టుకున్నారు.
క్రౌచింగ్ టైగర్.. హిడెన్ డ్రాగన్: స్వార్డ్ ఆఫ్ డెస్టినీ
చైనాకు చెందిన మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మార్షల్ ఆర్ట్స్ నవలా రచయిత వాంగ్ డులు రాసిన 'ఐరన్ నైట్, సిల్వర్ వ్యాస్' అనే నవల ఆధారంగా పాపులర్ చైనా సినిమా'క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్'కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. కోల్పోయిన తన యవ్వనాన్ని, అప్పటి ప్రేమని, లెజెండరీ మాయా ఆయుధాన్ని పొంది విముక్తి పొందిన ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు, యుద్ధ యోధురాలి తెగువని, సంఘర్షణ పూరిత ఆమె జీవితాన్ని తెలిపే కథాంశంతో దర్శకుడు వూ పింగ్ యుయిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2016లో విడుదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మంచి విజయం సాధించడంతోపాటు పలు అవార్డులను అందుకుంది.
ఇందులో యుద్ధ యోధురాలిగా మిచెల్లె యిహ నటించారు.
క్రోనికల్స్ ఆఫ్ ది ఘోస్ల్టీ ట్రైబ్
2006లో బాగా అమ్ముడుపోయిన నవల 'ఘోస్ట్ బ్లోస్ ఔట్ ది లైట్' ఆధారంగా త్రీడీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన చిత్రమిది. 1979లో ఓ యువ సైనికుడు కున్లున్ పర్వత ప్రాంతంలో పేలుడు పదార్థాలు ప్రయోగించినప్పుడు అక్కడి మంచు పర్వాత లోయల్లో విచిత్రమైన శిలాజాలు, విచిత్రమైన మృగాలు, జీవులు బయటకు వచ్చి వారిపై, జనంపై దాడి చేస్తుంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. లూ చువాన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ 2015లో విడుదలైంది. ఇందులో సైనికుడిగా మార్క్ చావోతోపాటు యావో చెన్, రైడియన్ వాఘన్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇది క్రిటికల్‌గా, కమర్షియల్‌గా విశేష ఆదరణ పొందింది.
ది ఫైనల్ మాస్టర్
హవోఫెంగ్ అనే రైటర్ రాసిన 'ది ఫైనల్ మాస్టర్' అనే నవల ఆధారంగా
అదే పేరుతో ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. చెన్..
వింగ్ చున్ గ్రాండ్ మాస్టర్(మార్షల్ ఆర్ట్స్‌లో ఇదొక స్టయిల్)లో అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్టిస్టు. కొంత మంది కార్పొరేట్లు మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ప్రారంభించి స్థానికంగా తమ పవర్‌ని చాటుతుంటారు. దీని కారణంగా ఎన్నో అవమానాలకు గురైనా చెన్ తనే సొంతంగా మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ని ప్రారంభిస్తాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది స్కూల్స్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. మరి కార్పొరేట్లు ఆడిన క్రీడలో చెన్ ఒక కాయిన్ అయ్యాడా? లేక తనే హీరోగా నిరూపించుకున్నారా అనే ఆసక్తికర కథాంశంతో దర్శకుడు గ్జు హవో ఫెంగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది.
Authorization