Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవుడి పాదాల దగ్గర మంచి పువ్వులనే పెడతాం. పిచ్చి పువ్వులను పెట్టం కదా! అంటుంది ఒకావిడ. విషయం అర్థం కాలేదు. కానీ తర్వాత తెలిసింది. ఎన్నో కోట్ల హదయాలను చీకటి అలుముకుందని. మీ పాదాలకు నమస్కరించి, శిష్యులుగా మీ నీడలోనే ఎదగాలకున్న ఎంతో మంది సంగీత పిపాసుల ఆశలు అడియాశలయ్యాయని. మా గాన గంధర్వుడి గమనం జరిగిందని. భగవంతుడే చేతులు చాపి తన గళాన్ని వినిపించమని కోరాడని, సరస్వతీ మాత తన వీణను మ్రోగించమని పిలిచిందని, ఎన్ని సెలయేళ్ళ చప్పుళ్ళు ఆగిపోయాయో? ఎన్ని పూలు కుమిలి పోయాయో? మీ పాటలో నవ్వులు నెమరేసే ఎన్ని నదీనదాలు కన్నీరై ప్రవహిస్తున్నాయో? దేశం ఇప్పుడు నిశ్చేష్ఠు రాలై నిలిచిపోయింది. ఎలా తట్టుకోవాలి ఇప్పుడు మీ గళం మూగబోయిందని తెలి సాక. ఎలా సర్ది చెప్పుకోవాలి ఇక మీ స్వరం వినిపించదని అన్నాక. సంగీత సాగరంలో రారాజులా మామధ్యలో అమతాలను ఆలాపిస్తూనే స్వరలయల జతలను కలుపుతూ సాగిన మీ ప్రయాణం ఆగిపోయిందన్న నిజం తెలిస్తే గాలి కూడా కొన్ని క్షణాలు ఆగిపోతుందేమో? ప్రకతి కూడా గుండెను పగులకుండా అదిమి పట్టుకుంటుందేమో? మీ సంగీత మాధుర్యంలో ఓలలాడిన జన నయనాలు అశ్రుపాతాలనే కురిపిస్తున్నాయి. అభిమానుల హదయాలు ఆగిపోతున్నాయి. కళ్ళకు తడి ఆరిపోతుంది. చెవులు ఈ మాట అబద్ధమైతే బాగుంటుందని అనుకుంటున్నాయి. నిజంగానే ఆ దేవుడికి మామీద దయలేదేమో? లేకపోతే మిమ్మల్ని ఈ జగత్తుకు పరిచయం చేసి ఎందుకు తీసుకెళ్తాడు? కాదు అతనే మీరు లేక ఉండలేక పోయాడేమో? మీ గానాన్ని వినకుండా నిలువలేక పోయాడేమో?
సంగీత సాహిత్యాలు సరస్వతీదేవి మేనిలో అర్థ భాగమంటుంటే మాకు గుర్తోచ్చే పేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. సంగీతంలో దిట్ట, పాండిత్యం కలవారు అంటే ఎవరో మీరు తప్ప ఈ తరానికి వేరేవాళ్ళు తెలియదు. ఘంటసాలగారి తర్వాత మీ పేరే విన్నాం. తెలుగు సినీ జగత్తు ఈ రోజు ఒక పెద్ద దిక్కును కోల్పోయిందనే మాట మా హదయాలు తట్టుకోలేకపోతున్నాయయ్యా! ప్రత్యక్షంగా చూడకపోయిన మీ తెల్లని మనస్సు మీ విరజిమ్మే నవ్వుల్లోనే కనిపించేది. మీ అణకువ, సంస్కతి, మీ వేషధారణలో కన్పించేవి. మీ ఆదరణ, ఆప్యాయత, నిబద్ధత, మీ మాటల్లోనే తెలిసేది. ప్రతి మది గదిలో దశాబ్దాలుగా ఒక స్థలాన్ని పదిలపరుచుకున్నారే. ఆ గదులు నిశ్శబ్దంతో ఈరోజు నిండిపోయాయి. ఇక ఈ చోటుని ఎవరు పూడ్చగలరు. ఏ స్వరం మా కన్నీళ్ళను తుడువగలదు? మా ఆర్తిని, ఆవేదనను ఏ గళం ఆపగలదు? మీరు ఇక లేరనే నిజాన్ని వినగానే ఒక్క క్షణం మెదడు స్పహను కోల్పోయింది. మాట మౌనం వహించింది. ఒక్కసారి ఈ లోకానికి తిరిగి రండి. భారతావని కన్నీళ్ళను తుడిచి వెళ్ళండి. మీ దేహాన్ని కాల్చడానికి చితి మంటలు కూడా గాలితో చెలిమి చేసి కొత్త రాగాన్నే ఆలాపిస్తాయేమో? అగ్నికణం కూడా మండే తత్త్వాన్ని కోల్పోయి అభిమానపు వర్షాన్నే కురిపిస్తుందేమో? ఈ మాటలు మీ పాటలకు అంకితాలు. మా అభిమాన హదయాలకు ప్రతీకలు. మీ ఆగిన గళానికి మా ఆవేదనల చిరునామాలు. ఎంతో మంది మేధావులను, కళాకారులను కాలగర్భంలో కలిపిన ఈ అవని మిమ్మల్ని భౌతికంగా దూరం చేసిందేమో కానీ పంచ భూతాలు ఉన్నంతవరకు మీ గళాన్ని ఈ గాలి మోసుకెళుతూనే ఉంటుంది. మా జనహదయాలను మీ రూపంలో తడుముతూనే ఉంటుంది. అజరామరమై నిలిచిపోతుంది. మీ స్వరఝరి లో మేము మా మదిలో మీరు చిరకాలం నిలిచేఉంటారు.
- వేముల శరణ్య,
9493613830