Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ అభిరుచికనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగే వ్యక్తులెవరైనా విజయాన్ని సాధిస్తారు.అయితే లక్ష్యాన్ని నిర్ణయించుకునే సమయంలోనే తమ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. ఒకవేళ మీలో సామర్థ్యం కొరవడినా లక్ష్యాన్ని చేరురునే సమయంలో మీ ప్రతిభ పెరుగుతుంది. అదే సమయంలో లక్ష్య సాధనకు చిత్తశుద్ధిగా పని చేయనట్లయితే విజయాన్ని అందుకోలేం. విజయానికి ప్రాతిపదిక పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, ఆత్మ విశ్వాసమేననే విషయాలను మనం గుర్తించాలి. విజయాన్ని సాధించ గల అవకాశాలు, లక్షణాలు మనలోనే ఉన్నాయి. మనం చేయవలసిందల్లా వాటిని గుర్తించి ఉపయోగించు కోవడమేనని మనోవైజ్ఞానికులు చెబుతున్నారు. విజయానికి కారణాలు మరెక్కడో దాగి ఉండవు.మన చుట్టూ నెలకొన్న పరిస్థితులు అవరోధం కావు. మనలో చాలా మంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి విజయం సాధించలేక పోతున్నామని తమను తాము సమర్థించుకుంటారు. అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, సాధ్యం కావని అనుకున్న పనులను సాధించడమే ఆత్మవిశ్వాసానికి ఆలంబనగా భావించాలి. పరాజయానికి, వైఫల్యానికి కారణాలు మరెక్కడో ఉండవు. అవి మనలోనే దాగి ఉంటాయి. ప్రతి మనిషికి ఏదైనా పని చేస్తున్నపుడు వైఫల్యం ఎదురుకావడం సాధారణ విషయం. దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. విజయం వరించలేదని కుంగిపోయి ఉన్న చోటనే ఆగి పోకూడదు. విలువైన సమయాన్ని వృధా చేసుకోరాదు. గడచిన సమయం ఎంత కఠోర తపస్సు చేసినా తిరిగి రాదు. సురేందర్ ఒక కాస్మెటిక్స్ తయారీదారులకు ప్రతినిధిగా ఉద్యోగంలో చేరాడు. ఆయన వినియోగదారుల వద్దకు ఓపిగ్గా వెళతాడు. ఎంతో శ్రమపడతాడు. అయినా ఆ వస్తువులను అమ్మలేడు. ఆయనతో పాటే ఆ ఉద్యోగంలో చేరిన వినరు కుమార్ క్షణంలో వినియోగదారులను ఒప్పించ గలుగుతాడు. ఎలాంటి సరుకునైనా అమ్మగలడు. ఇతరులతో వ్యవహరించడం, వారిలో ఆసక్తి ప్రేరేపిం చడం, వారిని ఒప్పించడం సురేందర్‌కు తెలియవు. ఆ విషయాలు వినరుకుమార్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన తన పనిలో విజయం సాధించాడు. సురేందర్ లాంటి వ్యక్తులు చాలామంది తమ అభిరుచులేమిటో గుర్తించకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని జీవనోపాధి కోసం ఆయా ఉద్యోగాల్లో చేరతారు. కాని విజయం సాధించ లేరు. అందువలన వారికి ప్రారంభంలోనే ఎన్నో వైఫల్యాలు ఎదుర వుతాయి. దాంతో వారు తాము ఏమి సాధించలేమని ఢలాీపడిపోతారు. సమర్థతా భావనకు లోనవుతారు. ఎందుకు పనికి రామని తమనుతాము కించపరు చుకుంటారు. ఏమాత్రం ప్రయత్నించినా సురేందర్ లాంటి వ్యక్తులు కూడా విజయం సాధిస్తారు. అయితే వారు తమ పనిలో చిత్తుశుద్ధిని పాటించాలి. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామనే ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఎట్టి పరిస్థితిలోనూ నిరుత్సాహం, కుంగుబాటుకు గురి కాకూడదని నిర్ణయించు కోవాలి. తమ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. తమ పనులను నిజాయితీగా సమీక్షించుకోవాలి. తమకు ఎదురైనా అనుభవాల నుంచి నూతన విషయాలను నేర్చు కోవాలి. తమ జీవితాన్ని తాము సవరించుకునేందుకు సిద్ధం కావాలి. తమ లక్ష్యం పైనే దృష్టిని నిలుపాలి. మనలో చాలా మంది ఒక పని మొదలు పెడతారు. అది నచ్చలేదని మరో పని చేస్తారు. అది బాగా లేదని మరొకటి చేయబోతారు. అలాంటి వారు ఏ విషయం లోనూ విజయం సాధించలేరు. సమయం వృధా అవుతుంది. నిరాశ ఆవహిస్తుంది.
ముందుగా ఒక నిర్ణయం గైకొనే సమయంలోనే అదెంత వరకూ సమంజసమైనది, మన శక్తి సామర్థ్యాలకు ఎంతవరకూ అనుగుణమైనదని తరచి చూసుకోవాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తరువాత విజయం సాధించడం తథ్యమని గుర్తించాలి. అందుకు అవసరమైన ఎత్తుగడలను, వ్యూహాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకోవాలి. ఇతరుల కంటే మీ శక్తి సామర్థ్యాలు తక్కువని భావించడమే వైఫల్యానికి, ఓటమికి మూల కారణమని గుర్తించాలి. ఈ సందర్భంలోనే మనో వైజ్ఞానికులు మరో విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదెమిటంటే మీరు తీవ్రమైన ఆలోచన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటే మీ శక్తిసామర్థ్యాలు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సరిపోతాయి. మీలో చెలరేగే సంశయాలే మిమ్మల్ని కుంచించి వేస్తాయి. మిత్రమా.. మిమ్మల్ని మీరు ఉన్నతంగా అంచనా వేసుకోవాలి. జీవితంలో ఏమైనా సాధించగలమన్న ఉత్సాహం, పట్టుదల ప్రదర్శించాలి.
- జి.గంగాధర్ సిర్ప,
8919668843