Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మ విశ్వాసాన్ని పెంపొం దించే పాటలు,వ్యక్తి ఉన్నత లక్ష్యానికి ఊపిరి పోసే పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. అలాంటి పాటల్లో 'గ్యాంగ్ లీడర్' (2019) సినిమాలోని అనంత శ్రీరామ్ రాసిన 'రా..రా..జగతిని జయించుదాం' అనే పాట ఒకటి. ఎలాంటి సన్నివేశానికైనా ఒదిగిపోయేంత సన్నిహితంగా పాట రాయగలడు అనంత శ్రీరామ్. ఈ పాటలో కూడా ఆయన చూపించిన నేర్పు, సందర్భానికి తగ్గట్టుగా మలచిన తీరు ఎంతో ప్రత్యేకమైనది.
నిజానికి సినిమా పరంగా చూసినట్లయితే- పైకి మంచి వాడిలా నటిస్తూ వెనకాలా గోతులు తీస్తూ అవినీతికి పాల్పడుతున్న విలన్ను (ప్రతి నాయకుడిని) ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న హీరోకు తన బందానికి ఉత్తేజాన్నిస్తూ, పాడే పాట ఇది. విలన్ చేసిన అన్యాయానికి ప్రతీకారాన్ని తీర్చుకోవా లనుకుంటున్న హీరో తన బందంతో కలిసి ఆవేశాన్ని ఆయుధం గా చేసుకుని సాగు తున్న సన్నివేశం ఈ పాటలో మనకు కన బడుతుంది. సినిమా కథను పక్కన పెట్టి, ఈ పాటను మనం విన్నా, ఒక సంకల్పం, ఒక దఢ నిశ్చయం, ఒక విశ్వాసం కలబో సుకుని నడుస్తున్న శక్తి సమూహం ఈ పాటలో కనబడుతుంది.
ప్రపంచాన్ని జయించాలనే తెగువను నేర్పుతూ,సరికొత్త చరిత్రను లిఖించాలన్న ఆశయాన్ని అలవాటు చేస్తూ, భవిష్యత్తును సవాలు చేస్తూ ముందుకు నడిపించే ఒక ప్రేరణను అందిస్తున్నాడు అనంత శ్రీరామ్ ఈ పాటలో..
చెడును కాల్చేసే రహస్యమైన వ్యూహాన్ని కనిపెట్టే ఆలోచనతో నడుం కట్టి నడవాలని అంటున్నాడు. పిడుగులనే ధరించి కదలమంటున్నాడు.ఇక్కడ పిడుగులను ధరించమనడం వినూత్నమైన ఊహ. అంటే పిడుగుల్లో ఉండే గర్జించే శక్తిని,విరుచుకుపడే కసిని అలవాటు చేసుకొమ్మని ఇక్కడ సందేశం.
సంకల్పం బలమైనదైతే మనల్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఒక వేళ ఎన్నో అడ్డంకులు ఎదురై, ఆపినా వాటిని ఛేదించుకుని వెళ్ళే సత్తా కూడా మనిషికి ఉండాలి. అందుకే చెట్లు, పుట్టలు, కొండలు, నదులు సమస్త జీవరాశులను, కాలపు సరిహద్దులను దాటి దశదిశల అంచుల దాకా ప్రయాణించమంటున్నాడు. ఎన్నో ఎత్తులకు ఎదిగి,ఎగిరి గెలుపును అందుకోమంటున్నాడు.
మంచిని గెలిపించాలనే ఆలోచనతో, ఆరాటంతో, ఆశయంతో ఆవేశాన్ని తోడుగా చేసుకున్న మనిషికి ఒక సమూహమంతటి సత్తువ ఉంటుంది. ఒక్కడికే ఒక సైన్యమంతటి బలం ఉంటుంది. ఇక్కడ అలాంటి సత్తువ ఉన్న ఒక బందంలో ఒక్కో మనిషి ఒక్కో సమూహమై, కొన్ని వేల శక్తుల పరంపరగా మారి, ఒక్క చోట చేరి చెడుకు చరమగీతం పాడాలన్న తలంపుతో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. చెమటను చమురుగా చేసుకుని, దేహాన్ని వాహనంగా మార్చుకుని, శ్రమకు గమ్యాన్ని చూపించే దిశగా నడుస్తున్నారు. తారల తలల్ని తాకేంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిం చుకుంటున్నారు. ఇక్కడ జరగబోయే యుద్ధానికి కావల్సింది కత్తులో, కటార్లో కాదు.. ఆరిపోని తపన కావాలి. ఆ తపననే ఆయుధంగా చేసుకుని యుద్ధం చేయాలని, విజయాన్ని సాధించాలని చివరలో కవి సందేశమిస్తున్నాడు. సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడని సందేశా న్నిస్తుందీ పాట. సరికొత్త చరిత్రను లిఖించగలడన్న నమ్మకాన్ని కలిగిస్తుందీ పాట.
పాట :-
రా..రా.. జగతిని జయించుదాం / రా..రా.. చరితను లిఖించుదాం / రా..రా.. భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం /రా..రా.. నడుములు బిగించుదాం / రా.. రా.. పిడుగులు ధరించుదాం/ రా..రా..చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం
గదులు గడులుగా గడపలు దాటేరు/ దడలు దడులుగా దరులను దాటేరు/ ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దశదిశల కొసకు పోదాం/తెరలు మొరలు చెరలను దాటేరు/ తరులు గిరులు ఝరులను దాటేరు/ ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం.
సరిగా సరిగా మన శక్తులన్ని/ ఓ చోట చేర్చుదాం/చెమటే చెమటే చమురైన వాహనం దేహమే కదా/ శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం/ తారల తలలు తాకుదాం/ మన తీరుని తెలుపుదాం/ ఆరని తపన ఆయుధం/ ఇక పోరుని సలుపుదాం.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682