Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి ఫలితంగా ప్రజల రోజువారీ జీవితాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో రకాలైన విపత్కర పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కోట్లాది మంది ప్రజలపై మానసిక ఆరోగ్య ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే కామంతో లైంగిక దాడులు, పసిపిల్లల పట్ల కౄరత్వం, విపరీత ఆలోచనలు, ఒంటరి తనంతో కుంగిపోవడం, అన్ని ఉన్నా ఏమిలేని వాడుగా జీవనాన్ని వెల్లదీయడం, మగంలా, శాడిస్టుల్లా ప్రవర్తించడం, పగలు ప్రతీకారాలతో హత్యలు, ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతుండడం మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. వీరంతా సమాజంలో ఈ విధంగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? వీరి మనస్తత్వం ఇలానే ఎందుకు ఉంటోంది? అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వీటన్నింటి విశ్లేషణపై ప్రత్యేక వ్యాసం
మనుషులు ప్రవర్తించే తీరు ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. మనుషుల ప్రవర్తనతీరును బట్టి వారి యొక్క పర్సనాలిటీ గుర్తించబడుతుంది. సమాజం ఆమోదిం చని మనుషులలోని ప్రవర్తనలను బట్టి వ్యక్తిత్వ లోపాలు ఏర్పడుతాయి. వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు సమాజం నందనవనంలా తయారవుతుంది.
ఆదిలోనే గుర్తిస్తే...
1. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (Paranoid Personality Disorder): సమాజంలోని ఏ ఒక్కరిని నమ్మరు. ప్రతి ఒక్కరిని అనుమానాస్పదంగా చూస్తుంటారు. సర్దుకుపోయే గుణం అస్సలు ఉండదు. తను అనుకున్న దాంట్లో వైఫల్యం చెందితే, ఆ పరిస్థితులను ఎదుర్కోలేక అవమానంగా భావిస్తూ ఉంటారు. ఇతరుల సూచనలను, సలహాలు తిరస్కరిస్తూ ఉంటారు. వ్యక్తులపట్ల ద్వేషాలను, పగలను పెంచుకుంటూ ఎంతకైనా తెగిం చాలనే భావనలను కలిగి ఉంటారు. తమకు తామే గొప్పవారమని భావిస్తుంటారు.
2. స్కీజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్(Schizoid Personality Disorder): ఊహా ప్రపంచంలో విహారిస్తూ ఉంటారు. ఇతర వ్యక్తులతో పరిచ యాలను పెంపొం దించు కోవాలను కోవడం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండ డానికి ఇష్ట పడుతూ ఉంటారు. ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అమాయక చక్రవర్తిలా ఉంటారు. సెక్స్ పట్ల కూడ ఎక్కువ ఆసక్తిని కనబరచరు.
3. స్కీజోటైపల్ డిజార్డర్ (Schizotypal Personality Disorder): అసాధారణమైన ప్రవర్తన కలిగి ఉంటారు. స్కిజోఫ్రెని యాకు సంబంధించిన ఆలోచనలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఏవేవో చెడ్డ కలలు వస్తూ ఉన్నట్లుగా, దెయ్యాలు వెంబడిస్తు న్నాయంటూ, ఎవరికి వినిపించని మాటలు తనకు మాత్రమే వినిపిస్తున్నాయంటూ అంటూ ఆందోళనలతో మానసిక అనారోగ్యం కొనితెచ్చు కొంటారు. ఇతరులు నాకు హాని చేస్తు న్నారని అపోహలు చెందడం, సామాజిక సంబం ధాలకు దూరం కావడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంది.
4. ఆంటి సోషల్ లేదా డిస్సోషల్ (Antisocial or Dissocial Personality Disorder): సమాజంలోని వారి ఎవరి భావాలను గురించి పట్టించుకోరు. అతి తొందరగా విసుగు చెందడం, దూకుడుగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడటం, సమాజం లోని వ్యక్తులతో సన్నిహిత సంబంధా లను ఏర్పరుచు కోవడం కష్టం. సమాజం ఆమోదించనటువంటి పనులను చేస్తూ ఉండడం అలవాటుగా మారడం.
5. బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (Borderline or Emotionally Unstable Personality Disorder): అస్థిరమైన భావోద్వేగాలను కలిగిఉండడం, ఒకే రకమైన వ్యక్తిత్వం లేకపోవడం, సమాజం లోని వ్యక్తులతో సంబంధాలను కలిగి లేకపోవడం, ఎవరూ నన్ను గుర్తించడం లేదనే ఆందో ళనలు కలగడం, ఒక్కోసారి కోపంగా, హింసాత్మకంగా ప్రవర్తిం చడం, ఎవరైనా తక్కువ చేసి తనను మాట్లాడినప్పుడు ఆగ్రహా వేశాలతో ఊగిపోవడం, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు, సాధారణంగా బాల్యదశలో లైంగిక వేధింపులకు గురైనవారు ఇలాంటి పర్సనాలిటీని కలిగి ఉంటారు. మహిళల్లో ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవారు ఒక్క భాగస్వామితో ఉండలేరు, పురుషులు అయితే హింసాత్మకంగా ప్రవర్తిస్తారు.
6. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Histrionic Personality Disorder): నాటకీయమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఎవరినైనా ఆకర్షించ గలమని, తమ వైపుగా తిప్పుకో గలమని భావిస్తూ ఉంటారు. ప్రతి సారి Excitement ను కోరుకుంటూ ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. తమకు ఏదైనా దక్కకపోతే, ఎవరైనా విమర్శిస్తే తీవ్రమైన ఆందోళన లతో, చెడు పద్ధతిని ఎంచుకొంటారు. సమస్యలను సష్టించు కుంటారు. ఈ సమస్యలను సాధించాలని మళ్లీ చెడు మార్గంలో ప్రయాణిస్తారు. దుర్భుద్దిని ప్రదర్శిస్తూ ఉంటారు.
7. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic Personality Disorder): అహంకార పూరితమైన వ్యక్తిత్వం, ఇతరులను తనతో పోల్చుతూ పొగిడితే తట్టుకోలేరు. నాతో పోలికనా అనే భావన బలంగా ఉంటుంది. వ్యక్తిగత స్వార్థం కోసం అబద్దాలు ఆడటం, ఎదుటి వారిని దోపిడి చేసేందుకు సైతం సిద్ధపడుతూ ఉంటారు. ఎవరైనా తనపై జోక్‌లు వేస్తే తట్టుకోలేరు. తీవ్రంగా స్పందిస్తారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. విధ్వంస పూరితమైన ప్రవర్తనను కలిగి ఉండడం. తమను అందరూ ఎప్పుడూ మెచ్చుకోవాలని భావిస్తూ ఉంటారు.
8. అబ్సెసివ్ - కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (Obsessive - Compulsive Personality Disorder) : రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై ఎక్కువగా మాట్లా డుతూ ఉంటారు. తన దష్టిలో తప్పు అనుకున్న దానికి ఏదో ఒక రూల్ ప్రకారం ఇలా చేయ కూడదు అని, ఈ గైడ్‌లైన్స్ ప్రకారం మీరు చేసేది తప్పు అంటూ ఎప్పుడూ విమర్శించే తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో సందేహిస్తూ అతి జాగ్రత్తను పాటిస్తూ ఉంటారు. కఠినమైన గుణాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో తనకు తాను నియంత్రించుకుంటూ ఉండడం, హాస్యాన్ని దరిచేరనీయకుండా, ఏ మాత్రం లోపం జరిగినా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇతరులు ఎవరూ వీరితో స్నేహ సంబంధాలను కొనసాగించడం చాలా కష్టం. కొత్త పరిస్థితులకు అనుగుణంగా తట్టుకోవడం చాలా కష్టం.
9. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (Avoidant Personality Disorder): ఎలాంటి చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు కనిపించవు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఎక్కువగా యాంగ్జైటీతో బాధపడుతూ ఉంటారు. సమాజంలోని వ్యక్తుల నుండి తప్పించుకోవటానికి ఎక్కువగా ఇష్టపడూతూ ఉంటారు. బాల్య దశలో తల్లిదండ్రుల నుండి దూరంగా పెరగడం, స్నేహితులు దగ్గరకు రానీయకుండా పెరగడం వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు.
10. డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (Dependent Personality Disorder): ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండి ప్రతి విషయంలో ఇతరుల పైన ఎక్కువగా ఆధార పడుతూ ఉంటారు. రోజు వారీ పనులను ఎదుర్కోవడం కష్ట సాధ్యంగా ఉంటుంది. నిస్సహా యస్థితిలో ఉన్నానని, అసమర్థుడినని తనకు తానుగా ఒప్పుకుంటూ తను తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఇతరులపైకి నెట్టి వేస్తూ, ఇతరులే తన తరపున నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. ఇలాంటి వారు తమను దోచుకోవడానికి, మోసం చేయడానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు.
సరిదిద్దుకోవడం ఎలా?
వ్యక్తుల ప్రవర్తనా లోపాలను గుర్తించడం చాలా సంక్లిష్టమైనదే అయినప్పటికీ మానసిక ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్ట్‌లు, సైక్రియాట్రిస్ట్లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, సైకో థెరపిస్ట్‌లు ఎంతో నైపుణ్యతతో, సూక్ష్మ పరిశీలన ద్వారా, ఆధునిక పరికరాలతో వారి వారి పరిధు లకు లోబడి విశ్లేషణ చేయగలు గుతున్నారు. కౌన్సెలింగ్, పర్సనాలిటి డెవలప్మెంట్ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. వీటితో పాటు మనిషిలో పట్టుదల, మానసిక దఢత్వం ఉంటే ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఏర్పరుచుకోవచ్చు.
చికిత్స : 'దిగాలుకు దిక్కు లేదు మనాదికి మందు లేద'నేది గతంలో మన పూర్వీకులు వాడిన సామెత. ప్రస్తుతం దిగాలుకు దిక్కు ఉంది, మనాదికి మందు ఉంది. ఆధునిక పరిశోధనలతో ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోబడింది.
సైకాలజికల్ కౌన్సెలింగ్ & థెరపీ: సైకాలాజికల్ కౌన్సెలింగ్, సైకోథెరపీలు చాలా వరకు వారి ప్రవర్తనలో మార్పులను సరిదిద్దుకోవడానికి పనిచేస్తుంటాయి.
సైకాలజికల్ కౌన్సెలింగ్ : కౌన్సెలర్, కౌన్సెలీ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా, కొన్ని టెస్ట్‌లు నిర్వహించడం ద్వారా సమస్య తీవ్రత, దాని ప్రభావం ఆ వ్యక్తి పైన ఎంతవరకు ఉన్నది గుర్తించడం తద్వారా అతని ప్రవర్తనలో, వ్యక్తిత్వ లోపాల మూలాలను గుర్తిస్తారు. తదనుగుణంగా సైకాలజికల్ కౌన్సె లింగ్ ద్వారా అంతర్గతంగా తనలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ సమస్య పరిష్కారానికి మార్గాలను గుర్తింప చేయడం, అతనిలో ఆత్మవిశ్వాసం, సంకల్పం, పట్టుదల, మనో ధైర్యాన్ని కల్పించడం ద్వారా వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకొనే అవకాశం కల్పిస్తారు.
మెంటలైజేషన్ బేస్డ్ థెరపీ (MBT): వ్యక్తి గురించి పూర్తి అవగాహనతో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతరుల గురించి అవగాహన పొందడానికి దోహదం చేస్తుంది. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారికి ఈ థెరపీ చాలా సహాయ పడుతుంది.
కాగ్నిటివ్ బెహేవియరల్ థెరపీ (CBT): పాజిటివ్ ఆలోచనలను కలిగించడానికి, ప్రవర్తనలో మార్పు కోసం ఉపయోగపడే అత్యుత్తమైన థెరపీ.
కాగ్నిటివ్ అనాలిటికల్ థెరపీ (Cognitive Analytical Therapy): సమాజంతో తగు సంబంధా లను ఏర్పరుచుకోవడానికి, ప్రవర్తనలో మార్పులను సరి చేయడానికి దోహదపడే థెరపీ.
డైనమిక్ సైకోథెరపీ (Cognitive Analytical Therapy): గత అనుభవాలు ప్రస్తుత ప్రవర్తనలో మార్పుకు దోహదం చేసే అంశాలకు డైనమిక్ సైకోథెరపీ చాలా ఉపయోగపడుతుంది.
డయాలెక్టికల్ బిహేవియర్ థెరపీ (DBT): జైన్ బౌద్ధ మతస్తుల నుండి తీసుకున్న థెరపీ. బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారికి ఈ థెరపీ చాలా సహాయ పడుతుంది.
- డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, 9703935321
రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్