Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనల్ని కలిపిన
గాలి గర్భం దాల్చింది.
సీమంతానికి చిరునవ్వును తోడు చేసుకొనిరా..
పరచిన మనసు కార్పెట్‌పై
కొద్ది క్షణాలు గడుపు చాలు...
కొన్ని జ్ఞాపకాలు ముస్తాబై చుట్టూ చేరి
పాటలు పాడతాయి.
లోతుభావనలతో బంగారు గాజులు చేయించా...
లేత అనుభవాలతో పూలమాలలు కట్టించా...
మన తొలి పరిచయపు రోజులను
పోగులుగా పట్టుచీర నేయించా...
దోసిట ప్రేమతో దరి చేరి
ముత్యమంత కుంకుమలా
నుదటను ముద్దాడి
పచ్చగా దీవించు దేవతలా
మనల్ని కలిపిన
గాలిది కనిపించని ప్రేమ.
అగుపించని అనురాగం.
మన మనసుల పోలికను
ఆశిస్తూ తీయగా దీవిద్దాం...
- చందలూరి నారాయణరావు
9704437247