Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఈ సమాజం ఆరోగ్యవంతంగా మారుతుంది కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది మహిళ ఆరోగ్యం కానీ నేడు మహిళలను పట్టి పీడిస్తున్నది క్యాన్సర్ మహమ్మారి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5.1 లక్షల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు కొత్తగా 2.7 లక్షల మరణాలు సంభవిస్తే అందులో 80 శాతం మరణాలు అభివద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవిస్తున్నాయి ఇక మన దేశంలో ప్రతి ఏటా 1.22 లక్షల మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారని నిమిషానికి 14 మంది మహిళలు దీని కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు.హెచ్.ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది
అయితే మహిళల్లో సంభవించే క్యాన్సర్లలో 60 శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ కావడం మరో ఆందోళనకర విషయం
వ్యాధి కారకం :
ఈ వ్యాధికి ప్రధాన కారణం అనేక రకాలుగా గల human papilloma virus దీనిని అంటారు. దీనిలో 16 డ 18 అనే రకాలు 70% వ్యాధికి కారణం అయితే మిగతా 30శాతం 6డ11 ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
సాధారణంగా ఒకసారి ఈ వైరస్ సంక్రమిస్తే మనలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని చాలా వరకు నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సార్లు నెమ్మదిగా మార్చడానికి 10 నుండి 20 ఏళ్లు పడుతుంది పెద్దగా బాధలుండవు. కాబట్టి చాలా మంది స్త్రీలు దీన్ని నిర్లక్ష్యం చేసి క్యాన్సర్ ను కొని తెచ్చుకుంటున్నారు.
వ్యాధి వ్యాప్తికి కారణాలు :
1) హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఒకరి నుండి యింకొకరికి సోకడం
2) ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం
3) ఎక్కువ సంతానాన్ని కలిగి ఉండి 50 ఏళ్ల వయసు పైబడటం
4)చాలా చిన్న వయస్సు నుండే సంభోగంలో పాల్గొంటుండటం.
5) 35 సంవత్సరం పైబడి రుతుక్రమ సమస్యలతో బాధపడేవారు.
వ్యాధి లక్షణాలు :
1. రుతుక్రమాని కి రుతుక్రమానికి మధ్యన గానీ లైంగిక సంభోగం తర్వాత గానీ తర్వాత గానీ తీవ్రమైన రక్తస్రావం కావడం.
2. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
3.లైంగిక సంభోగ సమయంలో తీవ్రమైన నొప్పి
4.అసాధారణమైన స్రావాలు యోని నుండి దుర్వాసనతో రావడం.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముఖ్యంగా 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలకు:
I. 1. పాప్స్మియర్ పరీక్షలు గర్భాశయ ముఖద్వారం వద్ద సేకరించిన కణాల నమూనాలను పరీక్షించడం
2. షిల్స్ అయోడిన్ పరీక్ష
3. ఎసిటిక్ యాసిడ్ పరీక్ష
II. 1. గర్భాశయ ముఖద్వారాన్ని colposcope ద్వారా పరీక్షించడం.
2. కణజాల నమూనా పరీక్ష(బయోప్సి)
ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తీవ్రతను, వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించిన విధానాన్ని బట్టి నాలుగు నిర్వహించడం జరిగింది.
చికిత్సా విధానాలు :
- శస్త్రచికిత్స
- రేడియేషన్ థెరపీ
- కీమోథెరపీ రేడియేషన్, కీమోథెరపీ సంయుక్త చికిత్సా విధానం ద్వారా..
పోషకాహారం :
- ఈ క్యాన్సర్ బాధిత మహిళలు చికిత్సకు ముందు గాని చికిత్స సమయంలో గాని చికిత్స తర్వాత గాని పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరానికి సరిపడా బరువు శక్తి అవసరమైనందున అత్యధిక కేలరీలతో కూడిన ప్రోటీన్లు గల ఆహారం అవసరం.
చికిత్స తర్వాత పర్యవేక్షణ జాగ్రత్తలు :
చికిత్స తరువాత క్రమం తప్పకుండా ప్రతి మూడు నుండి ఆరు నెలలకోసారి భౌతిక పరీక్ష పరీక్ష, ఛాతి ఎక్స్రే ద్వారా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందవచ్చును.
వ్యాధి నిరోధకంగా HPV టీకా రక్షణ :
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చే టీకాలు రెండు రకాలుగా ఉన్నాయి
1. గార్దాసిల్ 2. సర్వరిక్స్
ఇందులో ఎక్కువగా గారు దాసి వాడకంలో ఉంది దీనిని తొమ్మిది సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు గల అమ్మాయిలు మహిళలు 0, 2, 6 నెలల్లో మొత్తం మూడు విడతలుగా ఇచ్చిన ఈ వ్యాధి రాకుండా వందశాతం నివారించవచ్చును.
- యెనుగందుల శంకర్,
M.Sc(Org.chem),
ఆరోగ్యవిస్తరణ అధికారి