Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న తుర్కపల్లి చిన్న చెరువులో నీటి పక్షుల్ని ఘాట్ చేసి కారు దగ్గరకు వస్తుంటే, ఇంకో చిన్న చెరువు గట్టు మీద ఉన్న ఎండిన ఈత కొమ్మపై green bee-eaters కనిపించాయి. ఇవి చాలా common గా ఉండే పక్షులు. పైగా, మనుషుల్ని చూసి పెద్దగా భయపడవు. ఫోటో తీసుకో డానికి కావాల్సినంత అవకాశం ఇస్తాయి. ఇవి ముఖ్యంగా ఎగిరే రెక్కల కీటకాలను గాల్లో ఎగురుతుండగానే లాఘవంగా పట్టి గుటకాయ స్వాహా చేస్తాయి. ఈ ఫొటోల్లో ఉన్న ఇవి రెండూ ఓ జంట. ఆడ పక్షి జత కట్టడానికి అనుకూలంగా సంకేతాలు ఇచ్చినా, మగ పక్షి ఎందుకో eating మీదే గానీ mating మీద ధ్యాస చూపలేదు. mating moment లో ఉన్న ఫోటోలు నా దగ్గర లేవు. అందుకోసమని చాలా సేపు wait చేశాను గానీ, మగ పక్షి మూడ్లో ఉన్నట్టుగా అనిపించ లేదు. సరే, మరో సారి అవకాశం వస్తుంది లే అని వచ్చేశాను. అందమైన బుల్లి బుల్లి సీతాకోక చిలుకల్ని ఇవి ఆరగిస్తుంటే కోపం వస్తుంది గానీ, అది ప్రకతి నియమం! దాన్ని మనం గౌరవించాలి! వీలైతే ఇలా ఫోటోలు తీసుకొని ఆనందించాలి!! అంతే!!
- ఎస్.ఎస్.బి గేరా