Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాధుర్యమంటె వేరె లేనెలేదోయి
ఎస్పీబాలు గాత్రానికి మారుపేరోయి
అమతము తేనియ పంచదార కలిపి
వండిన పాయసము మన బాలు గానము
ఎంతగ్రోలినా గాని తనివి తీరదు
ఎంతసేపువిన్నా మనకొకింత చాలదు
గంధర్వులు కోటిమంది పోటీగా పాడిన
తుంబుర నారదులు గొంతుచించుకున్నా
సాటిరారు బాలసుబ్రహ్మణ్యం పాటకూ
దీటురాదు ఎన్నటికీ ఆ మహనీయుని ప్రజ్ఞకు
భక్తుల పాలిటి ముక్తిదాయకం
రసజ్ఞుల పాలిటి కల్పవక్షము
రోగాలను బాపేటి దివ్యౌషధం
వేదనలో నేస్తం-మన బాలు గాత్రం
- డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ),
9849693324