Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు ప్రథమ ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులే. వారి ప్రవర్తనను పిల్లలు తరువాతి కాలంలో పెరిగి పెద్దయ్యాక అనుకరిస్తారు. తమ పట్ల తల్లిదండ్రులు ఎల్లప్పుడు ప్రేమాభిమా నాలను చూపాలని పిల్లలు కోరుకుంటారు. కానీ వాస్తవంగా మన కుటుంబాల్లో జరుగుతున్నదేమిటి? ఒకసారి పరిశీలిద్దాం. తల్లిదండ్రులు నిత్య జీవితంలో తాము పడుతున్న చికాకుల న్నింటినీ కోపంతో పిల్లలపై ప్రదర్శిస్తారు. ఇది పొరపాటు. ఎవరికైనా చికాకులు రావడం సహజం. అయితే వాటిని పిల్లలపై ప్రదర్శించవద్దు. పసి మనస్సులను గాయ పర్చవద్దు. వారిని ప్రేమగా చూసుకోవాలి. అకారణంగా వారిని దూషించ వద్దు. పిల్లలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. వారు స్వంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వారిని పెంచాలి. జీవితంలో తమకు లభించే అనుభవం మూలంగా, వివిధ విషయాలను సవ్యంగా అవగాహన చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే పిల్లలు కొత్త విషయాలను నేర్చుకుంటారు. అందుకే పిల్లల్లో బాధ్యతా యుతమైన ప్రవర్తనను అలవరచడం కేవలం తల్లిదండ్రుల పెంపకం తీరుపైననే ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలందరిపై తండ్రి కంటే తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు మొదటి ఉపాధ్యాయురాలు తల్లి మాత్రమే. 4 సంవత్సరాల వయస్సులో పాఠశాలలకు వెళ్లే పిల్లలు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను ఆలకిస్తారు. తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నేటి పిల్లలే రేపు ఈ ప్రపంచాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసే పౌరులు. అందువలన పిల్లల మానసిక వికాసానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తోడ్పడాలి. అయితే ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు వ్యక్తిత్వ వికాస పాఠాలను బోధించాలి. కాగా మన పాఠ్యప్రణాళికలో ఈ అంశానికి సంబంధించిన పాఠాలు బోధించక పోవడం పెద్ద లోపంగా కనిపిస్తున్నది. కరణం రామచంద్రరావు గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశాలు ప్రవేశపెట్టే విషయంలో కొంత ప్రయత్నం జరిగినా వివిధ కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. కనీసం ఇప్పటికైనా ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు వికాస పాఠాలు బోధించాలి.ఈ విషయం లో విద్యాశాఖాధికారులు శ్రద్ధ వహించాలి. చిన్న పిల్లలు చెప్పే విషయాలను శ్రద్ధతో, ఆసక్తిగా వినాలి. తమ ఆలోచనలను, భావాలను పట్టించుకోకుండా తల్లిదండ్రులు తమను నిరాదరణ చేస్తున్నారని పిల్లలు గమనించినపుడు వారి నిరాశకు గురవుతారు. ఫలితంగా తాము తెలివి తక్కువవారమని, తమకు ప్రతిభలేదని భావిస్తారు. తాము ఇతరుల్లో ఆసక్తి ప్రేరేపించగలంతటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కాదని నిర్ణయించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుంటారు. అంతేకాకుండా తల్లిదండ్రుల ప్రేమాభిమానా లను చూరగొనే అర్హత తమకు లేదనుకుంటారు.అలా కాకుండా పూర్తి శ్రద్ధతో తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేవి వింటే వారెంతో సంబరపడి పోతారు. తాము చెప్పే విషయాలకు విలువ ఉందని భావిస్తారు. అదే సమయంలో వారు తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటారు. కర్మ సిద్దాం తాన్ని కాకుండా ఆత్మ విశ్వా సాన్ని నమ్ముకున్న పిల్లలు ఈ ప్రపంచంలో తమకు ఎదు రయ్యే సవాళ్లను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకుం టారు. విశ్లేషిస్తారు. ఆ సమస్యలను పరిష్కరిస్తారు. అనేక మంది తల్లిదండ్రులు తాము చేసే వ్యాఖ్యానాలు పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయన్న అంశాన్ని పట్టించుకోరు. చిన్నతనంలో తాము ఎదుర్కొన్న వ్యాఖ్యానాలను, విమర్శలను ఇప్పుడు తిరిగి తమ పిల్లలపై ప్రయోగిస్తారు. ఈ విషయంలో తల్లిదండ్రులు సంయమనంతో వ్యవహరించాలి. చిన్న పిల్లల్లో ద్వేషాన్ని, కోపాన్ని ప్రేరేపించే వ్యాఖ్యానాలు చేయడం పూర్తిగా మాని వేయాలి.
మొదట తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని గుర్తించాలి. వారికి ఇష్టమైన రంగంలోనే చదువు కునేందుకు స్వేచ్ఛనివ్వాలి. తల్లిదండ్రులు వారి సొంత అభిప్రాయాలను రుద్దకూడదు. వారు జీవితంలో స్థిరపడేందుకు తోడ్పడాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగ మంటే ఇష్టమున్న రమేష్‌కు వారి తల్లిదండ్రులు వైద్య విద్య అభ్యసించమని బలవంత పెట్టారు. వారి మాటను కాదనలేక రమేష్ మెడికల్ కోర్సులో చేరాడు. కానీ ఆయన మనసంతా తనకు ఇష్టమైన రంగం పైనే ఉంది. విశ్వనాథ్‌కు క్రీడాలంటే ఇష్టం. కానీ వాటి వల్ల జీవితంలో స్థిరపడలేవని ఆయనకు ఇంజనీరింగ్ విద్య చదవమన్నారు. అయిష్టంగానే ఆ కోర్సులో చేరిన విశ్వనాథ్ చదువులో రాణించలేక పోయాడు. వాస్తవంగా కౌమార దశలో ఉన్న విద్యార్ధికి చుట్టూ పరిస్థితులు, స్నేహితులు, ఉపాధ్యాయులు చెప్పే బోధనలతో కొన్ని అభి రుచులు సహజంగా ఏర్పడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఒక కోర్సును ఎన్నుకునే ముందు వారితో విపులంగా మాట్లా డాలి. వారు చెప్పే విషయాలకు, వారి ఆలోచనలకు, అభిరుచు లకు విలువనివ్వాలి. వాటిని కొట్టి పారేయకూడదు. 'నీ కేమి తెలియదు వెధవ, మేము చెప్పి నట్టు విను'. అప్పుడే నీవు బాగు పడుతావు. అని వారిని బెదిరించకూడదు. ఈ భూమ్మీద జన్మించిన ప్రతి వ్యక్తిలోనూ అపారమైన శక్తి సామర్థ్యాలుం టాయి. వాటిని గుర్తించి సానబెడితే ఈ ప్రపంచంలో అద్భు తాలు చేసే ఎంతో మంది పిల్లలు మన మధ్యనే ఉన్నారు. వారి ఃని గుర్తించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు తోడ్పడాలి.
- జి.గంగాధర్ సిర్ప,
8919668843