Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది మనుషులు మాత్రం కొత్త దారులు వెతుకుతూ కొత్త ప్రదేశాలకు చేరుకుంటారు. వారి వెంట మరెవరైనా నడిస్తే అక్కడ దారి ఏర్పడును. 16 ఏప్రిల్ 1889లో లండన్‌లో జన్మించి, 1977 డిసెంబర్ 24న మృతి చెందిన 'చార్లీ చాప్లిన్' గొప్ప నటుడు. హాస్య నట చక్రవర్తి.
ఒక బీద బాలుడు హాలీవుడ్ ను జయించిన తీరు తెలిపే గొప్ప పుస్తకం అందించిన రచయిత కె.బి.గోపాలం ఎంతైనా అభినందనీయులు. ఖండాంతరాలలో తిరిగిన (చాప్లిన్) ఆ పిల్లవాడు కోట్లకు పడగలెత్తాడు. ఖండాంత రాలల్లో కోట్లాది మంది అభిమాన పాత్రుడైన విశ్వనటుడు చాప్లిన్. ఐన్‌స్టైన్, చౌ ఎన్లై, చర్చిల్, సార్త్రే, పికాసో, గాంధీ వంటి వారితో చాప్లిన్ కలిసి తిరిగిన గొప్ప కళాకారుడు.
కుటుంబంతో కలిసి ప్రపంచ యాత్ర చేసాడు చాప్లిన్. అలాస్కా నుండి జపాన్ దాకా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. భారతదేశం సందర్శించాడు. అనంతర కాలంలో చాప్లిన్ ''ఆత్మకథ'' రాసాడు. 1964లో యీ పుస్తకం ప్రపంచ మంతటా అమ్ముడైంది.
1903లో షెర్లాక్ హౌమ్స్ నాటకంలో పాత్ర వేయడం, 1913లో సినిమాల్లో చేరిక, విటిల్ ట్రాంప్ పాత్ర రూపకల్పన; 'ద ట్రాంప్' విడుదల, ఆ తర్వాత 'ద కిడ్' 'గ్రేట్ డిక్టేటర్' లాంటి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలెన్నో యీ పుస్తకంలో రచయిత చక్కగా రాసారు. 1936లో విడుదలైన ''మోడరన్ టైమ్స్'' గొప్ప చిత్రం. 1947లో అమెరికా వ్యతిరేక చర్యలు చేస్తున్నట్టు నింద- 1952లో దేశ బహిష్కరణ; నైట్ హుడ్; డాక్టరేట్స్- సత్కారాలు; జీవితంలో కష్టసుఖాలు, నాల్గు పెళ్ళిళ్ళు... (1918 నుండి 1943 దాకా) స్విట్జర్లాండ్‌లో నివాసం- 1954లో ప్రపంచ శాంతి సభ బహుమతి; 1972లో అమెరికా పునరాహ్వానం- లాంటి సంఘటనలు... దాదాపు 80 చిత్రాలు నిర్మాణం లాంటి అంశాలతో చక్కటి ఫొటోలతో ఆబాల గోపాలాన్ని అలరించే సినీ కళాకారుని గొప్ప పుస్తకం.. అందించిన నవతెలంగాణ బుక్ హౌస్ వారికి, రచయిత గోపాలం గార్లు ఎంతైనా అభినందనీయులు.
(రచన : కె.బి.గోపాలం, పేజీలు : 104, వెల : రూ.100/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, 21/1, ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్ - 20, సెల్ : 9490099378)
- తంగిరాల చక్రవర్తి,
9393804472